యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
25 వ జాతీయ యువజన ఉత్సవాలను రేపు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
జాతీయ సమైక్యతను బలోపేతం చేసి యువతలో మత సామరస్యం మరియు సోదరభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా యువజన ఉత్సవాల నిర్వహణ
Posted On:
11 JAN 2022 4:08PM by PIB Hyderabad
ముఖ్య అంశాలు:
* వర్చువల్ విధానంలో 25 వ జాతీయ ఉత్సవాల వివరాలను మీడియాకు వివరించిన యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి
25 వ జాతీయ ఉత్సవాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. పుదుచ్చేరి లో జరిగే ఉత్సవాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రేపు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. తత్వవేత్త మరియు ఆలోచనాపరుడు అయిన స్వామి వివేకానంద జయంతి అయిన జనవరి 12వ తేదీని ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించడం జరుగుతోంది. భారతదేశంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్వామి వివేకానంద ఉపన్యాసాలు, బోధలు ఉంటాయి. వర్చువల్ విధానంలో యువజన ఉత్సవాల వివరాలను కేంద్ర యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి ఉషా శర్మ మీడియాకు తెలిపారు. యువత ఆలోచనా దృక్పథం పరిస్థితులకు అనుగుణంగా మారేలా చూసి జాతి నిర్మాణంలో వారిని ఐక్య శక్తిగా తీర్సి దిద్దాలన్న లక్ష్యంతో ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
కోవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం యువజన ఉత్సవాలను 2022 జనవరి 12-13 తేదీల్లో వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నామని శ్రీమతి శర్మ వివరించారు. ప్రారంభోత్సవం తర్వాత జాతీయ యువజన శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. జాతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా యువతలో స్ఫూర్తి నింపేందుకు శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తామని శ్రీమతి శర్మ వివరించారు. భౌగోళికంగా వేరు అయినప్పటికీ దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలన్న తపనను యువతలో కలిగిస్తామని అన్నారు. పర్యావరణం, వాతావరణ మార్పులు, స్వదేశీ ప్రాచీన విజ్ఞానం, దేశాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, నూతన అంశంలా ఆవిష్కరణ, వ్యవస్థాపక శక్తి లాంటి అంశాలపై సదస్సులో పాల్గొనే యువతీ యువకులు తమ అభిప్రాయాలను వివరించడానికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. సదస్సు సందర్భంగా ఆరోవిల్, పుదుచ్చేరి చరిత్ర, ప్రత్యేకతతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్వదేశీ క్రీడలు, జానపద నృత్యాలు మొదలైన అంశాలపై అవగాహన పొందేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి తెలిపారు. సంగీత విభావరి, ఆరోవిల్, ఆర్ట్ అఫ్ లివింగ్ శిక్షకులు యోగాపై ఇచ్చే ప్రదర్శనలు సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని ఆమె వివరించారు.
వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న యువజన ఉత్సవాల్లో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి తెలిపారు. తమలో ఉన్న ప్రతిభా పాటవాలను ప్రదర్శించే అవకాశాన్ని దేశ యువతకు కల్పించాలన్న లక్యంతో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ పెద్ద ఎత్తున యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నదని అన్నారు. వివిధ అంశాలలో తమకున్న ప్రతిభను దేశాభివృద్ధికి ఉపయోగపడేలా యువతను ఒక వేదిక పైకి ఈ ఉత్సవాలు పనిచేస్తాయని అన్నారు.
75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశం సాధించిన విజయాల స్ఫూర్తిగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను నిర్వహిస్తున్న సమయంలో దేశ జనాభాలో యువత నిర్మాణాత్మక శక్తిగా, కీలక పాత్ర పోషిస్తున్నారన్న అంశాన్ని గుర్తించాలని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి అన్నారు. జాతీయ యువజనోత్సవం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడమే కాకుండా దేశంలోని యువతలో మత సామరస్యం మరియు సోదరభావాన్ని వ్యాప్తి చేస్తుందని పేర్కొన్నారు. "మినీ-ఇండియా గా నిర్వహించే ఉత్సవాల్లో యువత తమ భావాలు, అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఒక ప్రాంత సామాజిక మరియు సాంస్కృతిక ప్రత్యేకత అన్ని ప్రాంతాలకు తెలుస్తుంది. విభిన్న సామాజిక-సాంస్కృతిక పరిసరాల సమ్మేళనంతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నిర్మాణం జరుగుతుంది ” అని కార్యదర్శి తెలిపారు.
భారత స్వాతంత్ర్యపోరాటంలో శ్రీ అరబిందో, మహాకవి సుబ్రహ్మణ్య భారతి కీలక పాత్ర పోషించారు. వారు సాహిత్య రచనల ద్వారా దేశ పౌరులలో జాతీయవాద స్ఫూర్తిని పెంపొందించడానికి కృషి చేశారు. వారు చేసిన కృషికి నివాళిగా 25వ జాతీయ యువజనోత్సవాలు శ్రీ అరబిందో మరియు మహాకవి సుబ్రహ్మణ్య భారతి ఆలోచనలతో నిండిన పుదుచ్చేరిలో జరగనున్నాయి. ఈ సందర్భంగా “మేరే సప్నో కా భారత్” మరియు “అన్‌సంగ్ హీరోస్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడం మూవ్‌మెంట్” పై ఎంపిక చేసిన వ్యాసాలను ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు. ఈ వ్యాసాలు రెండు లక్షకు పైగా యువత సమర్పించిన వాటి నుంచి ఎంపిక చేయబడ్డాయి.
ప్రధానమంత్రి ప్రారంభించే సదస్సుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1788871
***
(Release ID: 1789180)
Visitor Counter : 190