గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

స్మార్ట్ సిటీల పరిశోధన, విద్యా ( సార్) కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం


15 ప్రముఖ ఆర్కిటెక్చర్, ప్రణాళిక సంస్థలతో కలిసి స్మార్ట్ పట్టణాల మిషన్ కింద 75 పట్టణ ప్రాంతాల స్మార్ట్ పట్టణాల ప్రాజెక్టులకు రూపకల్పన చేయనున్న కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్

Posted On: 05 JAN 2022 1:09PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్  వేడుకల్లో భాగంగా  స్మార్ట్ సిటీస్ మిషన్, కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్మార్ట్ సిటీలు మరియు   అకాడెమియా టువర్డ్స్ యాక్షన్ ,& రీసెర్చ్ (సార్ )” కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమాన్ని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ,నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ కలిసి అమలు చేస్తాయి. కార్యక్రమంలో భాగంగా దేశంలో 15 ప్రముఖ ఆర్కిటెక్చర్, ప్రణాళికా సంస్థలు దేశంలో  స్మార్ట్ సిటీస్ మిషన్ అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలను అధ్యయనం చేసి వాటిపై నివేదిక రూపొందిస్తాయి. పథకాల అమలులో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను గుర్తించి వాటిపై నివేదిక రూపొందిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో అమలులో విద్యార్హులకు భాగస్వామ్యం కల్పించి, విద్యా రంగ ఫలితాలు క్షేత్ర స్థాయికి చేరేలా ఈ నివేదిక రూపొందించడం జరుగుతుంది. 

 

స్మార్ట్ సిటీస్ మిషన్ కింద పట్టణ ప్రాంతాలలో అమలు జరుగుతున్న ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతున్న నగరాలకు దిశ దశలను నిర్దేశిస్తున్నాయి. 2015 లో దేశంలో స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రారంభమయ్యింది. ఇంతవరకు ఈ మిషన్ కింద 2,05,018 కోట్ల రూపాయల పెట్టుబడితో చేపట్టిన 5,151 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. నూతనంగా ప్రారంభించిన "సార్"కార్యక్రమం కింద దేశంలో సామర్ట్ సిటీస్ మిషన్ కింద చేపట్టిన 75 గుర్తించిన ప్రాజెక్టులను అధ్యయనం చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులు వినూత్నంగా, దేశం వివిధ ప్రాంతాల్లో  వివిధ రంగాల సహకారంతో అమలు జరుగుతున్నాయి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం  నిర్మాణ రంగంలో దేశం సాధించిన ప్రగతి , దేశంలో అమలు జరుగుతున్న ఉత్తమ నిర్మాణ విధానాలకు అద్దం పట్టే విధంగా నివేదిక రూపకల్పన జరుగుతుంది. దేశ 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. 

నిర్మాణ రంగంలో భవిష్యత్తులో చేపట్టే పరిశోధనలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని ఈ నివేదిక అందిస్తుంది. ప్రాజెక్టుల అధ్యయనం ద్వారా సేకరించే సమాచారం  క్షేత్ర స్థాయికి చేరేలా చూసేందుకు ఈ నివేదిక రంగం సిద్ధం చేస్తుంది. పట్టణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది. క్షేత్ర స్థాయిలో ఉత్తమ నిర్మాణ విధానాలను అమలు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. అధ్యయనం చేసేందుకు ఎంపిక చేసిన 75 ప్రాజెక్టులను 47 స్మార్ట్ నగరాల్లో చేపట్టడం జరిగింది. వీటిని  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీరూర్కీసెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీఅహ్మదాబాద్జామియా మిలియా ఇస్లామియాఢిల్లీ మరియు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్భోపాల్ అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తాయి.  ('సార్'లో పాల్గొనే నగరాల జాబితా, 15 సంస్థల వివరాలు  అనుబంధంలో పొందుపరచడం జరిగింది). 

" సార్" అమలు జరిగే :

:నివేదిక రూపొందించేందుకు ఎంపిక చేసిన స్మార్ట్ నగరాలు, సంస్థల మధ్య కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్  వ్యవహరిస్తాయి. పట్టణ ప్రాంతాల ప్రజల జీవన శైలిలో ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల చోటు చేసుకున్న మార్పులు, ప్రాజెక్టుల నిర్మాణంపై సంస్థలు అధ్యయనం నిర్వహిస్తాయి. 2022 జనవరి/ఫిబ్రవరి నెలలలో సంస్థల విద్యార్థులు, పరిశోధకులు 47 స్మార్ట్ నగరాలను సందర్శించి అధ్యయనాలు నిర్వహించి సమగ్ర నివేదిక రూపొందిస్తారు. 

