వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

' ఈశాన్య ప్రాంతంలో లభిస్తున్న అవకాశాలు ప్రపంచానికి పూర్తిగా తెలియదు ' శ్రీ పీయూష్ గోయల్


ఈశాన్య ప్రాంత వెదురు , హస్తకళలు, అరుదైన వస్తువులకు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్త మార్కెట్ అవకాశాలు ఉన్నాయి .. శ్రీ గోయల్

ఈశాన్య ప్రాంత ప్రజల అభివృద్ధికి ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నారు .. ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర మంత్రులు తమ వంతు సహకారం అందించాలి.. శ్రీ గోయల్

ఢిల్లీలో ' మేఘాలయ ఏజ్ ' స్టోర్ ప్రారంభించిన శ్రీ గోయల్

Posted On: 10 DEC 2021 10:57AM by PIB Hyderabad

' ఈశాన్య ప్రాంతంలో లభిస్తున్న అవకాశాలు ప్రపంచానికి పూర్తిగా తెలియదు ' అని కేంద్ర కేంద్ర వాణిజ్యపరిశ్రమలువినియోగదారుల వ్యవహారాల ,  ఆహార ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి   శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీలో ' మేఘాలయ ఏజ్ ' స్టోర్ ని శ్రీ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ గోయల్ మేఘాలయ మల్బరీ సిల్క్‌తో పాటు ఈశాన్య ప్రాంత శాలువాలువెదురుహస్తకళలు , అనేక ఇతర ప్రత్యేకమైన ఉత్పత్తులకు భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా మంచి మార్కెట్ ఉంటుందని అన్నారు. దేశం వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు వీటిని కొనుగోలు చేస్తారని అన్నారు. ప్రపంచం ఒక వేదికగా ఈ వస్తువుల విక్రయాలు జరుగుతాయని అన్నారు. 

ఈశాన్య ప్రాంత  అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని శ్రీ గోయల్ అన్నారు. దేశ పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు సాధించిన అభివృద్ధి  స్థాయితో సమానంగా ఈశాన్య ప్రాంతం అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే భారతదేశ సమగ్ర  అభివృద్ధి సాధ్యమవుతుందన్నఅభిప్రాయంతో ప్రధానమంత్రి ఉన్నారని శ్రీ గోయల్ అన్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి శ్రీ మోదీ మనసా వాచా కట్టుబడి ఉన్నారని శ్రీ గోయల్ వివరించారు. ఈశాన్య ప్రాంత ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలన్న శ్రీ మోదీ కల సాకారం అయ్యేలా చూడడానికి కేంద్ర మంత్రులు కృషి చేయాలని అన్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రతి కేంద్ర మంత్రి తన వంతు సహకారాన్ని అందించాలని అన్నారు. 

దేశ రాజధాని నడిబొడ్డున అనేక ప్రత్యేకలతో స్టోర్ ని ఏర్పాటు చేసిన మేఘాలయ  ముఖ్యమంత్రి శ్రీ కాన్రాడ్ సంగ్మా కు   శ్రీ గోయల్ అభినందనలు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రానికి చెందిన 43,000  నేత కార్మికులకు తమ కళను ప్రదర్శించి వాటికి విక్రయించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. మేఘాలయ రాష్ట్ర సంస్కృతివారసత్వంకళలు, ప్రత్యేక  ఉత్పత్తులను ప్రపంచానికి ఈ స్టోర్ ద్వారా పరిచయం చేయడానికి అవకాశం కలుగుతుందని శ్రీ గోయల్ అన్నారు. రాష్ట్ర  కుటీర పరిశ్రమ అభివృద్ధికి ఇది సహకరిస్తుందని శ్రీ గోయల్ అన్నారు. 

 

 “మేఘాలయ కళాకారులుచేనేత కార్మికులుహస్తకళాకారులు చేస్తున్న అద్భుతమైన పనిని స్టోర్ ప్రతిబింబిస్తుంది. మనం చూస్తున్నది అద్భుతంలో కొంత చిన్న భాగం మాత్రమే. వెలుగు చూడాల్సిన సామర్ధ్యం ఎంతో ఉంది. సమర్ధత, సామర్ధ్యంతో మరింత పురోగతి సాధించడానికి అవకాశం ఉంది' అని శ్రీ గోయల్ వ్యాఖ్యానించారు. 

కార్యక్రమంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల శ్రీ గోయల్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కర్మ యోగిలా వ్యవహరించిన జనరల్ రావత్ బలమైన భారతదేశ నిర్మాణం కోసం కలలు కన్నారని అన్నారు. 

 

 ***



(Release ID: 1780062) Visitor Counter : 109