రైల్వే మంత్రిత్వ శాఖ
ఈశాన్య రైల్వే (నార్త్ ఈస్టర్న్ రైల్వే-నెర్ ) లో ఇంతవరకు 75% పైగా రైలు మార్గాల విద్యుదీకరణ: 2022 నాటికి 100% విద్యుదీకరణ
10 స్టేషన్లలో 24 ఎస్కలేటర్ లు, 8 స్టేషన్లలో 22 లిఫ్ట్ లు ఎర్పాటు
ఆదర్శ్ స్టేషన్లుగా 47 రైల్వే స్టేషన్లు- 295 అర్హత కలిగిన స్టేషన్లలో వైఫై సదుపాయం
ఆర్ యు బి /ఎల్ హెచ్ ఎస్ / రాబ్ , డైవర్షన్ ల ఏర్పాటు ద్వారా 75 లెవల్ క్రాసింగ్ లు తొలగింపు
50 వేల పైగా మొత్తం వేహికల్ యూనిట్లు (టివియు) కలిగిన అన్ని లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద ఇంటర్ లాక్ ---50 వేల కంటే తక్కువ టివియు కలిగిన 16 లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద కూడా ఇంటర్ లాక్
78 కి.మీ ట్రాక్ రెన్యువల్ పూర్తి- 192 కిలోమీటర్ల ప్లెయిన్ ట్రాక్ డీప్ స్క్రీనింగ్ ,145 టర్ణవుట్స్ సాధ్యం
24 గంటలూ పని చేసేలా 26 ప్రధాన గూడ్స్ షెడ్లు - సంవత్సరానికి స్థిరంగా 50 కిలోమీటర్ల/పిహెచ్ పైగా పెరిగిన గూడ్స్ రైళ్ల సగటు వేగం
గత సంవత్సరంలో 3 గంటల 6 నిమిషాలతో పోలిస్తే 13 నిమిషాలకు తగ్గిన రైల్ మాడాడ్ డిస్పోజల్ సమయం
ఈశాన్య రైల్వేలో పొరుగు దేశం నేపాల్ అవసరాలు తీరుస్తున్న రెండు ప్రధాన ఆటోమొబైల్ హ్యాండ్లింగ్ టెర్మినల్స్
ఈశాన్య రైల్వే లో అన్ని రైల్వే ఆసుపత్రుల లో
ఆక్సిజన్ ప్లాంట్ ల సదుపాయం
నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ - 2021 కింద ట్రా
Posted On:
04 JAN 2022 1:02PM by PIB Hyderabad
ఈశాన్య రైల్వే, ప్రధానంగా ప్రయాణీకుల ఆధారిత వ్యవస్థగా ఉంది, 2021 లో ప్రజలకు సురక్షితమైన,భద్రత కలిగిన , వేగవంతమైన, సౌకర్యవంతమైన , విశ్వసనీయమైన రవాణా సౌకర్యాన్ని అందించడంలో ప్రముఖ జోన్లలో ఒకటిగా తనను తాను నిలబెట్టుకుంది.
1.మౌలిక సదుపాయాల అభివృద్ధి: 2021 లో, ఈ క్రింది కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి:
*గేజ్ మార్పిడి 47 కి.మీ:
షాజహాన్ పూర్ – షాబాజ్ నగర్ (4 కి.మీ) మైలానీ - షాఘర్ (43 కిలోమీటర్లు).
*101 కి.మీ. డబ్లింగ్, విద్యుదీకరణ:
.అన్రిహార్-ఘాజీపూర్ సిటీ (40 కి.మీ.లు)
.సితాపూర్-పర్సెండి (16.8 కిలోమీటర్లు)
.మధోసింగ్-జ్ఞాన్ పూర్ రోడ్ (14.6 కిలోమీటర్లు)
.బల్లియా-ఫాఫ్నా (10.5 కిలోమీటర్లు)
.అన్రిహార్-ధోభి (20 కి.మీ.)
*406 కి.మీ విద్యుదీకరణ.
.బల్లియా , ఘాజీపూర్ వద్ద కోచ్ నిర్వహణ సౌకర్యాలు ఏర్పాటు
.06 ఆర్ వోబి పూర్తి
2.ప్రయాణికుల సౌకర్యాలు:
*10 వేర్వేరు స్టేషన్లలో 24 ఎస్కలేటర్ల ఏర్పాటు
*8 స్టేషన్లలో 22 లిఫ్ట్ లు ఏర్పాటు
*ఆదర్శ్ స్టేషన్ లుగా 47 రైల్వే స్టేషన్ల అభివృద్ధి.
