పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

పంచాయితీ రాజ్ సంస్థల నివేదిక ద్వారా 'సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ’ ను విడుదల చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్


జిపిడిపి , ట్రైనింగ్ మేనేజ్ మెంట్ పోర్టల్ పురోగతి పర్యవేక్షణకు జిపిడిపి మానిటరింగ్ డ్యాష్ బోర్డ్ ను ప్రారంభించిన శ్రీ గిరిరాజ్ సింగ్

ఎస్ డిజిలను సాధించడం సవాలుగా పరిగణించాలని, అట్టడుగు స్థాయిలో కేంద్రీకృత ,సంఘటిత పద్ధతిలో పనిచేయడం ప్రారంభించాలని పంచాయితీ రాజ్ సంస్థల 32 లక్షల మంది ఎన్నికైన ప్రతినిధులకు
శ్రీ గిరిరాజ్ సింగ్ ఉద్బోధ

ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఏ పనులతో ప్రణాళికాబద్ధంగా , సమన్వయంతో ప్రభావవంతమైన కలయిక ద్వారా చాలా సాధించవచ్చు- శ్రీ గిరిరాజ్ సింగ్

Posted On: 08 DEC 2021 12:19PM by PIB Hyderabad

"పంచాయితీ రాజ్ సంస్థ ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డి జి) స్థానికీకరణ" నివేదికను కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ 7-12-2021 విడుదల చేశారు.పంచాయితీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ కూడా హాజరయ్యారు.

 

 

 

సందర్భంగా, జిపిడిపి పురోగతిని పర్యవేక్షించడంపై గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక (జిపిడిపి) మానిటరింగ్ డ్యాష్ బోర్డ్ ను , పంచాయితీ రాజ్ సంస్థల ఎన్నికైన ప్రతినిధులు ,కార్యకర్తల సామర్థ్య పెంపు, శిక్షణపై శిక్షణ నిర్వహణ పోర్టల్ ను కేంద్ర గ్రామీణాభివృద్ధి ,పంచాయితీ రాజ్ మంత్రి ప్రారంభించారు. హ్యాండ్ బుక్ ఆన్ ట్రైనింగ్ మేనేజ్ మెంట్ పోర్టల్ ను కూడా విడుదల చేశారు.

 

 

  

 

ఎస్ డిజిల ను సాధించే దిశగా కార్యాచరణ ప్రణాళికగా పనిచేసే సమాచార నివేదికను తీసుకురావడంలో పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల

కమిటీ కృషిని శ్రీ గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారత దేశం కట్టుబడి

ఉందని ఆయన నొక్కి చెప్పారు. పంచాయతీరాజ్ సంస్థల 32 లక్షల మంది ఎన్నికైన ప్రతినిధులు ఎస్ డిజిలను సాధించడం ఒక సవాలుగా పరిగణించాలని, ఇందుకు అట్టడుగు స్థాయిలో దృష్టి సారించి  సంఘటిత పద్ధతిలో పనిచేయడం ప్రారంభించాలని ఆయన ఉద్బోధించారు. సర్వతోముఖాభివృద్ధి కోసం నాణ్యమైన తోటలు, అన్ని రకాల పోషకాహార లోపం, ఆరోగ్యం, విద్య, జీవన సౌలభ్యం, జీవనోపాధి అవకాశాలు మొదలైన సమస్యలను పరిష్కరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంచాయితీరాజ్ సంస్థలకు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని నివాసితులకు ఆరోగ్య , స్వస్థత కేంద్రాలు, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన పారిశుధ్య సేవలను అందించడం పై కూడా పంచాయితీలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు.

 

ఏకీకరణ లేదా కలయిక (కన్వర్జెన్స్ )అవసరాన్ని వివరిస్తూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎం జి ఎన్ ఆర్ జి ) పనులతో మంచి ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో ప్రభావవంతమైన కలయిక ద్వారా చాలా సాధించవచ్చని శ్రీ గిరిరాజ్ సింగ్ అన్నారు.

