పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కొనసాగుతున్న ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, పిఎఫ్ ప్రయోజనాలను అందించడాన్ని కొనసాగించనున్న భారత ప్రభుత్వం
Posted On:
20 DEC 2021 2:36PM by PIB Hyderabad
వ్యూహాత్మక భాగస్వామితో 25-10-2021న చేసుకున్న ఒప్పందంపై సంతకాలలో ఉద్యోగుల ప్రయోజనాలను గురించి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.
వర్తించే చట్టాలకు అనుగుణంగా, వ్యూహాత్మక భాగస్వామి పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత, ఉద్యోగులకు గ్రాట్యుటీ, పిఎఫ్ ప్రయోజనాలను అందించడం కొనసాగించాలి. ప్రస్తుతమున్న ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల సెల్ఫ్ కంట్రిబ్యూటరీ సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ ట్రస్టు ఫండును నిర్వహించడం కోసం ఉద్యోగులు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేసిన ఏర్పాటు కొనసాగుతుంది. ఇక వైద్య ప్రయోజనాలకు సంబందించి, ఎయిర్ ఇండియా నుంచి పదవీవిరమణ చేస్తున్న అర్హులైన, ఇప్పటికే పదవీకాలం పూర్తి చేసుకున్నవారికీ వాటిని ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
ఈ సమాచారాన్ని నేడు రాజ్యసభలో నేడు అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో పౌర విమానాయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (జనరల్. (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) అందించారు.
***
(Release ID: 1783451)
Visitor Counter : 169