ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

15-18 మధ్య వయస్సు ఉన్నవారికి, ముందు జాగ్రత్త అవసరమైన వారికి జనవరి 3 నుంచి టీకాలు ఇచ్చే కార్యక్రమం అమలును రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ


15-18 మధ్య వయస్సు ఉన్నవారికి టీకా కార్యక్రమం 2022 జనవరి 3 నుంచి ప్రారంభం: ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, వ్యాధులతో బాధపడుతున్న వారికి జనవరి పది నుంచి టీకాలు

వ్యాధి నిర్ధారణకు డాక్టర్ సర్టిఫికెట్/ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు

ముందు జాగ్రత్త డోస్ తీసుకునే ముందు తమ డాక్టర్లను సంప్రదించాలని వ్యాధులతో బాధపడుతున్న వారికి సూచన

15-18 మధ్య వయసు గల వారికి నేరుగా, ఆన్ లైన్ నమోదు ( కో-విన్ ద్వారా) ద్వారా టీకా తీసుకునే సౌకర్యం

జనవరి 1 నుంచి కో-విన్ ద్వారా , 3 నుంచి ప్రత్యక్ష రిజిస్ట్రేషన్ సౌకర్యం ప్రారంభం

15-18 మధ్య వయసు గల కోసం ప్రత్యేక టీకా కేంద్రాలను నెలకొల్పాలని, సీవీసీ కేంద్రాల్లో 15-18 మధ్య వయసు గల వారికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచన

Posted On: 28 DEC 2021 4:27PM by PIB Hyderabad

దేశంలో 15-18 మధ్య వయసు గల వారికివ్యాధి సోకే అవకాశం ఉన్నవారికిఆరోగ్య కార్యకర్తలుఫ్రంట్ లైన్ సిబ్బందికి  ముందు జాగ్రత్తగా మూడవ  డోస్ వేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహంపై రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్  సమీక్షించి చర్చించారు.  

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన విధంగా  దేశంలో 15-18 మధ్య వయసు గల వారికి 2022 జనవరి నుంచి టీకా కార్యక్రమం  వేసే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. వ్యాధి సోకే అవకాశం ఉన్న  వారికి జనవరి 10 నుంచి మూడో డోస్  టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను 2021 డిసెంబర్ 27న కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. 

దేశంలో 15-18 మధ్య వయసు గల వారికి  '  కోవాగ్జిన్  ' టీకా మాత్రమే వేస్తారని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి వివరించారు. ఈ తరగతి ప్రజలకు ఇచ్చేందుకు అవసరమైన కోవాగ్జిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేస్తామని అన్నారు. కొద్దిరోజుల్లో కోవాగ్జిన్ సరఫరా ప్రణాళికను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు పంపుతామని ఆయన చెప్పారు. టీకా పొందే అర్హత ఉన్నవారు  కో-విన్‌లో 2022 జనవరి 1 నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమం ప్రారంభం అయ్యే 2022 జనవరి 3న వారు టీకా కేంద్రాలకు వెళ్లి పేర్లను నమోదు చేసుకోవచ్చు. 2007 లేదా అంతకుముందు జన్మించిన వారు ఈ తరగతిలో టీకా పొందేందుకు అర్హత కలిగి ఉంటారు. 

టీకా కార్యక్రమంలో అనుసరిస్తున్న విధానాలు, నిబంధనలు 15-18 మధ్య వయసు గల వారికి  వర్తిస్తాయి. టీకా తీసుకున్న తరువాత వారు 30 నిమిషాల పాటు టీకా కేంద్రంలో ఉండవలసి ఉంటుంది. ఏఈఎఫ్ఐ కోసం వారిని  పర్యవేక్షణలో ఉంచుతారు. 28 రోజుల తరువాత రెండవ డోస్ వీరు రెండవ డోస్ తీసుకోవచ్చు. 15-18 మధ్య వయసు గల వారి కోసం కొన్ని కోవిడ్ టీకా కేంద్రాలను ప్రత్యేకంగా కేటాయించాలని రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ కార్యదర్శి సూచించారు. కో-విన్ లో ఈ వివరాలను పొందుపరచాలని అన్నారు. టీకాలు వేసే సమయంలో  గందరగోళాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. 

15-18 మధ్య వయసు గల వారికి టీకాలు వేసేందుకు గుర్తించిన కేంద్రాల్లో క్యూ లైన్ లను ఏర్పాటు చేయాలనిటీకా వేసేందుకు విడిగా బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు ఆయన సూచించారు. సరైన వ్యాక్సిన్ ఇచ్చేలా చూసేందుకు టీకా కేంద్రంలో 15-18 మధ్య వయసు గల వారికి ఒక క్యూమిగిలినవారికి మరొక క్యూ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. 

రెండవ డోసు తీసుకున్న తొమ్మిది నెలలు ( 39 వారాలు) తర్వాత మాత్రమే  ముందు జాగ్రత్త డోస్ తీసుకోవడానికి లబ్ధిదారు అర్హత పొందుతారు. డాక్టర్ సర్టిఫికెట్ కలిగిన వారికి మాత్రమే టీకా కేంద్రాల్లో ముందు జాగ్రత్త డోస్ ఇస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అన్నారు. ముందు జాగ్రత్త డోస్ పొందేందుకు డాక్టర్  ప్రిస్క్రిప్షన్లు/సర్టిఫికేట్‌ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ముందు జాగ్రత డోస్ తీసుకునే అర్హత కలిగిన వారికి కో-విన్ సందేశాలు పంపుతుందని, డిజిటల్ వాక్సినేషన్ సర్టిఫికెట్ లో దీనిని పొందుపరచడం జరుగుతుందని ఆయన వివరించారు. 

15-18 మధ్య వయసు గల వారికి టీకాలు వేసేందుకు టీకా బృందాలు/ టీకాలు వేసే వారికి పునశ్చరణ కార్యక్రమాలను నిర్వహించేందుంకువారి కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ అయ్యాయి. గుర్తించిన కేంద్రాలకు ముందుగానే కోవాగ్జిన్ టీకాలను సరఫరా చేసినందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ అయ్యాయి. టీకా సమయంలో వ్యాక్సిన్ కలిసి పోకుండా చూసేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని, విడిగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ( పెద్దలకు కూడా టీకాలు వేస్తున్న కేంద్రాలు అయితే), టీకా చేసేందుకు ప్రత్యేక బృందం ( ఒకే సమయంలో టీకా వేసే కేంద్రాల వద్ద) ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సూచనలు జారీ చేశారు. కో-విన్ ద్వారా జిల్లాల వారీగా లభ్డిదారులను గుర్తించి తమకు అవసరమైన టీకాల సంఖ్యను పంపాలని కూడా ఆయన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు.

15-18 మధ్య వయసు గల వారికి టీకాలు వేసేందుకు కార్యక్రమం అమలు జరుగుతుందని ప్రచారం చేయాలని ఆయన అన్నారు. లబ్ధిదారులకు టీకాలు వేసేందుకు అవసరమైన మొత్తంలో డోసులను పంపుతామని ఆయన చెప్పారు. 

సమావేశంలో అదనపు కార్యదర్శి (ఆరోగ్యం) డాక్టర్ మనోహర్ అగ్నానీసంయుక్త కార్యదర్శి  (ఆరోగ్యం) శ్రీ విశాల్ చౌహాన్ ,  ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆరోగ్యం)అడిషనల్ చీఫ్ సెక్రటరీ (ఆరోగ్యం),  సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల  రాష్ట్ర పర్యవేక్షణ అధికారులు పాల్గొన్నారు. 

***



(Release ID: 1785920) Visitor Counter : 329