ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా వెంటిలేటర్ల అందుబాటుపై తాజా సమాచారం

Posted On: 14 DEC 2021 2:17PM by PIB Hyderabad

కోవిడ్ ను ఎదుర్కునేలా దేశవ్యాప్తంగా వెంటిలేటర్లు అందుబాటులో ఉండేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ  రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు అందించటానికి గాను వాటి కొనుగోళ్ళను కేంద్రీకృతం చేసింది.  రాష్ట్రాలనుంచి అవసరం ఉన్నట్టు సమాచారం అందగానే వాటికి అందించిన  వెంటిలేటర్ల వివరాలు దిగువ అనుబంధం లో ఉన్నాయి. 

ఈ వెంటిలేటర్ల వినియోగం మీద రాష్ట్రాలకు విస్తృతంగా శిక్షణ ఇచ్చారు. 19,000 మందికి పైగా డాక్టర్లు, పారామెడీకల సిబ్బంది ఈ శిక్షణ తీసుకున్నారు. వెంటిలేటర్లు ఎప్పుడూ వినియోగంలో ఉండేట్టు చూసుకోవాలని, మరమ్మతులతో సిద్ధంగా ఉండాలని  కూడా కేంద్రం సూచనలిచ్చింది. తగిన ఆక్సిజెన్ పీడనం ఉండేలా జాగ్రత్తపడుతూ, పైపుల నిర్వహణ చేపట్టి  సమర్థంగా వినియోగించుకోవాలని సూచించింది. ఎప్పుడూ  సుశిక్షితులైన సిబ్బంది మాత్రమే వాటిని వాడేట్టు చూసుకోవాలని చెప్పింది.

అనుబంధం

రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు, కేంద్ర సంస్థలకు వాటి డిమాండ్ కు అనుగుణంగా అందించిన వెంటిలేటర్లు

 

సంఖ్య

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం/కేంద్ర సంస్థ  

ఇచ్చిన వెంటిలేటర్ల సంఖ్య

 
 

1

అండమాన్ నికోబార్ దీవులు

34

 

2

ఆంధ్రప్రదేశ్

5610

 

3

అరుణాచల్ ప్రదేశ్

63

 

4

అస్సాం

1000

 

5

బీహార్

500

 

6

చండీగఢ్

109

 

7

ఛత్తీస్ గఢ్

515

 

8

దాద్రా, నాగర్ హవేలి, డయ్యూ డామన్

20

 

9

ఢిల్లీ

1080

 

10

గోవా

200

 

11

గుజరాత్

5700

 

12

హర్యానా

673

 

13

హిమాచల్ ప్రదేశ్

500

 

14

జమ్ముకాశ్మీర్

908

 

15

జార్ఖండ్

1410

 

16

కర్ణాటక

2871

 

17

కేరళ

480

 

18

లద్దాఖ్

130

 

19

మధ్యప్రదేశ్

1611

 

20

మహారాష్ట్ర

5554

 

21

మణిపూర్

247

 

22

మేఘాలయ

86

 

23

మిజోరం

115

 

24

నాగాలాండ్

320

 

25

ఒడిశా

617

 

26

పుదుచ్చేరి

107

 

27

పంజాబ్

809

 

28

రాజస్థాన్

1900

 

29

సిక్కిం

0

 

30

తమిళనాడు

2775

 

31

తెలంగాణ

1796

 

32

త్రిపుర

92

 

33

ఉత్తరాఖండ్

800

 

34

ఉత్తరప్రదేశ్

5216

 

35

పశ్చిమబెంగాల్

1480

 

36

లక్షదీవులు

57

 

37

కేంద్ర సంస్థలు

4813

 

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ భారతి  ప్రవీణ్ పవార్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానమిది.

****

 


(Release ID: 1781500) Visitor Counter : 130