పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాన్ కెర్రీతో మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ టెలిఫోన్‌ చర్చలు

Posted On: 11 JAN 2022 12:17AM by PIB Hyderabad

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ 10 జనవరి, 2022న.. భార‌త కాల‌మాన ప్ర‌కారం సాయంత్రం 19.00 గంట‌ల‌కు..  ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ విష‌య‌మై అమెరికా అధ్యక్ష ప్ర‌త్యేక ప్రతినిధి శ్రీ జాన్ కెర్రీతో టెలిఫోన్‌లో మాట్లాడారు.  కాప్ 26 (COP26) సమయంలో ప్రకటించిన భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక వాతావరణ కార్యాచరణ లక్ష్యాలతో సహా విస్తృతమైన సమస్యలపై వారిద్ద‌రు చర్చించారు. క్లైమేట్ యాంబిషన్, ఫైనాన్స్ మొబిలైజేషన్, అడాప్టేషన్ మరియు రెసిలెన్స్ మరియు ఫారెస్ట్రీ అనే నాలుగు స్తంభాపై భారతదేశం - యుఎస్ క్లైమేట్ యాక్షన్ అండ్ ఫైనాన్స్ మొబిలైజేషన్ డైలాగ్ (సీఎఎఫ్‌ఎమ్‌డీ)ని ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఇరువురు నేతలు చర్చించారు.  గ్లాస్గోలో ప్రధాని మోదీ చేసిన వన్ వర్డ్ క్యాంపెయిన్ ఎల్‌.ఐ.ఎఫ్‌.ఈ (పర్యావరణ జీవనశైలి)పై దృష్టి సారించాల్సిన ప్రాముఖ్యతను,  ఆవశ్యకతను గురించి శ్రీ యాదవ్  టెలిఫోన్ చ‌ర్చ‌ల సంద‌ర్భంగా ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. మేజర్ ఎకానమీ ఫోరమ్ (ఎంఈఎఫ్‌) యొక్క రాబోయే సమావేశం గురించి కూడా నాయకులిరువురు చర్చించారు.
                                                                       

***


(Release ID: 1789099) Visitor Counter : 185