*అర్హత కలిగిన మొత్తం 295 స్టేషన్లలో వైఫై సౌకర్యం ఏర్పాటు
3.భద్రత:
*వైఫల్య పరిశోధనలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అవాంఛనీయ సంఘటనలను కనిష్టం చేయడానికి అనేక భద్రతా చర్యలు చేపట్టారు. అటువంటి సంఘటనలను నిరోధించడానికి వివిధ జాగ్రత్త చర్యలు పాటించారు.
రూబ్/ఎల్ హెచ్ ఎస్/ఆర్ వో బి , డైవర్షన్ ల ద్వారా 75 లెవల్ క్రాసింగ్ లు తొలగించారు.
యాభై వేలకు పైగా మొత్తం వేహికల్ యూనిట్ లు (టివియు) కలిగిన లెవల్ క్రాసింగ్ గేట్ల ను ఇంటర్ లాక్ చేశారు. దీనితో పాటు 2021లో 50,000 కంటే తక్కువ టివియు కలిగిన 16 లెవల్ క్రాసింగ్ గేట్ల ను కూడా ఇంటర్ లాక్ చేశారు.
78 కిలోమీటర్ల ట్రాక్ రెన్యువల్ జరిగింది. దీనితో పాటు, 192 కిలోమీటర్ల ప్లెయిన్ ట్రాక్, 145 టర్ణవుట్ల డీప్ స్క్రీనింగ్ సాధించబడింది.
4.లోడింగ్:
*గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇప్పటి వరకు క్యుమిలేటివ్ లోడింగ్ సుమారు 60% ఎక్కువ.
*లోడింగ్ ను పెంచడానికి 26 ప్రధాన గూడ్స్ షెడ్ల 24 గంటలూ పని చేసేలా ఏర్పాటు జరిగింది. గూడ్స్ రైళ్ల సగటు వేగాన్ని సంవత్సరానికి స్థిరంగా గంటకు 50 కిలోమీటర్ల పైగా పెంచారు.
*జోనల్ , డివిజనల్ స్థాయిల వద్ద బిజినెస్ డెవలప్ మెంట్ యూనిట్స్ (బిడియు) సమిష్టి కృషితో కిసాన్ రైల్ 22 రేక్ లను లోడ్ చేసి ఇజ్జత్ నగర్ డివిజన్ లోని ఫరూఖాబాద్ రైల్వే స్టేషన్ నుండి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే వరకు నడిపారు.
*ఎన్ఈఆర్ గత సంవత్సరం ట్రాఫిక్ కు సంబంధించి తులనాత్మకంగా కొత్త స్ట్రీమ్- ఆటోమొబైల్స్ లోడింగ్- ను ప్రారంభించింది. ఈ సంవత్సరం హల్దీ రోడ్ నుండి లోడ్ చేసిన 113 రేక్ ల ఆటోమొబైల్స్ తో 41% ఎక్కువ లోడింగ్ నమోదు చేసింది.
*రెండు ప్రధాన ఆటోమొబైల్ హ్యాండ్లింగ్ టెర్మినల్స్ ను అభివృద్ధి చేశారు. ఇవి ఒకటి బక్షి కా తలాబ్ వద్ద , మరొకటి నౌతాన్వా వద్ద ఉన్నాయి. నౌతాన్వా టెర్మినల్ పొరుగు దేశం నేపాల్ రవాణా అవసరాలను కూడా తీరుస్తోంది. నెరవేరుస్తోంది. ఈ స్టేషన్లలో 77 రేక్ లను అన్ లోడ్ చేశారు.
*ఆటోమొబైల్ లోడింగ్ సులభతరం చేయడానికి గోరఖ్ పూర్ , ఇజ్జత్ నగర్ వర్క్ షాప్ లలో 550 పనికిరాని ఎన్ ఎం జి వ్యాగన్ల ను ఐసిఎఫ్ కోచ్ లుగా మార్చారు. ఒక సంవత్సరంలో భారతీయ రైల్వేలోనే ఇది అతిపెద్ద మార్పిడి.
5.వ్యయ నియంత్రణ:
ఖర్చులను తగ్గించడానికి, స్టేషన్ క్లీనింగ్, ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీసులు (ఓబిహెచ్ఎస్) యాంత్రిక క్లీనింగ్ కు జెమ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం 10 ఒప్పందాలు ఖరారు అయ్యాయి. దీని ఫలితంగా 40% కంటే ఎక్కువ పొదుపు సాధ్యమయింది.
*రైల్వే సిబ్బందికి వివిధ నిర్వహణ పనులను చేపట్టడానికి తగిన శిక్షణ, నైపుణ్యం కల్పించారు. సాధారణంగా ఇవి వార్షిక నిర్వహణ ఒప్పందాల (ఎఎంసిలు) ద్వారా చేపడతారు. కానీ సిబ్బందిని నియోగించడం వల్ల రైల్వే ఆదాయం ఆదా అవుతుంది.
