ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్19 స్థితి , సంసిద్ధత పై కేంద్రం సమీక్ష


అప్రమత్తంగా ఉండాలని , కేసుల పోజిటివిటి,, రెట్టింపు రేటు, జిల్లాల వ్యాప్తంగా కొత్త కేసుల క్లస్టర్లను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు సలహా

అన్ని జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తత ను తగ్గించ వద్దని సూచన

కోవిడ్ కంట్రోల్ ,మేనేజ్ మెంట్ కోసం ఎవిడెన్స్ ఆధారిత చర్యలను సకాలం లో ప్రారంభించడానికి స్థానిక/జిల్లా
యంత్రాంగాలు బాధ్యత వహించాలి

రాబోయే పండుగ సీజన్ కు ముందు స్థానికంగా ఆంక్షలు, పరిమితుల విధింపు ను రాష్ట్రాలు పరిశీలించాలి


ఇప్పటికే ఉన్న నేషనల్ క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రోటోకాల్ ఒమిక్రాన్ కూ యథాతథం

‘’పూర్తి వ్యాక్సినేషన్ తో తీవ్రమైన అస్వస్థత , ఒమిక్రాన్ తో సహా ఆసుపత్రిలో చేరడంనుంచి రక్షణ; ఇంటింటికి వ్యాక్సినేషన్ బలోపేతం చేయాలి"

Posted On: 23 DEC 2021 3:04PM by PIB Hyderabad

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (26 నవంబర్ 2021 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన కలిగించేదిగా ప్రకటించిన వేరియెంట్) వ్యాప్తి దృష్ట్యా కోవిడ్19 ( దాని వేరియెంట్ల) తో పోరాడటానికి తమ సంసిద్ధతను కొనసాగించాలని, అప్రమత్తత ను మాత్రం తగ్గించ వద్దని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్  రోజు కోవిడ్19, ఒమిక్రాన్ వేరియంట్ తో పోరాడటానికి రాష్ట్రాల ప్రజారోగ్య సంసిద్ధతను, వాక్సినేషన్ పురోగతిని ఆరోగ్య కార్యదర్శులు ,రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాల ఎన్ హెచ్ ఎం ఎండిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కోవిడ్ గమనాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల వ్యాప్తి గురించి రాష్ట్రాల దృష్టికి తెచ్చారు.

 

కేసుల పోజిటివిటి 10% దాటి పెరిగినప్పుడు లేదా ఆక్సిజన్ తో కూడిన పడకల ఆక్యుపెన్సీ 40% దాటి పెరిగినప్పుడు జిల్లా/స్థానిక పాలనా యంత్రాంగాలు స్థానికంగా  నియంత్రణ చర్యలను అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పునరుద్ఘాటించారు.

అయితే, స్థానిక పరిస్థితి ,జనాభా లక్షణాల ఆధారంగాఒమిక్రాన్ అధిక వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రాలు/యుటిలు నియంత్రణ చర్యలను చేపట్టవచ్చుననీ, పరిమితిని చేరుకోవడానికి ముందే ఆంక్షలు విధించవచ్చు ననీ , అంక్షలనైనా కనీసం 14 రోజులు అమలు చేయాలని సలహా ఇచ్చారు. ఒమిక్రాన్ వేరియంట్ సిండ్రోమ్ లు అధిక ట్రాన్స్ మిసిబిలిటీ , సాధారణ జలుబును తొందరగా వ్యాపింప చేస్తాయి గనుక కోవిడ్ నియంత్రణ కు సిండ్రోమిక్ అప్రోచ్ ని ఉపయోగించవచ్చు.

 

ఒమిక్రాన్ ముప్పును పరిష్కరించడానికి తిరిగి  క్రింది 5-రెట్లు వ్యూహం పై దృష్టి పెట్టాలి.

 

1. నియంత్రణపై, రాష్ట్రాలకు దిగువ సలహా ఇవ్వబడింది:

 

రాత్రి కర్ఫ్యూలు విధించండి .పెద్ద సమావేశాలను కఠినంగా నియంత్రించేలా చూసుకోండి, ముఖ్యంగా రాబోయే ఉత్సవాలకు ముందు.

