రక్షణ మంత్రిత్వ శాఖ
డిఆర్దీఓ దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త తరం ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి 'ప్రళయ్' తొలి ప్రయోగాన్ని నిర్వహించింది
प्रविष्टि तिथि:
22 DEC 2021 1:12PM by PIB Hyderabad
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్దీఓ) డిసెంబరు 22, 2021న ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి 'ప్రళయ్' తొలి గగన పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. మిషన్ దాని లక్ష్యాలన్నింటినీ సాధించింది. . కొత్త క్షిపణి కావలసిన పాక్షిక బాలిస్టిక్ పథాన్ని అనుసరించింది. అధిక స్థాయి ఖచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంది, నియంత్రణ, మార్గదర్శకత్వం, మిషన్ అల్గారిథమ్‌లను ధృవీకరించింది. అన్ని ఉప వ్యవస్థలు సంతృప్తికరంగా పనిచేశాయి. డౌన్ రేంజ్ షిప్‌లతో సహా తూర్పు తీరంలోని ఇంపాక్ట్ పాయింట్ దగ్గర మోహరించిన అన్ని సెన్సార్‌లు క్షిపణి పథాన్ని ట్రాక్ చేస్తాయి.
క్షిపణి సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటారు మరియు అనేక కొత్త సాంకేతికతలతో పనిచేస్తుంది. క్షిపణి 150-500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. మొబైల్ లాంచర్ నుండి ప్రయోగించవచ్చు. క్షిపణి మార్గదర్శక వ్యవస్థలో అత్యాధునిక నావిగేషన్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ ఉన్నాయి.
ఈ తొలి డెవలప్‌మెంట్ ఫ్లైట్ ట్రయల్ కోసం రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ డిఆర్దీఓ అనుబంధ బృందాలను అభినందించారు. ఆధునిక ఉపరితలం నుండి ఉపరితల క్షిపణిని వేగంగా అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రయోగించినందుకు ఆయన డిఆర్దీఓని ప్రశంసించారు. రక్షణ శాఖ కార్యదర్శి, డిఆర్దీఓ చైర్మన్, డాక్టర్ జి.సతీష్ రెడ్డి బృందాన్ని అభినందించారు మరియు ఇది కొత్త తరం ఉపరితలం నుండి ఉపరితల క్షిపణి అని అన్నారు. ఆధునిక సాంకేతికతలతో కూడిన ఈ ఆయుధ వ్యవస్థ వల్ల సాయుధ దళాలకు మరింత బలం చేకూర్చినట్టయింది.


******
(रिलीज़ आईडी: 1784470)
आगंतुक पटल : 271