రైల్వే మంత్రిత్వ శాఖ
కోవిడ్ కేర్ సెంటర్లకు 14 వేల టన్నులకు పైగా ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ రవాణాచేయడం జరిగింది.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకానికి మద్దతుగా రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల సరఫరా.
495 కిలోమీటర్ల విభాగంలో రైళ్ల సెక్షనల్ వేగం పెంపు.
ఉత్తర రైల్వేలో 70 శాతం రూట్ కిలోమీటర్లకు పైగా విద్యుదీకరణ పూర్తి.
కేంద్ర, డివిజినల్ ఆస్పత్రులలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు.
జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లలో పలువురు క్రీడాకారులు మెడల్స్ సాధించారు.
మూడు హిమాలయ ప్రాజెక్టులైన యుఎస్‌బిఆర్ఎల్, రిషికేష్- కర్ణప్రయాగ్ బ్రాడ్ గేజ్ లైన్, బిలాస్‌పూర్- మనాలి- లెహ్ లైన్ ఎఫ్ ఎల్ ఎస్ పురోగతిలో ఉంది.
Posted On:
08 JAN 2022 1:12PM by PIB Hyderabad
ఆక్సిజన్ రైళ్ళు:
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలలోని కోవిడ్ కేర్ సెంటర్లు, ఆస్పత్రులకు ఉత్తర రైల్వే గ్రీన్ కారిడార్ ద్వారా 858 ప్రత్యేక సరకురవాణా రైళ్ల లో 14,403 టన్నుల ఆక్సిజన్ ను క్రయోజనిక్ ట్యాంక్‌లలో , అలాగే రోల్ ఆన్ రోల్ ఆఫ్ రోడ్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం జరిగింది. భారతీయ రైల్వే రవాణా చేసిన మొత్తం ద్రవరూప మెడికల్ ఆక్సిజన్‌లో ఇది 50 శాతం.
సరకు రవాణా:
బహుళ రంగ సరుకు రవాణా వ్యాపార అభివృద్ధి యూనిట్లు (బిడియు) జోనల్, డివిజనల్ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తర రైల్వేలో 44 గూడ్సు షెడ్లను పునరుద్ధరిస్తున్నారు, అదనపు లోడింగ్, అన్ లోడింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఉత్తర రైల్వే రికార్డు స్థాయిలో 26 మిలియన్ టన్నుల ఆహార పదార్ధాలను 2021 ఏప్రిల్ -డిసెంబర్ మధ్య కాలంలో వివిధ రాష్ట్రాలకు , ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రతా పథకం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకానికి మద్దతుగా రవాణా చేసింది. ఉత్తర రైల్వే ఏప్రిల్-డిసెంబర్ 2021 నుండి ఇప్పటివరకు అత్యధికంగా 7,064 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. రాయితీ రవాణా ధరలకు దేశ రాజధానికి పండ్లు , కూరగాయలను నిరంతరాయంగా సరఫరా చేయడానికి వివిధ రాష్ట్రాల నుండి ఉత్తర రైల్వే ద్వారా కిసాన్ రైళ్లు నడుపుతున్నారు.
రైలు సర్వీసులు:
గుజరాత్‌లోని కెవాడియలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్‌కు హజరత్ నిజాముద్దీన్ నుంచి వారణాసి వరకు రైలు సర్వీసులను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఉత్తరాది రాష్ట్రాల వారు ఐక్యతా విగ్రహ సందర్శనకు వెళల్డానికి ఇది సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలు కల్పిస్తుంది.కె.ఎస్.ఆర్, కంగ్రా వ్యాలీ కొండ ప్రాంత స్టేషన్లకు సర్వీసులను పునరుద్ధరించడం జరిగింది. కాల్కా- సిమ్లా రైలు సెక్షన్ లో హాప్ ఆన్ హాప్ ఆఫ్ సదుపాయాన్ని పర్యాటకులకోసం పునరుద్ధరించారు. ఈ జోన్ పాసింజర్ రై్ళ్ల ప్రయాణ సమయానికి సంబంధించి వేళలు పాటించడంలో 92 శాతం పైగా కచ్చితమైన పనితీరును కనబరుస్తోంది.
