మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

నీట్ 3.0, ఏఐసీటీఈ నిర్దేశించిన సాంకేతిక పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో విడుదల చేసిన కేంద్ర విద్యా శాఖ మంత్రి


సామాజికంగా వెనుకబడిన వర్గాలకు 253.72 కోట్ల రూపాయల విలువ చేసే 12 లక్షల నీట్ ఎడ్- టెక్ కోర్సు కూపన్లను ఉచితంగా పంపిణీ

డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించి ప్రపంచానికి అవసరమైన విజ్ఞాన ఆధారిత నైపుణ్యాన్ని నీట్ అందిస్తుంది

21వ శతాబ్ద నైపుణ్యలను అందిపుచ్చుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చూసేందుకు స్కిల్ ఇండియాతో నీట్ అనుసంధానం... శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

విభిన్న భాషలు మన బలం. వినూత్న సమాజ నిర్మాణంలో భాష కీలకంగా ఉంటుంది... శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 03 JAN 2022 5:21PM by PIB Hyderabad

సాంకేతిక విద్యకు సంబంధించిన సమస్యలను పరిష్కరించివిద్యార్థులకు పాఠ్య అంశాలను  ఒకే వేదిక మీద అందించాలన్న లక్ష్యంతో రూపొందించిన నీట్ 3.0ని కేంద్ర విద్యానైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ  ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు.ప్రాంతీయ భాషల్లో ముద్రించిన  ఏఐసీటీఈ నిర్దేశించిన సాంకేతిక పుస్తకాలను  కూడా మంత్రి విడుదల చేశారు. 

 

11c4c756-47a6-4f6a-8ee7-efa1bf06f7ee.jpg

c487de0f-7471-481c-ae1a-8ff5030aeafe.jpg

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించి ప్రపంచానికి అవసరమైన విజ్ఞాన ఆధారిత నైపుణ్యాన్ని  నీట్ అందిస్తుందని అన్నారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇది ప్రయోజనం కలిగిస్తుందని మంత్రి అన్నారు. భారతదేశంతో పాటు  ప్రపంచ దేశాల  విజ్ఞాన ఆధారిత అవసరాలను తీర్చడంలో నీట్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నీట్ లో 58  జాతీయ అంతర్జాతీయ సాంకేతిక విద్య అంకుర సంస్థలు సభ్యత్వం కలిగి ఉన్నాయని మంత్రి వివరించారు. విద్యా బోధనను మెరుగుపరచడానికిఉపాధి నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి , ఇతర సమస్యలను పరిష్కరించేందుకు  100 కోర్సులుఇ-వనరులను అందిస్తున్నాయని మంత్రి తెలియజేశారు.చదివిన దానిని మరచి పోకుండా చూసి గుర్తుంచుకునేలా చూసే అంశంలో నీట్ లాంటి డిజిటల్ వ్యవస్థలు  తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. 

స్కిల్ ఇండియాతో నీట్ కోర్సులను అనుసంధానం చేయాలని ఏఐసీటీఈ కి  మంత్రి సూచించారు. దీనివల్ల నైపుణ్యం అభివృద్ధి చెందుతుందనియువతకి ఉపాధి అవకాశాలు మరింత అందుబాటులోకి వచ్చి యువతను భవిష్యత్తు కోసం సిద్ధం చేయడానికి అవకాశం కలుగుతుందని  శ్రీ ప్రధాన్ అన్నారు.సాధ్యమైనంత తక్కువ ధరకు విద్యా వనరులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన  ఏఐసీటీఈఎడ్-టెక్ సంస్థలకు సూచించారు. నీట్ 3.0 లో సభ్యులుగా ఉన్న అంతర్జాతీయ ఎడ్-టెక్ సంస్థలుభారత అంకుర సంస్థలను మంత్రి అభినందించారు. అందిరికి విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు కలిసి పనిచేయాలని ఆయన ఎడ్-టెక్ సంస్థలకు పిలుపు ఇచ్చారు. అయితేవిద్యా రంగంలో  గుత్తాధిపత్యానికిదోపిడీకి తావు లేదని ఎడ్-టెక్‌లు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. 

 సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన దాదాపు 12 లక్షల మంది  విద్యార్థులకు  నీట్ 3.0 కింద 253 కోట్ల రూపాయల విలువైన ఉచిత ఎడ్-టెక్ కోర్సు కూపన్‌లను అందించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.  2022 కొత్త సంవత్సరంలో ఇది  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నుంచి విద్యార్థి సమాజానికి అందిన  అతిపెద్ద బహుమతి అని ఆయన అన్నారు. 21వ శతాబ్దంలో భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నాయకత్వం వహించి , వాణిజ్యం , ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రాధాన్య మార్కెట్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రాంతీయ భాషల్లో సిద్ధం చేసిన సాంకేతిక పుస్తకాల అంశంపై మాట్లాడిన  శ్రీ ప్రధాన్ మన విభిన్న భాషలు మన బలమని అన్నారు. వినూత్న సమాజ నిర్మాణానికి భాష ను  వినియోగించుకోవడం కీలకమని అన్నారు . ప్రాంతీయ భాషలో నేర్చుకోవడం వల్ల విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యం మరింత పెరిగి యువత అంతర్జాతీయ గుర్తింపు పొందేలా  వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు.

నీట్ 

   విద్యా రంగంలో అత్యుత్తమ-అభివృద్ధి చెందిన సాంకేతిక పరిష్కారాల వినియోగాన్ని ఒకే వేదికపై  అందించి  యువతకు ఉపాధిని పెంపొందించడానికి,  అభ్యాసకుల సౌలభ్యం కోసం  నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ (నీట్ ) కృషి చేస్తోంది.   ఈ పరిష్కారాలు సముచిత ప్రాంతాలలో మెరుగైన అభ్యాస ఫలితాలు మరియు నైపుణ్యం అభివృద్ధి కోసం వ్యక్తిగతీకరించిన మరియు అనుకూలీకరించిన అభ్యాస అనుభవం కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తాయి.  సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన పెద్ద సంఖ్యలో విద్యార్థులకు పరిష్కారాలు ఉచితంగా అందుబాటులో ఉండేలా విద్యా మంత్రిత్వ శాఖ, ఏఐసీటీఈ కలిసి కృషి చేస్తున్నాయి. నీట్ లో సభ్యత్వం కలిగి ఉన్న 58 సాంకేతిక విద్యా సంస్థలు 100 రకాల సేవలను అందిస్తున్నాయి. ఇవి ఉపాధి నైపుణ్యాలు, సామర్థ్యాల పెంపుదల మరియు విద్యాపరమైన వ్యత్యాసాలను తగ్గించడానికి   సహాయపడతాయి.

కార్యక్రమంలో  ఏఐసీటీఈ చైర్మన్ ప్రొ. అనిల్ సహస్రబుధే, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి  శ్రీ సంజయ్ మూర్తి;   ఏఐసీటీఈ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎంపీ పూనియా, ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ రాజీవ్ కుమార్, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

*** 



(Release ID: 1787262) Visitor Counter : 159