 

అట్టడుగు స్థాయి నుంచి శీఘ్ర మార్పు రావాలన్న ప్రధాన మంత్రి దార్శనికత కు ఆచరణ రూపం కల్పించేలా పంచాయితీ రాజ్ సంస్థల అన్ని స్థాయిల అధికారులు , నిర్వాహకులు భావోద్వేగం తోను, అంకిత భావంతోను పనిచేయాలని గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు.

 

కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయితీల్లోని పంచాయితీ లైబ్రరీల్లో -లెర్నింగ్ సదుపాయం , డిజిటల్ లైబ్రరీల ద్వారా వివిధ పోటీ పరీక్షల విద్యార్థులకు అందించే ప్రయోజనాల గురించి కేంద్ర పంచాయితీ రాజ్ మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అన్ని పంచాయితీల్లో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని ఎన్నికైన ప్రతినిధులు , నిర్వాహకులు తీర్మానించి నట్లయితే, అది కూడా వాస్తవం కాగలదని ,దీనికి కేవలం దృఢమైన సంకల్పం అవసరమని కేంద్ర పంచాయితీ రాజ్ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

 

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా ఒడంతురై గ్రామ పంచాయితీ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ- పంచాయతీ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినందుకు విస్తృతంగా ప్రసిద్ధిప్రశంసలు పొందిందని చెప్పారు. ఇతర గ్రామ పంచాయితీలు కూడా ఇదే విధంగా నిర్ణయించినట్లయితే, అవి ఇంధన ఉత్పత్తి లేదా ఇతర రంగాలలో స్వయం సమృద్ధి సాధించగలవని కేంద్ర పంచాయితీ రాజ్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

సంద ర్భంగా పంచాయితీ రాజ్ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ప్రసంగిస్తూ, పంచాయతీ స్థాయిలో జీవనోపాది అవకాశాల ను పెంపొందించడానికి, మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వ్యవస్థాపక చొరవలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. నివేదికను ప్రశంసించిన శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్, "పంచాయితీ రాజ్ సంస్థల ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజిలు) స్థానికీకరణ" పై నివేదిక సమాజంలోని చివరి వ్యక్తికి అభివృద్ధి ప్రయోజనాలను తీసుకెళ్లడానికి ఒక రోడ్ మ్యాప్ గా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి దార్శనికత ఆధారంగా, పంచాయితీలు ప్రధానమంత్రి దార్శనికత నుండి పొందిన స్ఫూర్తి, విశ్వాసంతో అభివృద్ధి పనులను చేపట్టాలనీ అన్నారుఉన్నత స్థాయి తెలివితేటలు ,,సరైన ప్రణాళిక మొత్తం పురోగతికి మార్గం సుగమం చేస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని అంతం చేస్తుందని కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు.

 

పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్ మాట్లాడుతూ, ‘’పంచాయితీ రాజ్ సంస్థల ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజిలు) స్థానికీకరణ" నివేదిక సమ్మిళిత వృద్ధి దిశగా ఒక దృఢమైన అడుగు’’ అని  అభివర్ణించారు నివేదిక రాబోయే సంవత్సరాల్లో మార్పును చూపిస్తుందని అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి, సంబంధిత విభాగాలు అన్నీకూడా సమిష్టి ప్రయత్నాలు చేయాలనీ, మొత్తం ప్రభుత్వ విధానం అవసరమైన విస్తృత సమస్యలు ,వ్యూహాలపై పనిచేయడం ప్రారంభించాలనీ అన్నారు. అట్టడుగు స్థాయిలో చురుకైన సమాజ భాగస్వామ్యం ద్వారా ఎస్ డిజిలను సాధించడం కోసం భాగస్వాములందరినీ వేదికపైకి తీసుకురావడంలో మొత్తం ప్రభుత్వ విధానం ఒక ఆవశ్యకమైన ,ముఖ్యమైన దోహదకారి గా ఉంటుందని అన్నారు. రోజు ఆవిష్కరించిన డ్యాష్ బోర్డులు సంబంధిత మంత్రిత్వ శాఖలు/ విభాగాలు , పంచాయితీ రాజ్ వాటాదారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని ఎంఒపిఆర్ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్ తెలిపారు.

 

"పంచాయితీ రాజ్ సంస్థల ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజిలు) స్థానికీకరణ" నివేదికపై తమిళనాడు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ జయశ్రీ రఘునందన్ సవివర ప్రజంటేషన్ ఇచ్చారు.. జిపిడిపి పురోగతిని పర్యవేక్షించడంపై జిపిడిపి మానిటరింగ్ డ్యాష్ బోర్డ్పంచాయితీ రాజ్ సంస్థల ఎన్నికైన ప్రతినిధులు నిర్వాహకుల సామర్థ్య పెంపు, శిక్షణ నిర్వహణ పోర్టల్ పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ రేఖ యాదవ్ ప్రజంటేషన్ ఇచ్చారు.

 

   

 

శ్రీ సునీల్ కుమార్, కార్యదర్శి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, శ్రీమతి. జయశ్రీ రఘునందన్, తమిళనాడు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, శ్రీ (డా.) చంద్ర శేఖర్ కుమార్, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, శ్రీ కే. ఎస్ . సేథి, శ్రీమతి రేఖా యాదవ్, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, ఇంకా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

విద్యా మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ ,వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మహిళా ,శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ, గణాంకాల మంత్రిత్వ శాఖ, కార్యక్రమ అమలు, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్పిన్యుర్ మంత్రిత్వ శాఖ సహామంత్రి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులురాష్ట్రాలు/యూటీల పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, ఎన్ అర్ డి అండ్ పి ఆర్, ఎస్ ఆర్ డి అండ్ పి ఆర్ అధికారులు, ఎఫ్ , ఎల్ , యు ఎన్ డి పి , యు ఎన్ ఎఫ్ పి , యు ఎన్ వుమెన్, యు ఎన్ పి, డబ్లు హెచ్ ఎన్ సి ఎఫ్

వంటి యు ఎన్ ఏజెన్సీల ప్రతినిధులు వర్చువల్ మోడ్ ద్వారా కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

 

నేపథ్యం:

 

భారతదేశం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్ డి జి) 2030పై సంతకం చేసింది. పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ (ఎన్ఓ పి ఆర్ ) రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్ జి ఎస్ ) పథకం ద్వారా ఎస్ డి జి  విజయాలకు కట్టుబడి ఉంది. ఆర్ జి ఎస్ పథకం గ్రామ పంచాయతీ స్థాయిలో భాగస్వామ్య స్థానిక ప్రణాళిక తో ఎస్ డి జి లను సాధించడం ద్వారా సుపరిపాలన కోసం ఎన్నికైన ప్రతినిధులను నిర్దేశిస్తుంది.

 

మే 2021లో, పంచాయితీ స్థాయిలో ఎస్ డి జి స్థానికీకరణపై మంత్రిత్వ శాఖకు విధాన మార్గదర్శకాలను అందించడానికి ఎం పి ఆర్ ద్వారా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి జయశ్రీ రఘునందన్, నిపుణుల బృందానికి నాయకత్వం వహించారు, ఎం పి ఆర్,, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలు ,స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయితీ రాజ్ (ఎస్ ఆర్ డి అండ్ పి ఆర్) నుండి సీనియర్ అధికారులు ఇతర సభ్యులు గా ఉన్నారు.

 

సమగ్ర చర్చల తరువాత నిపుణుల బృందం అక్టోబర్ 2021 లో ఒక వివరణాత్మక నివేదికను సమర్పించింది, గ్రామీణ భారతదేశంలోని పంచాయితీ రాజ్ సంస్థలు (పిఆర్ఐలు),  సంబంధిత భాగస్వాములందరినీ

భాగస్వాములను చేసి అట్టడుగు స్థాయిలో ఎస్ డిజిలను స్థానికీకరించడానికి తీసుకోవాల్సిన వ్యూహాలు చొరవలపై సిఫార్సులతో నివేదికను సమర్పించింది

 

****



(Release ID: 1779280) Visitor Counter : 362