కార్యక్రమంలో భాగంగా క్షేత్ర స్థాయిలో పరిశోధనలు నిర్వహించిసమాచారాన్ని విశ్లేషించి నివేదికను రూపొందించడం జరుగుతుంది. నిపుణుల పర్యవేక్షణలో  విద్యార్థులు అధ్యయన కార్యక్రమాల్లో  అందించే నివేదికలను నిపుణల బృందం సమీక్షిస్తుంది. పరిశోధకులు తమ సంస్థలకు నివేదికలను అందిస్తారు. నివేదికలకు సంస్థలు తుది రూపు ఇచ్చి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ కు అందిస్తాయి. 2022 జూన్ నాటికి 75 పట్టణ ప్రాజెక్టులపై సమగ్ర తుది నివేదిక 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్:

 

  75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశం మరియు దాని ప్రజలుసంస్కృతి మరియు విజయాల యొక్క అద్భుతమైన చరిత్రను జరుపుకోవడానికి మరియు స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్   వేడుకలను నిర్వహిస్తోంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రజలుప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ఆశయం మేరకు ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు కృషి చేస్తున్న భారతదేశ ప్రజలకు  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంకితం చేయబడింది.

 

 భారతదేశం  సామాజిక-సాంస్కృతికరాజకీయ మరియు ఆర్థిక రంగాలలో సాధించిన ప్రగతి, గుర్తింపుగా  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అమలు జరుగుతోంది.     2021 మార్చి 12న  ప్రారంభమైందిఇది దేశ  75వ స్వాతంత్ర్య వార్షికోత్సవానికి 75 వారాల కౌంట్‌డౌన్‌ను ప్రారంభించి ఒక సంవత్సరం తర్వాత 15 ఆగస్టు 2022న ముగుస్తుంది.

అనుబంధం 1

 

 నగరాలు మరియు సంస్థల జాబితా

 

 "సార్" ప్రాజెక్ట్‌లో 47 స్మార్ట్ సిటీలలో అమలు చేసిన  75 అర్బన్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.  

నగరాలు: ఆగ్రాఅజ్మీర్చండీగఢ్డెహ్రాడూన్ధర్మశాలఫరీదాబాద్జైపూర్జమ్మూకాన్పూర్సహరాన్‌పూర్సిమ్లాశ్రీనగర్బెల్గావిబెంగళూరుచెన్నైకోయంబత్తూర్ఈరోడ్కాకినాడకొచ్చిమంగుళూరుశివమొగ్గతంజావూరుతిరుచిరాపల్లి,  తిరువనంతపురంతుమకూరుఅహ్మదాబాద్దాహోద్నాగ్‌పూర్నాసిక్పూణేసూరత్థానేవడోదరభువనేశ్వర్న్యూ టౌన్ కోల్‌కతారాంచీవిశాఖపట్నంభోపాల్గ్వాలియర్ఇండోర్రాయ్‌పూర్సాగర్ఉజ్జయినిజబల్‌పూర్అగర్తలగాంగ్‌టక్ మరియు నామ్చి  .

 

 దేశంలోని 15 ప్రముఖ సంస్థలు "సార్" ప్రాజెక్టులో పాల్గొంటున్నాయి. 

సంస్థల వివరాలు :

 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీరూర్కీ

 మాలవ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

 జామియా మిలియా ఇస్లామియాఢిల్లీ

ఆర్వీ  కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్బెంగళూరు

 అన్నా యూనివర్సిటీ

 కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్త్రివేండ్రం

 డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ప్లానింగ్మణిపాల్ యూనివర్సిటీ

 

 సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీఅహ్మదాబాద్

 కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్పూణే

 కమలా రహేజా విద్యానిధి ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆర్కిటెక్చర్ముంబై

 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఖరగ్‌పూర్

 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ టెక్నాలజీశిబ్‌పూర్

 స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్విజయవాడ

 స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్భోపాల్

 మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

***(Release ID: 1787745) Visitor Counter : 216