మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూనివర్సిటీలు మరియు కాలేజీల కోసం మేధో సంపత్తి హక్కులపై (ఐపిఆర్) ఆన్‌లైన్ వర్క్‌షాప్ నిర్వహించింది
Posted On:
17 JAN 2022 7:07PM by PIB Hyderabad
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఈరోజు విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఐకానిక్ వీక్‌లో భాగంగా మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్)పై విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలకు ఆన్‌లైన్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యా శాఖ జాయింట్ సెక్రటరీ (ఐసీసీ అండ్ విఐజీ) శ్రీమతి నీతా ప్రసాద్, వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిబిఐఐటీ & సిజిపిడిటిఎం జాయింట్ సెక్రటరీ శ్రీ రాజేంద్ర రత్నూ మరియు యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ రజనీష్ జైన్ ప్రారంభ సెషన్‌లో ప్రసంగించారు.
యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్. రజనీష్ జైన్ ఐపీఆర్ స్వాగత ప్రసంగం చేస్తూ.. దేశ ప్రతిష్టలో దాని ప్రాముఖ్యతను మరియు దేశం యొక్క జ్ఞాన సమూహాన్ని నిర్మించడంలో దాని ఔచిత్యాన్ని మరియు దాని చట్టపరమైన అంశాలను ప్రముఖంగా తెలియజేశారు. సృష్టికర్త మరియు ఆవిష్కర్తగా భారతదేశ స్థానం చారిత్రక అంశంపై ఆయన హైలెట్ చేశారు. ఐపీఆర్ గురించి అవగాహన కల్పించడంలో ఈ రోజు చర్చలు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యా శాఖ జాయింట్ సెక్రటరీ (ఐసీసీ & విఐజీ) శ్రీమతి నీతా ప్రసాద్ తన ప్రత్యేక ప్రసంగంలో ఆవిష్కరణ, పరిశోధన మరియు సృజనాత్మకతకు పునాదిగా మేధో సంపత్తి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. దేశంలో బలమైన ఆవిష్కరణ మరియు ఐపీఆర్ సంస్కృతిని సృష్టించేందుకు భారతదేశంలో అవసరమైన చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. దాని ఫలితంగా సంబంధిత ఆవిష్కరణలు మరియు ఐపీ సంఖ్యలు గణనీయంగా మెరుగుపడతాయని వివరించార. అయితే అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఐపీఆర్ పరంగా భారతదేశం చాలా దేశాల కంటే వెనుకబడి ఉంది. పేటెంట్ల దాఖలుపై విద్యార్థుల్లో అవగాహన లేకపోవడమే అందుకు కారణమని ఆమె వెల్లడించారు.
అక్టోబర్ 2020లో ఐపీ అక్షరాస్యత మరియు అవగాహన కోసం ప్రారంభించబడిన కపిల కార్యక్రమం, పేటెంట్ దాఖలు చేయడానికి రుసుము తగ్గింపు వంటి అంశాలలో ప్రభుత్వం యొక్క చొరవ గురించి ఆమె తెలియజేశారు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా సంబంధిత ఐపీఆర్‌ల ద్వారా విజ్ఞానం మరియు ఆవిష్కరణలను ముందస్తుగా రక్షించడం ద్వారా ముందుకు వెళ్లే మార్గం అని సూచిస్తూ ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.
కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిబిఐఐటీ & సిజీపిడిటిఎం సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేంద్ర రత్నూ ముఖ్యోపన్యాసం చేస్తూ.. కలిసి పనిచేయడం ద్వారా శక్తిని సినర్జీగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆటంకాలు కల్పించకుండా అందరూ సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కళ మరియు సైన్స్ రెండింటిలోనూ ఆవిష్కరణ మరియు సృష్టిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మరియు సామూహిక సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
పరిశ్రమలు, విద్యాసంస్థలు మరియు ఐపీఆర్ రిజిస్ట్రీ మధ్య భాగస్వామ్యం ముఖ్యమైనదని ఆయన అన్నారు.
ప్రారంభ సెషన్ తర్వాత ఐపీ రంగంలోని నిపుణులచే ప్రసంగించబడిన సాంకేతిక సెషన్ థీమ్‌పై అవలోకనాన్ని అందించింది.
పేటెంట్స్ & డిజైన్స్ అసిస్టెంట్ కంట్రోలర్ డా. ఉషా రావు మేధో సంపత్తి హక్కుల స్థూలదృష్టిని సమర్పించారు. ఐపీఆర్ యొక్క ఆవశ్యకత మరియు ప్రాముఖ్యత మరియు వివిధ రకాల ఐపీ మరియు వాటి పాలక సంస్థల గురించి ఆమె అంతర్దృష్టిని అందించారు. భారతదేశంలోని ఐపీఆర్ యొక్క వివిధ చట్టాలు మరియు నియమాలపై కూడా ఆమె అవగాహన కల్పించారు. పేటెంట్ ప్రక్రియలను దాఖలు చేసే వివిధ మార్గాలను కూడా ఆమె చర్చించారు.
టెక్నికల్ రౌండ్‌కు మరో నిపుణులు అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్ & డిజైన్స్ శ్రీ సుఖదీప్ సింగ్ ఐపీఆర్ రంగంలో విద్యాసంస్థలకు సంబంధించిన వివిధ పథకాలు మరియు అధికారాలను ప్రస్తావించారు. యూనివర్శిటీలలో ఐపీ మేనేజ్‌మెంట్ సెల్‌ల స్థాపన, మాస్టర్ ట్రైనర్‌లను కలిగి ఉండటం మరియు టిఐఎస్‌సిలను స్థాపించడం వంటివి ముందుకు సాగుతాయని పేర్కొంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
యూజీఎసీ అడిషనల్ సెక్రటరీ డాక్టర్ సురేందర్ సింగ్ ధన్యవాదాలతో వెబ్‌నార్ ముగిసింది. హెచ్ఈఐలకు ఐపీఆర్ సంబంధిత అంశాలను వెబ్‌నార్ చర్చించింది. అలాగే ఐపీఆర్ అవగాహనకు ఇదిఒక ముఖ్యమైన అడుగు.
*****
(Release ID: 1790604)