ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశం-రశ్యా21వ వార్షిక శిఖర సమ్మేళనం

Posted On: 06 DEC 2021 10:28PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పాటు భారతదేశం-రశ్యా 21వ వార్షిక శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసమని రశ్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు మాన్య శ్రీ వ్లాదిమీర్ పుతిన్ 2021వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీ నాడు న్యూ ఢిల్లీ కి విచ్చేశారు.

2. అధ్యక్షుడు శ్రీ పుతిన్ వెంట ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గం వచ్చింది. ప్రధాన మంత్రి శ్రీ మోదీ కి, అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు మధ్య ద్వైపాక్షిక చర్చలు స్నేహపూర్ణ వాతావరణం లో జరిగాయి. కోవిడ్ మహమ్మారి సవాళ్ల ను రువ్వుతూ ఉన్నప్పటికీ కూడాను ఉభయ దేశాల మధ్య గల ప్రత్యేకమైనటువంటి మరియు విశేషాధికారాలు కలిగినటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం స్థిరమైన ప్రగతి ని నమోదు చేయడం పట్ల ఇద్దరు నేత లు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాల కు చెందిన రక్షణ శాఖ మరియు విదేశీ వ్యవహారాల శాఖ ల మంత్రులు తొలి సారి గా 2+2 సంభాషణ ను నిర్వహించడాన్ని, సైన్యం మరియు సైన్య సంబంధి సాంకేతిక సహకారం అంశాల పైన ఏర్పాటైన అంతర్-ప్రభుత్వ సంఘం 2021 డిసెంబర్ 6న న్యూ ఢిల్లీ లో సమావేశం కావడాన్ని వారు స్వాగతించారు.

3. మరింత ఎక్కువ గా ఆర్థిక సహకారం చోటు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని నేతలు స్పష్టం చేశారు. మరి ఈ సందర్భం లో, దీర్ఘకాలం పాటు మార్పుల కు పెద్ద గా తావు ఉండనటువంటి మరియు నిలకడతనం కలిగినటువంటి ఆర్థిక సహకార సంబంధి వృద్ధి కోసం కొత్త చోదక శక్తులు ఆవశ్యకమని వారు నొక్కి చెప్పారు. పరస్పర పెట్టుబడుల తాలూకు సాఫల్య గాథ ను వారు ప్రశంసించారు. ఉభయ పక్షాలు రెండు దేశాల లో మరిన్ని ఎక్కువ పెట్టుబడుల ను పెట్టాలని వారు ఎదురుచూస్తున్నారు. ఇంటర్ నేశనల్ నార్థ్ - సౌథ్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్ (ఐఎన్ఎస్ టిసి) మరియు ప్రతిపాదిత చెన్నై - వ్లాదివోస్తోక్ ఈస్టర్న్ మేరిటైమ్ కారిడార్ ల రూపం లో సంధానం యొక్క భూమిక సైతం చర్చల లో ప్రస్తావన కు వచ్చింది. రశ్యా లో వివిధ ప్రాంతాల మధ్య, మరీ ముఖ్యం గా రశ్యా లోని దూర ప్రాచ్య ప్రాంతాని కి, భారతదేశం లోని రాష్ట్రాల కు మధ్య అంతర్ ప్రాంతీయ సహకారం ఇతోధికం గా చోటు చేసుకోవాలని ఇద్దరు నేత లు ఆశించారు. కరోనా మహమ్మారి కి వ్యతిరేకం గా సాగుతున్న యుద్ధం లో ప్రస్తుతం ద్వైపాక్షిక సహకారం కొనసాగుతూ ఉండటాన్ని వారు ప్రశంసించారు. జరూరైన కీలక కాలాల్లో రెండు దేశాలు ఒకదాని కి మరొకటి మానవీయ సహాయాన్ని అందించుకోవడం బాగుందని వారు పేర్కొన్నారు.

4. మహమ్మారి అనంతర కాలంలో ప్రపంచవ్యాప్తం గా ఆర్థిక స్థితిగతులు కోలుకొంటూ ఉండటం సహా, ప్రాంతీయం గాను, అంతర్జాతీయం గాను చోటు చేసుకొన్న పరిణామాల ను గురించి, ఇంకా అఫ్ గానిస్తాన్ లో స్థితి ని గురించి నేత లు చర్చించారు. అఫ్ గానిస్తాన్ విషయం లో ఇరు దేశాలు ఉమ్మడి ఆందోళనల ను, దృష్టి కోణాల ను వ్యక్తం చేస్తున్నాయని వారు అంగీకరించారు. అఫ్ గానిస్తాన్ అంశం లో సహకారాని కి, సంప్రదింపుల కు ఎన్ఎస్ఎ స్థాయి లో ద్వైపాక్షిక మార్గసూచీ ని రూపొందించడం పట్ల వారు తమ ప్రశంస ను వ్యక్తం చేశారు. అనేక అంతర్జాతీయ అంశాల లో ఇరు పక్షాలదీ ఉమ్మడి స్థితే అని వారు గమనించారు. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సహా బహుపాక్షిక వేదికల లో సహకారాన్ని మరింత ఎక్కువ గా బలపరచుకోవలసి ఉందంటూ సమ్మతి ని వ్యక్తం చేశారు. భారతదేశం ప్రస్తుతం ఐక్య రాజ్య సమితి భద్రత మండలి లో శాశ్వతేతర సభ్యత్వాన్ని వహిస్తుండటం పట్ల మరియు బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) కు 2021వ సంవత్సరం లో అధ్యక్ష పదవి ని నిర్వహించడం లో సఫలం కావడం పట్ల ప్రెసిడెంటు శ్రీ పుతిన్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందన లు తెలిపారు. రశ్యా ప్రస్తుతం ఆర్క్ టిక్ కౌన్సిల్ కు అధ్యక్షత వహిస్తున్నందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర్ మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

5. ఇండియా-రశ్యా: పార్ట్ నర్ శిప్ ఫార్ పీస్, ప్రోగ్రెస్ ఎండ్ ప్రాస్ పెరిటి’ పేరు తో జారీ చేసిన సంయుక్త ప్రకటన ద్వైపాక్షిక సంబంధాల తాలుకు స్థితి ని, భావి అవకాశాల ను సముచిత రీతి లో వెల్లడిస్తున్నది. ఈ సందర్శన కాలం లోనే, వ్యాపారం, శక్తి, సైన్స్ & టెక్నాలజీ, మేధోసంపత్తి, అంతరిక్షం, భూ సంబంధి అన్వేషణ, సంస్కృతి సంబంధి ఆదాన ప్రదానం, విద్య తదితర వివిధ రంగాల లో రెండు దేశాల వాణిజ్య సంస్థల కు, ఇంకా ఇతర సంస్థల కు మధ్య, అలాగే ప్రభుత్వాని కి, ప్రభుత్వాని కి మధ్య ఒప్పంద పత్రాల పై, ఎమ్ఒయు ల పై సంతకాలు అయ్యాయి. మన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఉన్నటువంటి బహుముఖీన స్వభావాన్ని ఇది ప్రతిబింబిస్తున్నది.

6. 2022 వ సంవత్సరం లో జరుగనున్న 22వ ఇండియా-రశ్యా ఏన్యువల్ సమిట్ లో పాల్గొనడానికి గాను రశ్యా ను సందర్శించవలసిందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అధ్యక్షుడు శ్రీ పుతిన్ ఆహ్వానం పలికారు.

 

***


(Release ID: 1778943) Visitor Counter : 216