ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వివిధ అంటువ్యాధుల నిర్వ‌హ‌ణ‌లో వైద్యుల‌కు, పారామెడిక‌ల్ సిబ్బందికి ప్ర‌త్యేక శిక్ష‌ణ

నాడు పోస్టు చేయడమైనది: 07 DEC 2021 3:46PM by PIB Hyderabad

కోవిడ్‌-19లో శిక్ష‌ణ‌, సామ‌ర్ధ్య నిర్మాణం కోసం కోసం ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకుంది. కోవిడ్ -19కి సంబంధించిన స‌హేతుక‌మైన అంశాల‌పై డాక్ట‌ర్ల‌కు, న‌ర్సుల‌కు, అనుబంధ ఆరోగ్య సంర‌క్ష‌ణ నిపుణులు, వాలంటీర్ల‌కు దృశ్య మాధ్య‌మం ద్వారా శిక్ష‌ణ స‌హా ప‌లు ర‌కాలుగా శిక్ష‌ణ‌ను అందించారు. వివిధ సిబ్బందికి శిక్ష‌ణ‌ను ఇచ్చేందుకు భార‌త ప్ర‌భుత్వం ఐజిఒటి (ఇంటిగ్రేటెడ్ గ‌వ‌ర్న‌మెంట్ ఆన్‌లైన్ ట్రైనింగ్‌) ప్లాట్‌ఫాంను ఉప‌యోగించింది. కోవిడ్‌-19 ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి దాదాపు 14 ల‌క్ష‌ల మంది ప్ర‌త్యేక యూజ‌ర్లు దేశం న‌లుమూలల నుంచి ఈ ప్లాట్‌ఫాంపై న‌మోదు చేసుకున్నారు. వివిధ కోర్సుల‌కు న‌మోదు చేసుకున్న‌వారి సంఖ్య 29.29 ల‌క్ష‌లుగా ఉంది. అద‌నంగా, 80 ల‌క్ష‌ల‌కు పైగా ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌కు కోవిడ్ సంబంధిత అంశాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాల ద్వారా శిక్ష‌ణ‌ను అందించారు. కోవిడ్ సంబంధ విష‌యాంశాల‌పై  ఆరోగ్య‌, కుటుంబ మంత్రిత్వ శాఖ స‌హా ఎయిమ్స్ (న్యూఢిల్లీ), నిమ్‌హాన్స్‌, పిజిఐఎంఇఆర్‌, జిప్‌మెర్ (జెఐపిఎంఇఆర్‌) త‌దిరత‌ర ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌లు వెబినార్లు, ట్యుటోరియ‌ళ్ళ‌ను అప్‌లోడ్ చేశాయి. వీటిని వీక్షించిన వారి సంఖ్య 2.23 కోట్లుగా న‌మోదైంది. 
జాతీయ వైద్య క‌మిష‌న్ (ఎన్ఎంసి) పేర్కొన్న‌ట్టుగా, ఆగ‌స్టు, 2020న ఎంబిబిఎస్ పాఠ్య‌ప్ర‌ణాళికలో కోవిడ్ వంటి మ‌హ‌మ్మారుల నిర్వ‌హ‌ణ‌పై అంశాల‌కు సంబంధించి యోగ్య‌త ఆధారిత మాడ్యూల్‌ను మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, గ‌త బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్ ప్ర‌వేశ‌పెట్టింది. 
రాజ్య‌స‌భ‌లో మంగ‌ళ‌వారం ఒక ప్ర‌శ్న‌కు లిఖితపూర్వ‌కంగా స‌మాధాన‌మిస్తూ కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ స‌హాయ‌మంత్రి డాక్ట‌ర్ భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ పేర్కొన్నారు. 

****
 


(రిలీజ్ ఐడి: 1778946) సందర్శకుల సూచీ సంఖ్య : : 149
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , Marathi , Manipuri , Bengali , Malayalam