హోం మంత్రిత్వ శాఖ

నేరపూర్వక అంశాలలో పరస్పరం శాసనపరమైన సహాయాని కి సంబంధించి భారతదేశానికి, పోలండ్ లకు మధ్య ఒక సంధికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 15 DEC 2021 4:07PM by PIB Hyderabad

నేర పూర్వక అంశాల లో పరస్పరం శాసనపరమైన సహాయాని కి గాను భారత గణతంత్ర ప్రభుత్వాని కి మరియు పోలండ్ గణతంత్రాని కి మధ్య ఒక సంధి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ నేర సంబంధి అంశాల లో ఉగ్రవాదం తో ముడిపడిన నేరాలు సహా నేరాల దర్యాప్తు ప్రక్రియ లో, నేరాల తాలూకు ఫిర్యాదు చేయడం లో, నేరాల కు సంబంధించిన విచారణ ను జరిపే ప్రక్రియ లో ఇరు దేశాల సామర్ధ్యాన్ని, నిపుణత ను వృద్ధి చెందింప చేయాలి అనే దృష్టి కోణం ఇమిడి ఉంది.

ప్రయోజనాలు:

నేర పూర్వక అంశాల లో సహకారం, ఇంకా పరస్పర శాసన సంబంధి సహకారం ల ద్వారా నేరాల దర్యాప్తు లో, నేరాల తాలూకు ఫిర్యాదు చేయడం లో, నేరాల కు సంబంధించిన విచారణ ను జరిపే ప్రక్రియ లో ఉభయ దేశాల యొక్క సమర్ధత ను పెంచడాని కి ఉద్దేశించినటువంటిది గా ఈ ఒడంబడిక ఉంది. అనేక దేశాల లో నేరాల కు ఉగ్రవాదం తో లంకె లు ఉంటున్న నేపథ్యం లో, ప్రతిపాదిత ఒప్పందం నేర సంబంధి దర్యాప్తు, ఇంకా విచారణ లలో పోలండ్ తో ద్వైపాక్షిక సహకారాని కి గాను ఒక స్థూలమైనటువంటి న్యాయ స్వరూపాని కి రూపు రేఖల ను అందించనుంది. అంతేకాకుండా ఉగ్రవాద చర్యల కు ఆర్థిక సహాయం అందించేందుకు మళ్ళిస్తున్న నిధుల తో పాటు నేరాని కి ఉపయోగించే సాధనాల ను గురించి ఆరా తీయడం, వాటి చలామణీ ని అడ్డుకోవడం, ఆయా నేర సంబంధి ఉపకరణాల ను స్వాధీనం చేసుకోవడం వంటివి కూడాను ఈ సంధి పరిధి లోకి వస్తాయి.

ఈ ఒప్పంద పత్రాల పైన సంతకాలు చేసి, దీనికి అనుమోదాన్ని ప్రకటించిన అనంతరం భారతదేశం లో ఈ ఒప్పందం నిబంధన లు అమలు లోకి రావడానికి గాను సిఆర్.పి.సి 1973 లోని సంబంధిత నియమావళి కి అనుగుణంగా గజెట్ నోటిఫికేశన్ లను జారీ చేయడం జరుగుతుంది. ఈ గజెట్ నోటిఫికేశన్ ప్రభుత్వ అధికార పరిధి కి ఆవల సాధారణ ప్రజానీకాని కి అందుబాటు లో ఉండగలదు. మరి ఇది నేర సంబంధి అంశాల లో భారతదేశాని కి, పోలండ్ కు మధ్య పరస్పర శాసన సంబంధి సహకారం అనే అంశం లో చైతన్యాన్ని, పారదర్శకత్వాన్ని ఇనుమడింప చేయగలదు.

ఇది పోలండ్ కు ప్రమేయం ఉన్నటువంటి నేర పూర్వక కార్యకలాపాల ను పరిష్కరించడం లో భారతదేశాని కి గల దక్షత ను వృద్ధి చేయగలదు. ఈ సంధి గనక ఒకసారి ఆచరణ లోకి వచ్చింది అంటే వ్యవస్థీకృత నేరగాళ్ళు, ఉగ్రవాదులు పని చేసే పద్ధతి తాలూకు లోతుపాతుల ను గురించిన మెరుగైన అవగాహన ను అలవరచుకోవడం లో ఇది కీలక పాత్ర ను పోషించ గలుగుతుంది. తత్ఫలితం గా దేశం లోపల భద్రత రంగం లో అనుసరిస్తున్న విధాన నిర్ణయాల కు మరిన్ని మెరుగులు దిద్దుకోవడాని కి కూడా ఇది దోహదం చేయగలుగుతుంది.

 

***

 



(Release ID: 1781837) Visitor Counter : 127