కోవిడ్ పాజిటివ్ కేసుల కొత్త క్లస్టర్ లలో "కంటైనర్ జోన్లు", "బఫర్ జోన్లు" గురించి వెంటనే తెలియజేయండి.

మార్గదర్శకాల కు అనుగుణంగా

కంటెయిన్మెంట్ జోన్ ఖచ్చితమైన పరిధి నియంత్రణను ధృవీకరించండి.

ఆలస్యం చేయకుండా జినోమ్ సీక్వెన్సింగ్ కు అన్ని క్లస్టర్ నమూనాలను . ఎన్ఎస్..సి..జి ల్యాబ్స్ కు పంపండి.

 

2. టెస్టింగ్ సర్వైవలెన్స్ పై, అన్ని జిల్లాల్లో డెల్టా, ఒమిక్రాన్ కేసుల సంఖ్యను నిశితంగా కఠినంగా గమనించాలని రాష్ట్రాలను కోరారు; రోజు వారీ, వారం వారీగా కేసు పోజిటివిటీ; రెట్టింపు రేటు; కొత్త గా అభివృద్ధి చెందుతున్న క్లస్టర్లు -- ప్రాంతాల్లో కంటెయిన్మెంట్ ప్రారంభించండి.

 

దీనికి అదనంగా, దిగువ పేర్కొన్న వాటిలో కూడా శ్రద్ధ అవసరం అవుతుంది:

 

ఐసిఎమ్ ఆర్ ,ఎమ్ వోహెచ్ ఎఫ్ డబ్ల్యు మార్గదర్శకాల కు అనుగుణంగా పరీక్షలు నిర్వహించండి.

కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఇంటింటి కేసుల తనిఖీ జరిగేలా చూడాలి.

 

అన్ని ఎస్ ఆర్/ ఐఎల్ ఇంకా నిస్సహాయ/సహ-అనారోగ్య వ్యక్తులకు పరీక్షలు

 

ఆర్ టి-పిసిఆర్ సరైన నిష్పత్తిని ధృవీకరించండి:

ప్రతిరోజూ నిర్వహించబడుతున్న మొత్తం పరీక్షల్లో ఆర్ టీ (కనీసం 60:40):

దీనిని 70:30 నిష్పత్తి వరకు ర్యాంప్ చేయవచ్చు.

కోవిడ్ పాజిటివ్ వ్యక్తులందరి కాంటాక్ట్ ట్రేసింగ్ , సకాలంలో వారి టెస్టింగ్, మరిముఖ్యంగా అధిక సంఖ్యలను నివేదించే క్లస్టర్ ల్లో ధృవీకరించండి.

అంతర్జాతీయ ప్రయాణీకులను మానిటర్ చేయడం కోసం ''ఎయిర్ సువిధ '' పోర్టల్ ని ఉపయోగించుకోండి.

 

3. క్లినికల్ మేనేజ్ మెంట్ పై, ప్రస్తుతం ఉన్న నేషనల్ క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రోటోకాల్ ఒమిరాన్ కోసం మారలేదని రాష్ట్రాలకు తెలియ చేశారు. వారికి  ఇలా సలహా ఇచ్చారు:

 

పడకల సామర్థ్యాన్ని పెంచడం, అంబులెన్స్ లు వంటి లాజిస్టిక్స్ ధృవీకరించడం ,రోగులను అంతరాయం లేకుండా మార్చడం కోసం యంత్రాంగాన్ని అమలు చేయడం

ఆక్సిజన్ ఎక్విప్ మెంట్ నిర్వాహక సంసిద్ధతను ధృవీకరించడం

కనీసం 30 రోజుల ఆవశ్యక ఔషధాల బఫర్ స్టాక్ కలిగి ఉండడం ,అత్యవసర పరిస్థితికి ప్రతిస్పందించడానికి హాట్ స్పాట్ వద్ద/దగ్గరల్లో ఆరోగ్య వ్యవస్థల అవసరమైన సామర్థ్యం అభివృద్ధి చేయబడుతుందని ధృవీకరించుకోవడం కోసం ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ (ఈసిఆర్ పి-2) కింద మంజూరు చేయబడ్డ నిధులను ఉపయోగించుకోవడం; విషయంలో ఆర్థిక వ్యయం స్థితి ,పురోగతి , ఫిజికల్ పురోగతిని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శులు రోజువారీగా పర్యవేక్షించాలి.

