రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2021 లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నెట్ వర్క్ సామర్థ్య విస్తరణలో మునుపెన్నడూ లేని వృద్ధిని నమోదు చేసిన కోల్ కతామెట్రో రైల్వే


నోపారా నుండి దక్షిణేశ్వర్ (4.1 కి.మీ పొడవు) వరకు ఉత్తర-దక్షిణ మెట్రో విస్తరణ మార్గం ప్రారంభం

ఫూల్ బగాన్ నుండి ఈస్ట్-వెస్ట్ మెట్రో సీల్దా వరకు మొదటి ట్రయల్ రన్ పూర్తి

తూర్పు-పశ్చిమ మెట్రోలో క్యూఆర్ కోడ్ ఆధారిత టికెటింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టడం తో నెరవేరిన మెట్రో ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్

తపన్ సిన్హా మెమోరియల్ ఆసుపత్రిలో ప్రజర్ స్వింగ్ అడ్సార్ ప్షన్ (పిఎస్ఎ) ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ప్రారంభం

నాన్-ఎసి రేక్ లకు స్వస్తి పలికిన మెట్రో రైల్వే

Posted On: 03 JAN 2022 1:48PM by PIB Hyderabad

2021 లో, కోల్ కతా మెట్రో మౌలిక సదుపాయాల అభివృద్ధి , నెట్ వర్క్ సామర్థ్య విస్తరణలో మునుపెన్నడూ లేని వృద్ధిని చూసింది. కోవిడ్ సవాళ్లు ఉన్నప్పటికీ, కోల్ కతా మెట్రో భవిష్యత్ అభివృద్ధికి ప్రయాణికులకు తదుపరి స్థాయి ప్రయాణ అనుభవానికి పునాది వేయడం కొనసాగించింది.

2021 సంవత్సరంలో కోల్ కతా మెట్రో సాధించిన కొన్ని ముఖ్యమైన విజయాలు:

 

22.02.2021 న నోపారా నుండి దక్షిణేశ్వర్ (4.1 కి.మీ పొడవు) వరకు ఉత్తర-దక్షిణ మెట్రో పొడిగింపు భాగాన్ని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ మార్గం లో మొదటి మెట్రోను జెండా ఊపి ప్రారంభించారు.

 

ప్రధాన మంత్రి తన ప్రసంగంలో, ‘’ ఈ పొడిగింపు కోల్ కతా ప్రజలకు మాత్రమే కాకుండా హుగ్లీ, హౌరా ,ఉత్తర 24 పరగణాలకు మెట్రో సేవల ప్రయోజనాన్ని పొందడానికి సహాయపడుతుంది" అన్నారు.

నోపారా కార్షెడ్ నాన్ ఇంటర్ లాకింగ్ (ఎన్ ఐ) పని సంవత్సరంలో విజయవంతంగా పూర్తయింది. ఈ ఎన్ ఐ పనిలో నోపారా వద్ద ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ మార్పు ఇమిడి ఉంది, ఇది కార్షెడ్ లోని అన్ని మార్గాలు, పాయింట్లు, సిగ్నల్స్ ,ట్రాక్ విభాగాలతో అనుసంధానించబడింది. ఈ మార్పు నోపారా నుంచి, నోపార  వరకు రేక్ ల కదలిక నిర్వహణ సరళత్వాన్ని ఎంతగానో మెరుగుపరిచింది. తద్వారా మెట్రో రైల్వే నడుపుతున్న రైళ్ల పనితీరు

ప్రామాణికాలను కూడా పెంచింది.

 

ఫూల్ బగాన్ నుండి తూర్పు-పశ్చిమ మెట్రోకు చెందిన సీల్దా వరకు మొదటి ట్రయల్ రన్ ఈ సంవత్సరం విజయవంతంగా జరిగింది. పూర్తయింది. ఈ కారిడార్ లో సీల్దా స్టేషన్ అతి త్వరలో ప్రారంభమవుతుంది.

 

27.08.2021 న 1.24 ఎమ్ డబ్ల్యుపి పైకప్పు సోలార్ పవర్ ప్లాంట్ ను దేశ సేవకు అంకితం చేశారు. ఈ పవర్ ప్లాంట్ ఈస్ట్-వెస్ట్ మెట్రో సెంట్రల్ పార్క్ డిపో రెండు ప్రధాన భవనాల పై కప్పులపై 19173 చదరపు మీటర్ల ప్రాంతంలో  ఏర్పాటు అయింది. ఫలితంగా మెట్రో రైల్వే సంవత్సరానికి రూ.45 లక్షలు (సుమారు) ఆదా చేయగలదు.

