వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఈ మామిడి సీజన్‌లో భారతీయ మామిడి పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు కేంద్రం ఆమోదం


2022లో మామిడి పండ్ల ఎగుమతులు 2019-20 కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా


భారతదేశ ఈశాన్య ప్రాంతాల నుంచి మామిడి పండ్ల ఎగుమతిని పెంచడానికి అమెరికా వ్యవసాయ శాఖ- USDA ఆమోదం

2017-2020 సంవత్సరం నుంచి అమెరికాకి ఎగుమతి అయిన మామిడిపండ్లు 3,000 మెట్రిక్ టన్నులు

Posted On: 11 JAN 2022 4:36PM by PIB Hyderabad

కొత్త సీజన్‌లో అమెరికాకు భారతీయ మామిడి పళ్లను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్‌డిఎ) అనుమతిని పొందింది. అమెరికాలోని   వినియోగదారులకు ఇప్పుడు భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే అద్భుతమైన నాణ్యమైన మామిడిపండ్లు అందుబాటులో ఉంటాయి.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై విధించిన పరిమితుల కారణంగా వికిరణ  సదుపాయాన్ని (పురుగు పట్టకుండా చేసే ప్రక్రియ) తనిఖీ చేయడానికి అమెరికా వ్యవసాయశాఖ అధికారులు భారతదేశాన్ని సందర్శించలేకపోయినందున భారతీయ మామిడి పండ్ల ఎగుమతిని USA 2020 నుండి పరిమితం చేసింది.

 నవంబర్ 23, 2021న భారతదేశం - అమెరికాల మధ్య జరిగిన 12వ  ట్రేడ్ పాలసీ ఫోరమ్ (TPF)/ అమెరికా వర్తక విధాన  వేదిక సమావేశంలో , అమెరికా వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖతోపాటు  అమెరికా వ్యవసాయ శాఖ (USDA) రెండువైపులా ఉత్పన్నమయ్యే వ్యవసాయ  మార్కెట్ అందుబాటుకు సంబంధించిన సమస్యల పరిష్కారం  కోసం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.

ఒప్పందం ప్రకారం,  భారతదేశం నుంచి  మామిడి , దానిమ్మపళ్ళ  ఎగుమతులు అమెరికా నుంచి  చెర్రీ,  అల్ఫాల్ఫా ఎండుగడ్డి దిగుమతికి వికిరణ విధానం పై  భారతదేశం, అమెరికా కలిసి  ఉమ్మడి ఒడంబడికను అనుసరిస్తాయి.

రెండు దేశాల పరస్పర అంగీకారంతో  వికిరణ విధానం  ముందస్తు అనుమతుల  పర్యవేక్షణను దశల వారీగా భారతదేశానికి బదిలీ చేయడం కోసం సవరించిన పని ప్రణాళికను రూపొందించారు.

పరస్పర ఒప్పందంలో భాగంగా, ఆల్ఫోన్సో రకం మామిడిని రాబోయే  మామిడి సీజన్‌లో భారతదేశం నుంచి మార్చి లో అమెరికాకి ఎగుమతి అవుతుంది. ముఖ్యంగా, 2017-18 లో భారతదేశం 800 మెట్రిక్ టన్నుల  మామిడిని అమెరికాకి ఎగుమతి చేసింది. ఆ పండ్ల ఎగుమతుల విలువ  2.75 మిలియన్ల  అమెరికన్ డాలర్లు. అమెరికాలో భారతీయ మామిడిపండ్లకు వినియోగదారుల నుంచి  భారీ ఆదరణ, ప్రాధాన్యత ఉంది.

అదేవిధంగా, 2018-19లో  3.63 మిలియన్ డాలర్ల విలువగల  951 మెట్రిక్ టన్నుల  మామిడిపండ్లు అమెరికాకు  ఎగుమతి అయ్యాయి. 2019-20లో 1,095 మెట్రిక్ టన్నుల   4.35 మిలియన్ డాలర్ల  మామిడిపండ్లు ఎగుమతి అయ్యాయి.

ఎగుమతిదారుల నుంచి అందిన అంచనాల ప్రకారం, 2022లో మామిడి ఎగుమతి 2019-20 గణాంకాలను అధిగమించవచ్చు.

అమెరికా వ్యవసాయ శాఖ  ఆమోదం వల్ల మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి సాంప్రదాయ మామిడి ఉత్పత్తి ప్రాంతాల  నుంచి ఎగుమతులకు మార్గం సుగమం అవుతుంది..

వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి లాంగ్రా, చౌసా, దుషెహ్రీ, ఫాజ్లీ వంటి ఉత్తర మరియు తూర్పు భారతదేశపు ఇతర రుచికరమైన మామిడి పండ్ల రకాలను  ఎగుమతి చేయడానికి కూడా అవకాశం కల్పిస్తుందని తెలిపింది.

ఏప్రిల్ 2022 నుంచి దానిమ్మ ఎగుమతులు. అలాగే అల్ఫాల్ఫా ఎండుగడ్డి, చెర్రీస్ ఎగుమతులు ఏప్రిల్ 2022లో ప్రారంభమవుతాయి.

***



(Release ID: 1789296) Visitor Counter : 332