రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

35 మంది ఐ ఆర్ ఎస్ (సి అండ్ ఐటి) అధికారుల 71వ బ్యాచ్ పాసింగ్ అవుట్ వేడుకకు అధ్యక్షత వహించిన సిబిఐసి చైర్మన్ శ్రీ వివేక్ జోహ్రి

Posted On: 24 DEC 2021 12:34PM by PIB Hyderabad

71వ బ్యాచ్ ఆఫ్ ఐఆర్ఎస్ (సి అండ్ ఐటి) ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఫరీదాబాద్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ (నాసిన్)లో ఈ రోజు పాసింగ్ అవుట్ పరేడ్ తో ముగిసింది.71వ బ్యాచ్ లో 35 మంది అధికారులు ఉన్నారు, వీరిలో 10 మంది మహిళా ఆఫీసర్లు ఉన్నారు. ఈ యువ అధికారులు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పరోక్ష పన్నుల విధానంలో భారతదేశ అత్యంత ప్రసిద్ధ సంస్కరణ అయిన జి ఎస్ టి నిర్వహణకు నాయకత్వం వహిస్తారు.

కేంద్ర పరోక్ష పన్నులు ,కస్టమ్స్ (సిబిఐసి) ఛైర్మన్ శ్రీ వివేక్ జోహ్రి ఈ అధ్యక్షత వహించారు శిక్షణ పూర్తి చేసుకున్న అధికారుల కవాతు ను తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. 

శ్రీ జోహ్రి తన ముగింపు ప్రసంగంలో, ఇది శిక్షణ ముగింపు కావచ్చు కానీ ఖచ్చితంగా వారి అభ్యసన ముగింపు కాకూడదనే  విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని అధికారులను ఉద్బోధించారు.సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని శ్రీ జోహ్రి అధికారులను ప్రోత్సహించారు రాబోయే సవాళ్లను ఎదుర్కోవటానికి సంస్థను ఒక డేటాతో నడిచేదిగా చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు 71వ బ్యాచ్ అధికారులను శ్రీ జోహ్రి అభినందించార. వారిని సంపూర్ణ వ్యక్తులుగా తీర్చి దిద్దడం లో  అధికారుల కుటుంబాల సహకారాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు.

ఎన్.ఎ.సి.ఐ.ఎన్. డైరెక్టర్ జనరల్ శ్రీ హిమాన్షు గుప్తా స్వాగతపన్యాసం చేశారు. కష్ట పడి చేసే పనికి ప్రాముఖ్యతను , వృత్తి జీవితంలో మంచి పని నైతికత ను పాటించడం  ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.

సభ్యుడు (అడ్మిన్), మౌంట్ సుంగితా శర్మ తన ప్రసంగంలో, కేటాయించిన ఉత్సాహంగా నిబద్దులు కావాలని,దేశానికి సేవ చేయడానికి ప్రేరణ పొందాలని అధికారులను కోరారు.కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ,అకాడమీలో శిక్షణకు కట్టుబడి ఉండటంలో బ్యాచ్ ప్రదర్శించిన అసాధారణ మైన దృఢత్వం ,ధైర్యాన్ని ఆమె ప్రశంసించారు.

పాసింగ్ అవుట్ వేడుకలో, శిక్షణ లో వివిధ రంగాలలో రాణించిన ఐదుగురు ఆఫీసర్ ట్రైనీలకు వారి అసాధారణ విజయాలకు పతకాలు లభించాయి. ఎస్.గజరాజ్ బచవత్ అత్యుత్తమ ఓవరాల్ పనితీరుకు ఆర్థిక మంత్రి బంగారు పతకాన్ని అందుకున్నారు.

 

****



(Release ID: 1784873) Visitor Counter : 171