ఇంటి క్వారంటైన్/ఐసోలేషన్ ని మార్గదర్శకాలకు అనుగుణంగా కట్టుదిట్టంగా అమలు చేయాలి

అనేక రాష్ట్రాలు కోవిడ్ సదుపాయాలను తొలగించినందున, కోవిడ్ కేసులు పెరిగినట్లయితే, ఒక్క కాల్ తో వైద్యులు ,అంబులెన్స్ తగినంత లభ్యతతో పాటు వీటిని అమలు చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధంగా ఉంచాలి.

 

4. కోవిడ్ సేఫ్ బిహేవియర్ కు సంబంధించి రాష్ట్రాలకు దిగువ సలహా ఇచ్చారు.

 

తప్పుడు సమాచారం లేదా భయాందోళనలు లేకుండా ముందస్తు నిమగ్నత , సమాచారాన్ని ధృవీకరించండి.

ఆసుపత్రి ,టెస్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లభ్యతపై పారదర్శకంగా సమాచారం ఇవ్వండి

క్రమం తప్పకుండా మీడియా కు వివరాలు ఇవ్వండి

కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించండి కోవిడ్ కు ప్రతీస్పందిత ప్రవర్తనను కఠినంగా అమలు చేయండి.

 

5. వ్యాక్సినేషన్ కు సంబంధించి, రాష్ట్రాలకు దిగువ పేర్కొన్న సలహా ఇచ్చారు.

 

మొదటిరెండో మోతాదు అర్హులైన లబ్ధిదారుల లో వదిలివేసిన వారికి వాక్సిన్ ఇవ్వడం ద్వారా 100% కవరేజీని వేగవంతమైన రీతిలో పూర్తి చేయాలి.

మొదటి ,రెండవ మోతాదు కవరేజీ జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న జిల్లాల పై  ప్రత్యేక దృష్టి సారించండి.

వ్యాక్సినేషన్ కవరేజీ జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు/యుటిల్లో ఇంటింటి వ్యాక్సినేషన్ ప్రచారాన్ని బలోపేతం చేయండి.

సమీప భవిష్యత్తులో ఎన్నికలకు వెళుతున్న రాష్ట్రాల లో  lముఖ్యంగా తక్కువ కవరేజీ జిల్లాల్లో నిస్సహాయ జనాభా కు రక్షణ కల్పించడానికి  వ్యాక్సినేషన్ ప్రక్రియ ను వేగవంతం చేయాలి

తక్కువ వ్యాక్సినేషన్ కవరేజీ ఉన్న ప్రాంతాలు, తక్కువ కోవిడ్ ఎక్స్ పోజర్ ఉన్నవారు కొత్త ఓమిరాన్ వేరియెంట్ కు మరింత హాని కలిగించవచ్చు. అలాంటి చోట వ్యాక్సినేషన్ పెంచడానికి రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

 

ఆర్తీ అహుజా ,అదనపు కార్యదర్శి (ఆరోగ్య), శ్రీ వికాస్ షీల్, అదనపు కార్యదర్శి ,మిషన్ డైరెక్టర్, ఎన్ హెచ్ ఎం, డాక్టర్ మన్ దీప్ భండారీ, జాయింట్ సెక్రటరీ (హెల్త్), డాక్టర్ రణదీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్, న్యూఢిల్లీ, ఎన్ సిడిసి డైరెక్టర్ డాక్టర్ సుజీత్ సింగ్ ,ఎడిజి, ఐసిఎంఆర్ డాక్టర్ సమిరాన్ పాండా కూడా సమీక్షలో పాల్గొన్నారు.పాల్గొన్నారు.

 

****



(Release ID: 1784801) Visitor Counter : 131