నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

అంత‌ర్జాతీయ సౌర కూట‌మికి ప‌రిశీల‌కుని హోదాను క‌ల్పిస్తూ ఐక్య‌రాజ్య స‌మితి చారిత్రిక నిర్ణ‌యం

Posted On: 11 DEC 2021 5:06PM by PIB Hyderabad

అంత‌ర్జాతీయ సౌర కూట‌మి (ఇంట‌ర్నేష‌న‌ల్ సోలార్ అల‌యెన్స్‌)కి ఐక్య‌రాజ్య స‌మితి పరిశీల‌కుని హోదాను క‌ల్పించింది. ఇది ఒక సూర్యుడు, ఒక ప్ర‌పంచం, ఒక గ్రిడ్  అన్న భావ‌న‌కు ప్రేర‌ణ‌ను, ప్రోత్సాహాన్ని క‌లిగించ‌నుంది. ఇది ప్ర‌పంచానికి న్యాయ‌మైన ఇంధ‌న ప‌రిష్కారాల‌ను అమ‌లు చేసేందుకు తోడ్ప‌డుతుంది.
అంత‌ర్జాతీయ సౌర కూట‌మికి ఐక్య‌రాజ్య స‌మితి ప‌రిశీల‌కుని హోదా మంజూరు చేయ‌డం చారిత్రిక నిర్ణ‌యం... ఇది ఒక‌టే సూర్యుడు ఒక‌టే ప్ర‌పంచం ఒక‌టే గ్రిడ్ అన్న గౌర‌వ‌నీయ ప్ర‌ధాన‌మంత్రి దార్శ‌నిక‌త‌ను ముందుకు తీసుకువెళ్ళేందుకు పునాది రాయిగా ఉండ‌నుంద‌ని కేంద్ర విద్యుత్‌, ఎంఎన్ ఆర్ ఇ మంత్రి ఆర్‌. కె. సింగ్ అభినంద‌న‌ల చెప్తూ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.  ఈ సంద‌ర్భంగా ట్వీట్ చేసిన సింగ్‌, సౌర శ‌ఖ్తిని మోహ‌రించ‌డం ద్వారా న్యాయ‌మైన, స‌మాన‌మైన‌ ఇంధ‌న ప‌రిష్కారాల‌ను తీసుకువ‌చ్చే చొర‌వ‌కు ఇది అత్యంత ప్రోత్సాహాన్ని క‌ల్గిస్తుంద‌ని పేర్కొన్నారు. 
అంతేకాకుండా, అంత‌ర్జాతీయ స‌హ‌కారాల ద్వారా నిక‌ర సున్నా క‌ర్బ‌న ఉద్గారాల‌ను సాధించ‌డంలో ఇది ఎంతగానో తోడ్ప‌డుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
ఇంధ‌న మిశ్ర‌మ‌లంలో పున‌రావృత ఇంధ‌నం గ‌ణనీయ‌మైన వాటాను క‌లిగి ఉండ‌టం ద్వారా భార‌త‌దేశం ఈ మిష‌న్‌కు క్ర‌మంగా స‌హ‌కారం అందిస్తోంద‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. 

 

***



(Release ID: 1780572) Visitor Counter : 168