ప్రధాన మంత్రి కార్యాలయం
జనవరి 2వ తేదీ న మేరఠ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
సుమారు 700 కోట్ల రూపాయల ఖర్చు తో ఏర్పాటయ్యే మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
దేశం లోప్రతి ప్రాంతం లో క్రీడా సంబంధి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల ను కల్పించే విషయం లో ప్రధాన మంత్రి దార్శనికత కు అనుగుణం గాఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరుగుతోంది
క్రీడల కుసంబంధించి ఆధునికమైనటువంటి మరియు ఉ త్కృష్టమైనటువంటి మౌలిక సదుపాయాల ను ఈ విశ్వవిద్యాలయంలో సమకూర్చడం జరుగుతుంది
Posted On:
31 DEC 2021 11:11AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జనవరి 2వ తేదీ న ఉత్తర్ ప్రదేశ్ లోని మేరఠ్ లో పర్యటించనున్నారు. అక్కడ ఇంచుమించు మధ్యాహ్నం ఒంటిగంట వేళ కు మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయాని కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ విశ్వవిద్యాలయాన్ని మేరఠ్ లో సర్ ధనా పట్టణ పరిధిలోని సలావా మరియు కైలీ గ్రామాల లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని స్థాపన కు సుమారు 700 కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చని భావిస్తున్నారు.
క్రీడా సంస్కృతి కి ప్రోత్సాహాన్ని ఇవ్వడం తో పాటు దేశం లోని ప్రతి ప్రాంతం లో క్రీడల కు సంబంధించి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ను ఏర్పాటు చేయడం అనేది ప్రధాన మంత్రి ప్రముఖం గా దృష్టి సారించిన రంగాల లో ఒక రంగం గా ఉంది. మేరఠ్ లో మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఈ దార్శనికత ను సాకారం చేసే దిశ లో వేసేటటువంటి ఒక పెద్ద అడుగు కాగలదు.
ఈ క్రీడా విశ్వవిద్యాలయాన్ని సింథెటిక్ హాకీ మైదానం, ఫుట్‌బాల్ మైదానం, బాస్కెట్‌బాల్/వాలీబాల్/హ్యాండ్‌బాల్/కబడ్డీ గ్రౌండు, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్, సింథెటిక్ రనింగ్ స్టేడియమ్, ఈతకొలను, బహుళ విధాలు గా ఉపయోగపడే పెద్ద గది, ఇంకా సైకిల్ వెలోడ్రోమ్ వంటి ఆధునికమైన మరియు ఉత్కృష్టమైన క్రీడల సంబంధి మౌలిక సదుపాయాల తో సజ్జీకరించడం జరుగుతుంది. విశ్వవిద్యాలయం లో శూటింగ్, స్క్వాశ్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరి, కెనోయింగ్ ఇంకా కయాకింగ్ వంటి ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. 540 మంది మహిళా క్రీడాకారుల కు, 540 మంది పురుష క్రీడాకారుల కు కలిపి మొత్తం 1080 మంది క్రీడాకారుల కు శిక్షణ ను ఇచ్చే సామర్థ్యం ఈ విశ్వవిద్యాలయాని కి ఉంటుంది.
***
(Release ID: 1786574)
Visitor Counter : 199
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam