మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పిల్లలపై మొబైల్, ఇంటర్నెట్ వాడకం ప్రభావం

Posted On: 08 DEC 2021 3:36PM by PIB Hyderabad

నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) ఇటీవల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 5000 నమూనాలతో "మొబైల్ ఫోన్లను,  ఇతర పరికరాలను ఇంటర్నెట్ సదుపాయంతో ఉపయోగించడం వల్ల కలిగే ప్రభావాలు (శారీరక, ప్రవర్తనా  మానసిక-సామాజిక)" అనే అంశంపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. దేశంలోని అన్ని మండలాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులోని వివరాల ప్రకారం, 23.80 శాతం మంది పిల్లలు బెడ్‌పై ఉన్నప్పుడు, నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ అలవాటు వయస్సుతో పాటు పెరుగుతోంది. ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎప్పుడుపడితే అప్పుడు స్మార్ట్‌ఫోన్ల వాడటం వల్ల పిల్లల ఆరోగ్యంపై,  శ్రేయస్సుపై హానికరమైన ప్రభావం ఉంటుంది.  పిల్లలలో ఏకాగ్రత స్థాయులు తగ్గుతాయి. ఈ అధ్యయనం ప్రకారం, 37.15శాతం మంది పిల్లలు, ఎల్లప్పుడూ లేదా తరచుగా స్మార్ట్ ఫోన్ వినియోగం కారణంగా ఏకాగ్రత స్థాయిలను తగ్గించుకున్నారు.-  పరిసరాల్లో కొంతభాగాన్ని అయినా పిల్లల కోసం ఆట స్థలంగా కేటాయించాలని అధ్యయనం ఫలితాల ఆధారంగా ఎన్సీపీసీఆర్ సిఫార్సు చేసింది. దీనివల్ల బాలలు ఆటల్లో చురుగ్గా ఉంటారని పేర్కొంది.

ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి  స్మృతి జుబిన్ ఇరానీ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు. 



(Release ID: 1779426) Visitor Counter : 123