ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2021-22 ఆర్థిక సంవత్సరానికి అటల్ పెన్షన్ యోజనలో ఇప్పటివరకు 65 లక్షల మంది నమోద‌య్యారు


- 2015లో ఏపీవై ప్రారంభించినప్పటి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు 3.68 కోట్ల మంది ఏపీవై గొడుగు కింద‌కు

Posted On: 05 JAN 2022 3:08PM by PIB Hyderabad

అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) ప్రారంభమైన  ఆరున్నర సంవత్సరాలలో ఇప్ప‌టి వ‌ర‌కు 3.68 కోట్ల మంది త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో  ఇప్ప‌టి వ‌ర‌కు మెరుగైన ప‌నితీరు న‌మోదయింది. 65 లక్షల కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లు ఈ ప‌థ‌కం కింద‌ నమోద‌య్యారు, ఇది పథకం ప్రారంభించినప్పటి నుండి ఇదే కాలంలో జ‌రిగిన అత్యధిక నమోదు.
న‌మోదుల‌లో స్త్రీ, పురుషుల సబ్‌స్క్రిప్షన్ నిష్పత్తి 56:44 శాతంగా మెరుగుపడింది.  నిర్వహణలో ఉన్న ఏపీవై ఆస్తి విలువ దాదాపు రూ. 20,000 కోట్లు.  అసంఘటిత రంగాలలోని పౌరులకు వృద్ధాప్య ఆదాయ భద్రత కల్పించే లక్ష్యంతో గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 మే 9వ తేదీన భారత ప్రభుత్వ ప్రధాన సామాజిక భద్రతా పథకం ఏపీవైని ప్రారంభించారు.
అటల్ పెన్షన్ యోజనను నిర్వహిస్తున్న 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ\ (పీఎఫ్ఆర్‌డీఐ) చైర్మన్ శ్రీ సుప్రతిమ్ బందోపాధ్యాయ మాట్లాడుతూ “సమాజంలోని అత్యంత బలహీన వర్గాలను పెన్షన్ పరిధిలోకి తీసుకువ‌చ్చే ఘనత
పబ్లిక్‌, ప్రైవేట్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చెల్లింపుల బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్ట్‌ల శాఖ,  రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీల ద్వారా అందించబడిన మద్దతు వారి అలుపెరగని కృషితోనే సాధ్యమైంది."  అని అన్నారు.  "ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోటి మంది ఎన్‌రోల్‌మెంట్‌ను సాధించడంతో పాటు, దేశంలో పెన్షన్ సంతృప్తతను సాధించే పనిని మేము కలిగి ఉన్నాము మరియు దానిని సాధించడానికి మేము నిరంతరం చురుకైన కార్యక్రమాలను చేపడతాము" అని పీఎఫ్ఆర్‌డీఏ చైర్మన్ వివరించారు.  18-40 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా బ్యాంక్ ఖాతాను కలిగి ఉన్నవారు ఏపీవై సభ్యత్వాన్ని పొందవచ్చు. వీరికి  ప్రత్యేకత క‌లిగిన మూడు విశిష్ట ప్రయోజనాలు అందించ బ‌డుతాయి. ఇందులో మొదటిది.. ఇది 60 సంవత్సరాలు నిండిన వారికి  రూ.1000 నుండి రూ.5000 వరకు కనీస హామీ పెన్షన్‌ను అందించ‌బ‌డుతుంది, రెండవది చందాదారుని మరణంతో జీవిత భాగస్వామికి మరియు చివరగా, చందాదారులిద్దరూ మరణించిన సందర్భంలో పెన్షన్ మొత్తం జీవితకాలం వరకు హామీ ఇవ్వబడుతుంది. మరియు జీవిత భాగస్వామి, మొత్తం పెన్షన్ కార్పస్ నామినీకి చెల్లించబడుతుంది.

***

 


(Release ID: 1787826) Visitor Counter : 211