గాంధీ జయంతి సందర్భంగా మహానాయక్ ఉత్తమ్ కుమార్ మెట్రో స్టేషన్ వద్ద రెండు ఎలివేటర్లను 02.10.2021 న దేశ సేవకు అంకితం చేశారు. ఈ రెండు లిఫ్ట్ లు మెట్రో ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్ ను నెరవేర్చాయి. ఇంకా ఈ స్టేషన్ లో అదనపు ప్రయాణీకుల సౌకర్యాలను అందించాయి.

దేశం లోనే  తొలిసారి మెట్రో రైల్వే 37 వ వ్యవస్థాపక దినోత్సవం అయిన 24.10.2021 న, మహానాయక్ ఉత్తమ్ కుమార్ స్టేషన్ లో నాన్-ఎసి మెట్రో రేక్ (కోల్ కతా మెట్రో యొక్క చివరి నాన్-ఎసి రేక్ అయిన రేక్ నం-ఎన్ 12/14) లోపల ఎగ్జిబిషన్ ఆన్ వీల్స్ ఏర్పాటైంది. ఈ ప్రదర్శనలో దేశపు మొదటి మెట్రో అయిన కోల్ కతా మెట్రో అద్భుతమైన గతం, ప్రస్తుత దృశ్యం , దాని భవిష్యత్తు ప్రాజెక్టులను రంగురంగుల పోస్టర్ల ద్వారా ప్రదర్శించారు. ఎగ్జిబిషన్ తరువాత, మెట్రో రైల్వే తన నాన్-ఎసి రేక్ లకు స్వస్తి పలికింది.

కోల్ కతా మెట్రో నాన్-ఎసి రేక్ లు గతంగా మెట్రో రైల్వే ఇప్పుడు ప్రయాణికులకు పూర్తి ఎసి సర్వీసులు అందిస్తోంది.

ప్రయాణికుల ప్రయోజనం కోసం 25.11.2021న మెట్రో రైల్వేలో టోకెన్లను తిరిగి ప్రవేశపెట్టారు. టోకెన్లు చివరిసారిగా 23.03.2020 న జారీ చేయబడ్డాయి. ఈ టోకెన్లను శానిటైజ్ చేయడానికి, అన్ని ఉత్తర-దక్షిణ , తూర్పు-పశ్చిమ మెట్రో స్టేషన్లలో 40 టోకెన్ శానిటైజర్ యంత్రాలను ఏర్పాటు చేశారు. అల్ట్రా వైలెట్ కిరణాల సహాయంతో ఈ యంత్రాలు ఉపయోగించిన టోకెన్లను నాలుగు నిమిషాలపాటు పరికల్పన చేస్తాయి.

 

తపన్ సిన్హా మెమోరియల్ ఆసుపత్రిలో 01.12.2021 న జనరల్ మేనేజర్ శ్రీ మనోజ్ జోషి ప్రెజర్ స్వింగ్ అడ్సార్ ప్షన్  (పిఎస్ఎ) ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.ఈ ప్లాంట్ రోగుల ప్రయోజనం కోసం నిమిషానికి  250 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బల్క్ ఆక్సిజన్ సిలిండర్ కొనుగోలు ఖర్చును కనీసం ౭౦ శాతం తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా, క్యూఆర్ కోడ్ ఆధారిత టికెటింగ్ సిస్టమ్ ను 04.12.2021 నుంచి తూర్పు-పశ్చిమ మెట్రోలో ప్రవేశపెట్టారు. ఈ మూడవ ప్రత్యామ్నాయ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో, ప్రయాణికుల దీర్ఘకాల డిమాండ్ నేర వెరింది. మెట్రో టిక్కెట్లు ఇప్పుడు ప్రయాణికుల చేతి వేళ్ళ కు అందుబాటులో ఉన్నాయి. క్యూఆర్ కోడ్ స్కానర్లను అందించిన తరువాత,  ఉత్తర-దక్షిణ కారిడార్ స్టేషన్లలో ఇప్పటికే ఉన్న ఎఎఫ్ సి గేట్ల హార్డ్ వేర్ ను అప్ గ్రేడ్ చేసిన తరువాత మెట్రో రైల్వే కూడా ఇప్పుడు ఉత్తర-దక్షిణ కారిడార్ లో ఈ సదుపాయాన్ని కొన్ని నెలల్లో విస్తరించడానికి కృషి చేస్తోంది.