*జోనల్ , ఇతర అన్ని డివిజనల్ రైల్వే ఆసుపత్రులు ఆక్సిజన్ ప్లాంట్ల సదుపాయాన్ని కలిగి ఉన్నాయి, దీని ఫలితంగా సుమారు 70% మెడికల్ ఆక్సిజన్ వ్యయం ఆదా అయింది.
*ఈ సంస్కరణల నుండి మొత్తం 20 కోట్ల రూపాయల ఆదాను ఆశిస్తున్నారు.
6.ఇంధన సంరక్షణ:
*75% కంటే ఎక్కువ ఎన్ఈఆర్ మార్గాలను విద్యుదీకరించారు. 2022 సంవత్సరం చివరి నాటికి దాదాపు 100% విద్యుదీకరణ రైల్వేగా మారనుంది.
*ప్రధాన మార్గాల విద్యుదీకరణ తరువాత హైస్పీడ్ డీజిల్ (హెచ్ ఎస్ డి) పై వ్యయం గణనీయంగా తగ్గింది. ఇది రూ. 361 కోట్ల ఆదా ను నమోదు చేసింది.సియుఎఫ్ (కెపాసిటీ యుటిలిటేషన్ ఫ్యాక్టర్) ఆధారిత సోలార్ మానిటరింగ్ సిస్టమ్ అమలు ఫలితంగా గత సంవత్సరం ఇదే సమయం నాటి స్థాపిత సామర్థ్యం 4.72 ఎమ్ డబ్ల్యుపితో పోలిస్తే ఈ సంవత్సరంలో 26% అధిక సౌర శక్తి ఉత్పత్తి అయింది.
*ఈశాన్య రైల్వేలోబయలుదేరే/నిలిపివేసే మొత్తం 31 జతల రైళ్లు హెచ్ ఓ జి వ్యవస్థ పై నడుస్తున్నాయి.
*ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ - 2021 కింద రవాణా కేటగిరీలో ఎన్ ఈఆర్ మొదటి బహుమతిని గెలుచుకుంది.
*యుపి ఎన్ ఇ డిఎ అవార్డులు- 2021 కింద, గోరఖ్ పూర్ స్టేషన్ వాణిజ్య భవన కేటగిరీ లో కమొదటి బహుమతిని గెలుచుకుంది, గోండా స్టేషన్ ప్రభుత్వ భవన కేటగిరీ లో రెండవ బహుమతిని గెలుచుకుంది, ఇజ్జత్ నగర్ వర్క్ షాప్ ఇండస్ట్రియల్ కేటగిరీలో రెండవ బహుమతిని , డిఆర్ఎం కార్యాలయం, ఎన్.ఇ.రైల్వే, లక్నో ప్రభుత్వ భవన విభాగంలో మూడవ బహుమతిని గెలుచుకుంది.
*రోజుకు 700 కెఎల్ డి సామర్థ్యం ఉన్న వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్లను 4 స్టేషన్లలో ఏర్పాటు చేశారు.
7.కస్టమర్ సంతృప్తి:
*నిరంతర పర్యవేక్షణ , సానుకూల చర్య ద్వారా, రైల్ మాడాడ్ డిస్పోజల్ సమయం గత సంవత్సరంలో 3 గంటల 6 నిమిషాలతో పోలిస్తే 13 నిమిషాలకు తగ్గించబడింది. భారతీయ రైల్వే లో ఇది అత్యంత వేగవంత మైన డిస్పోజల్ సమయం.
*డిస్పోజల్ సమయాన్ని తగ్గించిన తరువాత కూడా, దిద్దుబాటు చర్యల నాణ్యతలో రాజీపడకపోవడం గమనార్హం. సగటు కస్టమర్ రేటింగ్ అద్భుతంగా ఉంది.
*రైల్వే బోర్డు లోని రైల్ మాడాడ్ మెట్రిక్స్ లో ఎన్ ఈఆర్ అత్యధిక స్కోరును సాధించింది.
*సిపి జిఎంలపై వచ్చిన ఫిర్యాదులను కూడా ఇదే విధంగా పరిష్కరిస్తున్నారు గత సంవత్సరంలో 11 రోజులతో పోలిస్తే డిస్పోజల్ సమయాన్ని ఒక రోజుకు తగ్గించారు. ఇది కూడా భారతీయ రైల్వేలో వేగవంతమైన డిస్పోజల్ సమయం.
***
(Release ID: 1787516)
Visitor Counter : 158