మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
రేపు 100 రోజుల రీడింగ్ క్యాంపెయిన్ ‘పడే భారత్’ను ప్రారంభించనున్న శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
31 DEC 2021 2:50PM by PIB Hyderabad
కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రేపు (జనవరి 1, 2022న) 100 రోజుల పఠన ప్రచారకార్యక్రమం 'పడే భారత్'ను ప్రారంభించనున్నారు. 100 రోజుల పఠన ప్రచారం (‘పడే భారత్’) విద్యార్థులలో తగిన సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, పదజాలాన్ని అభివృద్ధి చేయడంతో వారి అభ్యాస స్థాయిలను మెరుగుపరిచే దిశగా ఒక ముఖ్య దశను సూచిస్తుంది. మౌఖికంగా, వ్రాతపూర్వకంగా భావ వ్యక్తీకరణ సామర్థ్యంను పెంపొందించేందుకూ దోహదం చేస్తుంది. దీనికి తోడు ఈ కార్యక్రమం పిల్లలు వారి పరిసరాలతో, నిజ జీవిత పరిస్థితులతో సంబంధం కలిగి ఉండటానికి కూడా సహాయపడుతుంది. బాల వాటికలలో 8వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఈ ప్రచార కార్యక్రమంలో భాగమవుతారు. పఠన ప్రచారం 1 జనవరి 2022 నుండి 10 ఏప్రిల్ 2022 వరకు 100 రోజుల పాటు (14 వారాలు) నిర్వహించబడుతుంది. పిల్లలు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు, సంఘం, విద్యా నిర్వాహకులు మొదలైన వారితో సహా జాతీయ, రాష్ట్ర స్థాయిలో అన్ని రకాల వాటాదారుల భాగస్వామ్యాన్ని పఠన ప్రచారం లక్ష్యంగా పెట్టుకుంది. 100 రోజుల పఠన ప్రచారం పద్నాలుగు వారాల పాటు కొనసాగుతుంది మరియు ప్రతి సమూహానికి వారానికి ఒక కార్యకలాపం చదవడం ఆనందదాయకంగా, పఠన ఆనందంతో జీవితకాలంలో అనుబంధాన్ని పెంపొందించడంపై దృష్టి సారించి రూపొందించబడింది. వయస్సుకు తగిన వారపు క్యాలెండర్‌తో రీడింగ్ క్యాంపెయిన్‌పై సమగ్ర మార్గదర్శకం తయారు చేయబడింది. రాష్ట్రాలు మరియు యుటీల్ని భాగస్వామ్యం చేయబడింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సహచరులు, తోబుట్టువులు లేదా ఇతర కుటుంబ సభ్యుల సహాయంతో పిల్లలు ఈ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. పడేభారత్
ప్రచారాన్ని ప్రభావవంతంగా చేయడానికి రూపొందించిన కార్యకలాపాలు సరళంగా, ఆనందదాయకంగా రూపొందిచబడ్డాయి, తద్వారా పాఠశాలలు మూసివేసిన సందర్భంలో ఇంట్లో లభించే పదార్థాలు/ వనరులు మరియు తల్లిదండ్రులు, తోటివారు, తోబుట్టువుల సహాయంతో వీటిని సులభంగా నిర్వహించవచ్చు.
***
(Release ID: 1786706)
Visitor Counter : 181