కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశంలోని విదేశీ ఆపరేటర్ల అంతర్జాతీయ రోమింగ్ సిమ్ కార్డులు/గ్లోబల్ కాలింగ్ కార్డుల విక్రయం/అద్దె కోసం ఎన్ఓసీ జారీ/ పునరుద్ధరణకు టెలికాం డిపార్ట్‌మెంట్ విధానం సవరణ
- సవరించిన విధానం విదేశాలను సందర్శించే భారతీయ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేలా యంత్రాంగాన్ని బలోపేతం చేస్తుంది
- ఎన్ఓసీ హోల్డర్ల విధానాలూ క్రమబద్ధీకరించబడ్డాయి
Posted On:
18 JAN 2022 12:27PM by PIB Hyderabad
టెలికాం రంగంలో ప్రారంభించిన విధాన సంస్కరణల్లో భాగంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (డీఓటీ) భారతదేశంలోని విదేశీ ఆపరేటర్ల అంతర్జాతీయ రోమింగ్ సిమ్ కార్డులు/గ్లోబల్ కాలింగ్ కార్డుల అమ్మకం/అద్దెకు ఎన్ఓసీ జారీ/పునరుద్ధరణ కోసం సవరించిన నిబంధనలు, షరతులను జారీ చేసింది. భారత దేశంలో విదేశీ ఆపరేటర్ల అంతర్జాతీయ రోమింగ్ సిమ్ కార్డుల/గ్లోబల్ కాలింగ్ కార్డుల విక్రయం/ అద్దెపై ట్రాయ్ యొక్క సుయో-మోటు సిఫార్సులపై చర్చించిన తర్వాత సవరించిన నిబంధనలు, షరతులను డీఓటీ ఖరారు చేసింది. సవరించిన నిబంధనలు, షరతులు విదేశాలకు వెళ్లే భారతీయుల పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడానికి గాను యంత్రాంగాన్ని బలోపేతం చేస్తుంది. ఇతర లైసెన్స్‌లు/రిజిస్ట్రేషన్‌లకు అనుగుణంగా విధానాలను కూడా క్రమబద్ధీకరిస్తాయి కస్టమర్ కేర్ సర్వీస్, సంప్రదింపు వివరాలు, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్, ఐటమైజ్డ్ బిల్లులు, టారిఫ్ ప్లాన్‌లకు సంబంధించిన సమాచారం, అందించే సేవలు మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి ఎన్ఓసీ హోల్డర్‌ల సవరించిన విధానాన్ని తప్పనిసరి చేస్తుంది. డాట్‌లో అప్పీలేట్ అథారిటీ కోసం ఎన్‌ఓసి హోల్డర్‌ల ద్వారా ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు వీలుగా బిల్లింగ్, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి కూడా తగిన ఏర్పాట్లు చేయబడ్డాయి.
ఇంకా, సవరించిన విధానం డీఓటీలోని ఇతర లైసెన్స్‌లు/రిజిస్ట్రేషన్‌లు మొదలైన వాటికి అనుగుణంగా ఎన్ఓసీ హోల్డర్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియ /ఇతర విధానాలను క్రమబద్ధీకరిస్తుంది. ఎన్‌ఓసీ కలిగినవారి సమస్యల పరిష్కారం/ నిర్వహణను కూడా సులభతరం చేస్తుంది.
***
(Release ID: 1790822)
Visitor Counter : 164