సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడానికి ఐసిసిఆర్ తో ప్రసార భారతి అవగాహనా ఒప్పందం

Posted On: 20 DEC 2021 2:50PM by PIB Hyderabad

ప్రసార భారతిభారత సాంస్కృతిక సంబంధాల మండలి (ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ) భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడానికి, ప్రాచుర్యం కల్పించడానికి  రోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఒప్పందం ప్రకారం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్)తో సంబంధం ఉన్న ప్రముఖ కళాకారుల ప్రదర్శనల ను  దూరదర్శన్ జాతీయ ,అంతర్జాతీయ ఛానెళ్లలో ప్రసారం చేస్తారు. నృత్య , సంగీత ప్రదర్శనలను డిడి నేషనల్, డిడి ఇండియా, దూరదర్శన్ ప్రాంతీయ ఛానల్స్ , ప్రసార భారతి న్యూస్ సర్వీసెస్ (ప్రసార భారతి యొక్క డిజిటల్ ప్లాట్ ఫారం) లో వారపు (వీక్లీ) కార్యక్రమం రూపంలో ప్రదర్శిస్తారు.

జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకు భారతీయ సంస్కృతిలో ఉత్తమమైనవి అందించడం, కళాకారులకు టీవీ, డిజిటల్ వేదికలను అందించడం ఎంఒయు లక్ష్యం,

ఐసిసిఆర్ సహకారంతో, దూరదర్శన్ ఐసిసిఆర్ నిర్వహించిన సంగీతం/నృత్యం సాంస్కృతిక కార్యక్రమాలు/కచేరీలు/ప్రదర్శనల ఆధారంగా 52 అరగంట ఎపిసోడ్లను నిర్మిస్తుంది.

ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ శశి శేఖర్ వెంపటి, శ్రీ డిపిఎస్ నేగి, సభ్యుడు (ఫైనాన్స్), ప్రసార భారతి ,భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి కి చెందిన ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ శ్రీ మయాంక్ కుమార్ అగ్రవాల్ ,భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి డైరెక్టర్ జనరల్ శ్రీ దినేష్ కె పట్నాయక్ఈ అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశారు.

ఎమ్ఒయు డిసెంబర్ 2021 నుండి డిసెంబర్ 2023 వరకు మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది

 

*****


(Release ID: 1783525) Visitor Counter : 164