సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ముగింపు సమావేశంలో ప్రముఖ గీత రచయిత ప్రసూన్ జోషికి ‘ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రదానం
“ఏక్ ఆస్మాన్ కమ్ పడ్తా హై, ఔర్ ఆస్మాన్ మంగ్వా దో…” (ఒక ఆకాశం చాలదు, మరిన్ని కావాలి …”) ఇవి 52 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఫిల్మ్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ అవార్డు స్వీకరించిన అనంతరం ప్రముఖ గీత రచయిత సృజనాత్మక రచయిత ప్రసూన్ జోషి అన్న మాటలు. సినీ రంగానికి జోషి అందించిన సేవలకు గుర్తింపుగా 52 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఆయనకు ఫిల్మ్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ అవార్డును అందించి గౌరవించింది.
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డును అందించారు.
సినిమా, సంస్కృతి కళా రంగాలకు లభించేలా చేసిన కృషికి గుర్తింపుగా శ్రీ జోషిని ఈ అవార్డు వరించింది.
అవార్డును స్వీకరించిన అనంతరం మాట్లాడిన శ్రీ జోషి భారతదేశం గొప్ప వైవిధ్యం కలిగిన దేశమని అన్నారు. అన్ని వర్గాలకు తమ వైవిధ్యభరితమైన కథలను చెప్పడానికి సరైన వేదిక లేనప్పుడు సినిమాలలో కూడా వైవిధ్యం ఉండదని అన్నారు. ఇటువంటి వేదికను 75 క్రియేటివ్ మైండ్స్ కార్యక్రమం ద్వారా అందుబాటులోకి తెచ్చిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ నిర్వాహకులను ఆయన అభినందించారు.
పద్మశ్రీ అవార్డుతో పాటు అనేక జాతీయ అవార్డులను పొంది అనేక చిత్రాలకు పాటలు అందించి, అందరిని ఆకట్టుకునే విధంగా టీవీ ప్రకటనలు రూపొందించి, సమాజ దృక్పధంతో అనేక కథలను రాసిన జోషి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. తనదైన శైలిలో ప్రసంగించిన శ్రీ జోషి గందరగోళ స్థితి కూడా మంచిదేనని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని వర్ధమాన సినీ నిర్మాతలు ప్రయోజనం పొందాలని సూచించారు. '
. “ గందరగోళ స్థితిని ఆస్వాదించడానికి యువ మనస్సులు ప్రయత్నించాలి. అసౌకర్యానికి గురి చేసే గందరగోళం అత్యంత సారవంతమైన స్థితి. దీనిలో నుంచి అద్భుతమైన ఆలోచనలు వస్తాయి' అని ఆయన అన్నారు.
సినీ రంగంలో దగ్గర దారులు ఉండవని ప్రతి ఒక్కరు గుర్తించాలని శ్రీ జోషి అన్నారు. కష్టపడి పని చేసి సృజనాత్మక ఆలోచలతో మాత్రమే ఈ రంగంలో విజయం సాధించడానికి సాధ్యమవుతుందని అన్నారు. దీనిని గుర్తించి ఔత్సాహిక చిత్ర నిర్మాతలు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు.
గత అనుభవాలను గుర్తు చేసుకున్న శ్రీ జోషి తనకు లభించిన అవార్డును ఉత్తరాఖండ్‌లోని తన స్వగ్రామానికి అంకితం చేశారు. ' నేను అల్మోరా అనే చిన్న పట్టణం నుంచి వచ్చాను. ఒక చిన్న పట్టణానికి చెందిన వ్యక్తి సినిమా రంగంలో గుర్తింపు సాధించడం చాలా కష్టం. నాకు స్ఫూర్తి ఇచ్చిన ఉత్తరాఖండ్ పర్వతాలకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను.' అని ఆయన అన్నారు.
రాజ్‌కుమార్ సంతోషి సినిమా లజ్జాతో పాటల రచయితగా ప్రసూన్ జోషి 2001లో భారతీయ చలన చిత్రం లోకి ప్రవేశించారు. తారే జమీన్ పర్, రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్, నీర్జా మరియు మణికర్ణిక, ఢిల్లీ 6 లాంటి అనేక చిత్రాలకు ఆయన పనిచేశారు.
అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్‌గా ఆయన అంతర్జాతీయ గుర్తింపు పొందారు. అతిపెద్ద అడ్వర్టైజింగ్ కంపెనీలలో ఒకటైన మెక్‌కాన్ వరల్డ్‌గ్రూప్‌కి ఆసియా-పసిఫిక్ ఛైర్మన్‌గా ఉన్నారు. కేన్స్‌లో గోల్డెన్ లయన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డుతో సహా అనేక అంతర్జాతీయ అవార్డులను కూడా గెలుచుకున్నాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్‌పర్సన్ గా ఆయన వ్యవహరిస్తున్నారు. .
***
(Release ID: 1776262)
Visitor Counter : 189