భద్రత :
భద్రత కు ఎప్పుడూ పెద్ద పీట వేయడం జరుగుతోంది. రైల్ళు పరస్పరం ఢీకొనడం వంటి సంఘటనలవల్ల ప్రమాదాలు ఈ జోన్‌లో జరగలేదు. ఈ జోన్‌లో రైళ్లు పట్టాలు తప్పిన ఘటనలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 44 శాతం వరకు తగ్గాయి. 2018-19 సంవత్సరంలో ఉత్తర రైల్వేలో కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్‌లు అన్నీ తొలగించారు. ప్రస్తుతంం కాపలా ఉన్న లెవల్ క్రాసింగ్ లను ఆర్.ఒ.బిలుగా లేదా ఆర్ .యు.బిలుగా మారుస్తున్నారు. కొన్ని లెవల్ క్రాసింగ్‌లను ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బారియర్లతో అత్యధిక రోడ్డు భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ కు సంబంధించి సురక్షిత కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆ వ్యవస్థను ఆధునీకరించారు. అన్ని రైళ్ళలోని లోకో పైలట్లకు ఫాగ్ సేఫ్టీ పరికరాలు సమకూర్చారు. చలికాలంలో, వేసవికాలంలో రైలు పట్టాలు తరచూ దెబ్బతినడం వంటి వాటిని సకాలంలో గుర్తించేందుకు రాత్రి వేళ గస్తీని ముమ్మరం చేశారు. ట్రాక్ లోపాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి , గస్తీ సిబ్బందికి జిపిఎస్ ఆధారిత , చేతిలో ఇమిడే ట్రాకర్లను సమకూర్చారు.
ఆస్తుల నిర్వహణ :
ఆస్తుల నిర్వహణ, వాటి స్థాయిపెంపు ను రెగ్యులర్ గా చేస్తున్నారు. ఎల్‌హెచ్‌బి ఓవర్ హాలింగ్ ను లక్నోలోని అలంబాగ్ వర్క్ షాప్‌లో 14 రోజుల రికార్డు వ్యవధిలో యాంత్రికంగా క్లీనింగ్ చేపడుతున్నారు. ఐసిఎఫ్ రేక్ ల అంతర్ భాగాలు, నారోగేజ్ రేక్‌లను ప్రాజెక్ట్ ఉత్కృష్ట్ కింద ఉన్నతీకరిస్తున్నారు. దీనితో ప్రయాణికులకు చూడడానికి ఇవి అందంగా ఉండనున్నాయి. ఉత్తర రైల్వే కి చెందిన కోచ్‌లలో బయో వాక్యూమ్ టాయిలెట్లను రెట్రో ఫిట్ చేస్తున్నారు. రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండేళ్ల సర్వీసును పూర్తి చేశాయి. వారణాసి, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా క్షేత్రాలను సందర్శించే ప్రయాణికులలో ఇవి ఎంతో పాపులర్ అయ్యాయి. 495 కిలోమీటర్ల భాగంలో రైళ్ల సెక్షనల్ స్పీడు ను పెంచారు. పలు చోట్ల శాస్వత స్పీడ్ కు సంబంధించిన ఆంక్షలు తొలగించారు.
రైలు ప్రాజెక్టులు :
ఉత్తర రైల్వేలోని యుఎస్బిఆర్ ఎల్ ,రిషికేష్-కర్ణప్రయాగ్బ్రాడ్ గేజ్ లైన్, బిలాస్ పూర్ – మనాలి- లెహ్ ఎఫ్ ఎల్ ఎస్ లైన్,ఈ మూడు హిమాలయన్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.యుఎస్ బిఆర్ ల్ ప్రాజెక్టుకు సంబంధించి కత్ర- బనిహల్ సెక్షన్ లో మిగిలిన యుఎస్ బిఆర్ ఎల్ ప్రాజెక్టు, ప్రతిష్ఠాత్మక చినాబ్ బ్రిడ్జి ఆర్చ్ పనులు 2021 ఏప్రిల్ లోపూర్తి అయ్యాయి., 3 టన్నెల్ళు, 3 బ్రిడ్జిలకు సంబంధించిన పనులు, 15 కిలోమీటర్ల మేరటన్నెల్ మైనింగ్ కార్యకలాపాలు, కోవిడ్ పరిస్థితులలోనూ పూర్తి అయ్యాయి. రిషికేష్- కర్ణప్రయాగ్ లైన్ కు సంబంధించిటన్నెలింగ్, బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. యోగ్నగారి రిషికేష్ కొత్త అద్భుతరైల్వే స్టేషన్ కొండ దిగువన ఏర్పాటు చేశారు.
