మంత్రిమండలి
కాంపిటిశన్కమిశన్ ఆఫ్ ఇండియా కు మరియు కాంపిటీశన్ కమిశన్ ఆఫ్ మారిశస్ కు మధ్య అవగాహన పూర్వకఒప్పంద పత్రాని కి ఆమోదం తెలిపిన మంత్రి మండలి
Posted On:
22 DEC 2021 5:23PM by PIB Hyderabad
కాంపిటిశన్ లా ఎండ్ పాలిసి లో సహకారాన్ని పటిష్ట పరచుకోవడాని కి మరియు ఆ సహకారాన్ని ప్రోత్సహించడాని కి గాను కాంపిటిశన్ కమిశన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కి, కాంపిటిశన్ కమిశన్ ఆఫ్ మారిశస్ (సిసిఎమ్) కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలియజేసింది.
అమలు కు సంబంధించినటువంటి వ్యూహం మరియు లక్ష్యాలు:
సమాచార ఆదాన ప్రదానం, శ్రేష్ఠమైన అభ్యాసాల ను పరస్పరం పంచుకోవడం మరియు సామర్ధ్య నిర్మాణ కార్యక్రమాల ద్వారా కాంపిటిశన్ లా ఎండ్ పాలిసి తాలూకు వ్యవహారాల లో సహకారాన్ని బలపరచుకోవడం మరియు ప్రోత్సాహాన్ని అందించడం ఈ ఎమ్ఒయు ధ్యేయాలు గా ఉన్నాయి. సాంకేతిక పరమైనటువంటి సహకారాన్ని, అనుభవాన్ని ఉభయ పక్షాలు ఒకదాని కి మరొకటి వెల్లడించుకోవడం తో పాటు అమలు పరం గా సహకారం అనే రంగాల లో పరస్పరం సహకారాన్ని వృద్ధి చెందింప జేయడం ఈ ఎమ్ఒయు ఉద్దేశం గా ఉంది. దీని వల్ల ఒనగూడే ఫలితాలు సంబంధిత వినియోగదారులు పలువురికి లబ్ధి ని చేకూర్చడమే కాకుండా సమానత్వాన్ని, సమ్మిళితత్వాన్ని కూడాను ప్రోత్సహించగలవు.
ప్రభావం:
సిసిఐ కి మరియు సిసిఎమ్ కు మధ్య ఎమ్ఒయు వల్ల -
- ఎ) అంతర్జాతీయ వ్యాపారం పై ప్రభావాన్ని ప్రసరించే స్పర్ధ నిరోధక అవరోధాల ను పరిష్కరిస్తుందని;
- బి) సిసిఐ ద్వారా కాంపిటిశన్ యాక్ట్, 2002 యొక్క అమలు లో మెరుగుదల కు ఆస్కారం కల్పిస్తుందని;
- సి) కాంపిటిశన్ పాలిసి తాలూకు అవగాహన ను ప్రోత్సహిస్తుందని;
- డి) కెపాసిటీ బిల్డింగ్ కు దోహదపడుతుందని,
- ఇ) దౌత్యపరమైనటువంటి ప్రయోజనాల ను అందిస్తుందని
భావించడం జరుతోంది.
ఈ అవగాహన పూర్వక ఒప్పంద పత్రం తాలూకు ప్రధానమైన లబ్ధిదారులు ఎవరెవరంటే, భారతదేశం పక్షాన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధి లోని కాంపిటీశన్ కమిశన్ ఆఫ్ ఇండియా మరియు అవతలి పక్షాన కాంపిటీశన్ కమిశన్ ఆఫ్ మారిశస్ అనేవే.
పూర్వరంగం:
కాంపిటిశన్ యాక్ట్, 2002 లోని 18 వ సెక్షను సిసిఐ కి దాని విధుల ను నిర్వర్తించడం లో లేదా చట్టం ప్రకారం దాని విధుల ను నెరవేర్చడం లో ఏదైనా విదేశీ సంస్థ తో ఒక ఒప్పంద పత్రాన్ని కుదుర్చుకోవడానికి గాని లేదా వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవడానికి గాని అనుమతి ని ఇస్తోంది.
***
(Release ID: 1784316)
Visitor Counter : 182
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam