గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కింద మహిళా ఎస్‌హెచ్‌జీసభ్యులకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ప్రారంభించనున్న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ


బ్యాంకులు మరియు రాష్ట్ర మిషన్ల నుండి ఉన్నత అధికారులు "రూరల్‌ ఫైనాన్సియల్‌ ఇన్‌క్లూజన్‌"లో పాల్గొంటారు

2020-21 సంవత్సరంలో డిఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కింద బ్యాంకుల పనితీరుకు వార్షిక అవార్డులు కూడా ప్రకటించబడతాయి.

Posted On: 17 DEC 2021 12:15PM by PIB Hyderabad

 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా  డిసెంబర్ 18, 2021న డిఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కింద ధృవీకరించబడిన మహిళా ఎస్‌హెచ్‌జి సభ్యులకు రూ.5,000 ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ప్రారంభిస్తారు.ఈ కార్యక్రమంలో "రూరల్‌ ఫైనాన్సియల్‌ ఇన్‌క్లూజన్‌"ఉపన్యాసం కూడా ఉంటుంది. ఇందులో బ్యాంకులు మరియు రాష్ట్ర మిషన్‌లకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. 2020-21 సంవత్సరంలో డిఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కింద బ్యాంకుల పనితీరుకు వార్షిక అవార్డులు కూడా ప్రకటించబడతాయి.

అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు వర్చువల్ మోడ్ ద్వారా జరిగే లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొంటాయి. రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ల నుండి మేనేజింగ్ డైరెక్టర్లు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు/డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు/బ్యాంకుల జనరల్ మేనేజర్లు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు/స్టేట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంటుంది.

2019-20 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన ప్రకారం రూ. 5,000/- ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని  ధృవీకరించబడిన ఎస్‌హెచ్‌జీ సభ్యులకు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డిఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా ఎస్‌హెచ్‌జి సభ్యులకు వారి తక్షణ/సమస్యలను తీర్చడానికి ఓడీ సౌకర్యాన్ని అందించే ప్రక్రియను ప్రారంభించింది. డిఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం  కింద సుమారు 5 కోట్ల మంది మహిళా ఎస్‌హెచ్‌జీ  సభ్యులు ఈ సదుపాయానికి అర్హులు కావచ్చని అంచనా.

అవసరమైన అనుమతులు పొందిన తర్వాత ముంబైకు చెందిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్..ఈ పథకాన్ని అమలు చేయాలని 26 నవంబర్, 2021న అన్ని బ్యాంకులకు సూచించింది. మరియు ఇతర అవసరమైన వివరాలు కూడా షేర్ చేయబడ్డాయి. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం మంత్రిత్వ శాఖ ఇప్పటికే బ్యాంకుల సీనియర్ అధికారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ప్రక్రియను ప్రారంభించాయి మరియు గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళా ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఈ సదుపాయాన్ని పొందేందుకు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద తమ సేవింగ్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉన్న బ్యాంకుల శాఖలను సందర్శించాలి.

డిఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం (దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్) గురించి:

దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డిఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం), గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్. పేద మహిళలను స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీలు) వంటి కమ్యూనిటీ సంస్థల్లోకి సమీకరించడం ద్వారా గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం మరియు అవసరమైన రుణాన్ని బ్యాంకుల నుండి పొందడం ద్వారా వారి జీవనోపాధిని బలోపేతం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ మిషన్ 2011 జూన్‌లో ప్రారంభించబడింది మరియు డిసెంబర్ 15, 2021 నాటికి, 8.04 కోట్ల గ్రామీణ మహిళలను 73.5 లక్షల స్వయం సహాయక బృందాలుగా సమీకరించారు మరియు 2024 నాటికి సుమారు 10 కోట్ల మంది మహిళలను స్వయం సహాయక బృందాలుగా సమీకరించాలని భావించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 30, 2021 వరకు, 27.38 లక్షల స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రూ. 62,848 కోట్ల మేరకు రుణాన్ని అందించాయి మరియు ఏప్రిల్, 2013 నుండి ఇప్పటివరకు మహిళా స్వయం సహాయక సంఘాలు రూ.4.45 లక్షల కోట్లకు పైగా రుణాలు పొందాయి. ఉత్పాదక సంస్థలలో తగిన పెట్టుబడి పెట్ట బడింది. బకాయి బ్యాలెన్స్ కేవలం 2.49% ఎన్‌పిఏతో రూ 1,33,915 కోట్ల కంటే ఎక్కువ. మిషన్ కమ్యూనిటీ బేస్డ్ రీపేమెంట్ మెకానిజమ్ (సిబిఆర్‌ఎం)ని ఉపయోగిస్తోంది. దీనిలో వివిధ ఎస్‌హెచ్‌జీలు లేదా వాటి సమాఖ్యల నుండి తీసుకోబడిన ప్రతినిధులతో కూడిన కమిటీ ఎస్‌హెచ్‌జి బ్యాంకుల అనుసంధానాన్ని పర్యవేక్షించే బాధ్యతను తీసుకుంటుంది మరియు నియమాలు మరియు సామాజిక ఒత్తిడిని అమలు చేయడం ద్వారా బ్యాంకులకు ఎస్‌హెచ్‌జి ద్వారా వెంటనే తిరిగి చెల్లించేలా చేస్తుంది.


 

*****


(Release ID: 1782987) Visitor Counter : 223