విద్యుదీకరణ :
రైల్వేశాఖ నూరుశాతం విద్యుదీకరణ మిషన్ దిశగా క్రుషి చేస్తోంది. ఉత్తర రైల్వేలో 70 శాతం రూట్ కిలోమీటర్లుపైగా విద్యుదీకరణ అయింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ లలో ఓపెన్ యాక్సెస్ ద్వారా తక్కువ ధరకు ఉత్తర రైల్వే విద్యుత్ సమకూర్చుకుంటున్నది.ఫలితంగా ట్రాక్షన్ ఇంధన బిల్లు ఈ రాష్ట్రాలలో 300 కోట్ల రూపాయల మేరకు ఆదా అయింది. పర్యావరణ హితకరమైన రీతిలో హెడ్ ఆన్ జనరేషన్ పథకాన్ని అన్ని 90 ఎల్ హెచ్ బి ప్రైమరీ ఇ ఒ జి రైళ్లకు వర్తింపచేశారు.దీనితో హైస్పీడ్ డీజిల్ నాలుగునెలల కాలంలో 33 కోట్ల రూపాయలు ఆదా అయింది. 12 వేట టన్నుల కార్బన్ క్రెడిట్ లు రైల్వేకి లభించాయి.
ప్రత్యామ్నాయ ఇంధన ఉపయోగం:
సౌర ఇంధన వినియోగానికి, జోన్ అంతటా గ్రిడ్ తో అనుసంధానమైన మీటర్లు కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటినుంచి 40 లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఫలితంగా 3,251 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి.
ఆరోగ్య సంరక్షణ
ఉత్తర రైల్వే , ఆరోగ్యకేంద్రాలకు మందులు, ఇంజెక్షన్లు, వినియోగ వస్తువులను నిరంతరాయంగా సరఫరా చేస్తోంది ఆయా కేంద్రాలలో ఆర్.టి పిసిఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరమైన ఆక్సిజన్ నిరంతరాయ సరఫరాకు ఎన్ ఆర్ సిహెచ్ వద్ద 500 ఎల్/ మినిట్ సామర్ధ్యంతో ప్లాంటును ఏర్పాటు చేశారు. ఉత్తర రైల్వేలోని 5 డివిజనల్ ఆస్పత్రులలో ఆక్సిజన్ ప్లాంటులను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన వాక్సినేషన్ కార్యక్రమానికి మరింత ఊతం ఇస్తూ ఉద్యోగులకు , వారి కుటుంబ సభ్యులకు వాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నారు.
క్రీడలు:
ఉత్తర రైల్వేలో ఉద్యోగులుగా ఉన్న పలువురు క్రీడాకారులు వివిధ జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీలలో భారత దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఉత్తర రైల్వేకి చెందిన 11 మంది క్రీడాకారులు, కోచ్లు టోక్యో 2020 ఒలింపిక్స్ భారత బ్రుందంలో ఉన్నారు. శ్రీ రవికుమార్ దహియా రజత పతకం సాధించగా, శ్రీ బజరంగ్ పునియా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఈవెంట్ లో కాంస్యపతకాన్ని గెలుచుకున్నారు. వెయిట్ లిఫ్టర్, రజత పతక విజేత మీరాబాయి చాను కోచ్ శ్రీ విజయ్శర్మకు ఒ ఎస్ డిగా పదోన్నతి కల్పించారు. ఇటీవల ఢిల్లీలోని కిషన్ గంజ్ లో భారతీయ రైల్వే రెజ్లింగ్ అకాడమీని తిరిగి ప్రారంభించారు. ఎంతో మంది రెజ్లర్లను ఇది తీర్చిదిద్దింది.
(Release ID: 1788686)
Visitor Counter : 187