సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
వరల్డ్ ఎక్స్‌పో , 2020 దుబాయ్ లో ఎం.ఎస్.ఎం.ఇ పెవిలియన్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనారాయణ్ రాణే, కేంద్ర సహాయమంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ,ఖాదీ ఇండియా ఫిల్మ్ సైతం ఆవిష్కరణ
Posted On:
17 JAN 2022 1:11PM by PIB Hyderabad
కేంద్ర ఎం.ఎస్.ఎం.ఇ శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే, కేంద్ర ఎం.ఎస్.ఎం.ఇ శాఖ సహాయ మంత్రి శ్రీ భానుప్రతాప్ సింగ్ వర్మలు ఎం.ఎస్.ఎం.ఇ కార్యదర్శి బి.బి.స్వైన్, కెవిఐసి ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనాతో కలిసి 2020 బుబాయ్ వరల్డ్ ఎక్స్‌పోలో ఎం.ఎస్.ఎం. ఇ పెవిలియన్‌ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. దుబాయ్ ప్రభుత్వ అధికారులు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి 2020 దుబాయ్ వరల్డ్ ఎక్స్‌పోలో పాల్గొంటున్న వారి సమక్షంలో దీనిని ప్రారంభించారు. వరల్డ్ ఎక్స్ పో 2020 దుబాయ్ బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్‌పొజిషన్స్ (బిఐఇ) నేత్రుత్వంలో నిరర్వహిస్తున్నారు. కనెక్టింగ్ మైండ్స్ , క్రియేటింగ్ ఫ్యూచర్ ఇతివృత్తంతో మానవ మేధస్సు, సాధించిన విజయాలను ప్రదర్శించేందుకు లక్షలాది మంది ప్రజలను అనుసంధానం చేసే ప్రపంచ ప్రఖ్యాత ప్రదర్శన ఇది.
ఎం.ఎస్ ఎం ఇ ఈ ఎక్స్ పో లో పాల్గొనడం వల్ల ఇండియాలో ఎం.ఎస్.ఎం.ఇ వాతావరణానికి సంబంధించి అవగాహనను పెంపొందించుకోవడానికి , వివిధ దేశాల ప్రభుత్వాతలతో , వ్యాపా వర్గాలు, పరిశ్రమ నాయకులతో మాట్లాడడానికి , ప్రపంచవ్యాప్తంగా గల మంచి విధానాలను ఇచ్చిపుచ్చుకోవడానికి వీలు కల్పిస్తుంది.
కెవిఐసి రూపొందించిన ఖాదీ ఇండియా ఫిల్మ్ ను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సందర్బంగా ప్రారంభోపన్యాసం చేస్తూ శ్రీ రాణే, ఉద్యోగాల కల్పన, తయారీ రంగ పునాదిని విస్తృతం చేయడానికి ఎం.ఎస్.ఎం.ఇ రంగం కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఎం.ఎస్.ఎం. ఇ రంగంలో 6 కోట్ల యూనిట్లు ఉన్నాయని, సుమారు 11 కోట్ల మందికి ఇది ఉపాధి కల్పిస్తున్నదని అన్నారు. ఇది ఆర్థిక రంగానికి చెప్పుకోదగిన చేయత నిస్తున్నదని చెప్పారు. జిడిపికి 30 శాతం పైగా వాటను, ఇండియానుంచి ఎగుమతి అయ్యే వాటిలో 48 శాతం వాటాను ఇది కలిగి ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎం.ఎస్.ఎం.ఇలకు ఒక ప్రామాణికత తీసుకురాడానికి ఎం.ఎస్.ఎం. ఇ మంత్రిత్వశాఖ కృషిచేస్తున్నట్టు చెప్పారు. ఎగుమతులు, నాణ్యమైన ఉత్పత్తులు, జిడిపికి వాటా పెంపు, ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాల కల్పన,దేశంలో నడుస్తున్న అన్ని ఎం.ఎస్.ఎం. ఇలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కల్పనపై ఎం.ఎస్.ఎం. ఇ మంత్రిత్వశాఖ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు.
కేంద్ర సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ వర్మ మాట్లాడుతూ, ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ , ఎం.ఎస్.ఎం. ఇ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు పలు కీలక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఫైనాన్స్ పెసిలిటేషన్, సామర్ధ్యాలనిర్మాణం, నైపుణ్యాల శిక్షణ, మార్కెట్ లింకేజ్‌కి ఏర్పాటు, సాంకేతికత అభివృద్ధి తదితరాల వంటివి దేశవ్యాప్తంగా ఎం.ఎస్.ఎం.ఇ రంగం అభివృద్ధికి దోహదపడగలవని అన్నారు.
***
(Release ID: 1790716)
Visitor Counter : 170