మెట్రో రైల్వేకు చెందిన తపన్ సిన్హా మెమోరియల్ హాస్పిటల్ గత ఏడాది నుంచి కోవిడ్ రోగులకు చికిత్స చేస్తోంది. ఇక్కడ కోవిడ్ రోగుల చికిత్స కోసం 75 పడకల ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటయింది. 30.12.2021 వరకు 604 మంది కోవిడ్ రోగులకు ఈ వార్డు లో చికిత్స చేశారు. అన్ని ఆధునిక చికిత్సా సదుపాయాలు ఈ వార్డులో ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ 02.02.2021 నుంచి మెట్రో రైల్వేలో ప్రారంభమైంది. 30.12.2021 వరకు మొత్తం 21,423 మోతాదుల్లో కోవిడ్ వ్యాక్సిన్ (1వ మరియు 2వ మోతాదు) ఆరోగ్య సంరక్షణ కార్మికులు, మెట్రో సిబ్బంది, రైల్వే లబ్ధిదారులు, ఒప్పంద సిబ్బంది ఇంకా సాధారణ ప్రజలకు ఇచ్చారు.

ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా కంపెనీలు మొదలైన వాటితో సహా కార్పొరేట్ సంస్థలకు స్టేషన్ బ్రాండింగ్ హక్కుల కోసం మెట్రో రైల్వే 7 మెట్రో స్టేషన్లను అందించింది. ఉత్తర-దక్షిణ మెట్రో లో  5 స్టేషన్లు -  డమ్డమ్, నోపారా, బెల్గాచియా, ఎస్ప్లనేడ్ పార్క్ స్ట్రీట్ , తూర్పు-పశ్చిమ మెట్రో లో 2 స్టేషన్లు - బెంగాల్ కెమికల్ & సీల్దా (ఇది అతి త్వరలో పనిచేస్తుంది) ఈ టెండర్ లో స్టేషన్ బ్రాండింగ్ హక్కుల కోసం అందించబడ్డాయి. ఈ స్టేషన్ల స్టేషన్ బ్రాండింగ్ హక్కులను అందించడం ద్వారా మెట్రో మొదటి సంవత్సరంలో రూ.3.65 కోట్లు సంపాదించింది. మెట్రో స్మార్ట్ కార్డులు కూడా రెండు ప్రైవేట్ సంస్థలతో బ్రాండ్ చేయబడ్డాయి. దీని ద్వారా మెట్రో ఇప్పటివరకు రూ.20.65 లక్షలు సంపాదించింది. ఇప్పటివరకు 11 మెట్రో స్టేషన్లకు సహ బ్రాండెడ్ గా ఉంది.

 

నార్త్-సౌత్ కారిడార్ లో ఎఎఫ్ సి-పిసి గేట్ల బ్రాండింగ్ కూడా విజయవంతంగా 2 సంవత్సరాల కాలానికి పూర్తయింది. స్టేషన్ల 350 గేట్ల బ్రాండింగ్ హక్కులను అందించడం ద్వారా మొత్తం రూ.73.50 లక్షలు సంపాదించారు.

 

ఇది కాకుండా, మొత్తం 26 ఉత్తర- దక్షిణ మెట్రో స్టేషన్లలో 52 కార్డ్ బ్యాలెన్స్ చెకింగ్ టెర్మినల్స్ (సిబిసిటి) కూడా బ్రాండ్ చేయబడ్డాయి, ఇది మెట్రో రైల్వే రూ.12.48 లక్షలు సంపాదించడానికి సహాయపడింది.

ఒక ప్రైవేట్ సంస్థ తో ఒప్పందం ప్రకారం, నోపారా నుండి కవి సుభాష్ వరకు 24 మెట్రో స్టేషన్లలో పవర్ బ్యాంక్ రెంటల్ టవర్లను ఏర్పాటు చేశారు. ఏడాది కాలం లో మెట్రో 12 లక్షల రూపాయల ఆదాయం  సంపాదించగలిగింది.

***


(Release ID: 1787266) Visitor Counter : 184