ప్రధాన మంత్రి కార్యాలయం

2021 నవంబర్ 28 వ తేదీనాటి  ‘ మన్  కీ  బాత్ ’  (‘ మనసు లో మాట ’)  కార్యక్రమం  83 వ భాగం లో  ప్రధాన మంత్రి  ప్రసంగం పాఠం

Posted On: 28 NOV 2021 11:33AM by PIB Hyderabad

 

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. ఈ రోజు న మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కోసం మనం మరోసారి కలిశాం. రెండు రోజుల లో డిసెంబర్ కూడా మొదలవనుంది. డిసెంబర్ రావడంతోనే ఏడాది కాలం డచిపోయినట్లుగా అనిపిస్తుంది. సంవత్సరం లో అది చివరి నెల కావడం వల్ల కొత్త సంవత్సరాని కి పునాదుల ను వేసుకొంటాం. అదే నెల లో, దేశం నౌకా దళ దినోత్సవాన్ని, అలాగే సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని కూడా జరుపుకొంటుంది. ఏటా డిసెంబర్ 16వ తేదీ న దేశం 1971 యుద్ధం స్వర్ణోత్సవాన్ని కూడా జరుపుకొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భాల లో నేను దేశం లోని భద్రత దళాల ను గుర్తు కు తెచ్చుకొంటాను. మన వీరుల ను స్మరించుకొంటాను. అటువంటి వీరుల కు జన్మ ను ఇచ్చిన ధైర్యవంతులైన మాతృమూర్తుల ను గుర్తుకు తెచ్చుకుంటాను. ఎప్పటిలాగే ఈ సారి కూడా NamoApp (నమోఏప్) లోను, MyGov (మైగవ్) లోను మీ అందరి వద్ద నుంచి నాకు చాలా సూచన లు అందాయి. మీరు నన్ను మీ కుటుంబం లో ఒక భాగం గా భావించి మీ జీవితం లోని సంతోషాల ను, బాధల ను పంచుకొన్నారు. ఇందులో చాలా మంది యువకులు ఉన్నారు, విద్యార్థులు కూడా ఉన్నారు. మన మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం పరివారం నిరంతరం వృద్ధి చెందుతూ ఉండడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ కార్యక్రమం మనసుల తో అనుసంధానం అవుతోంది. లక్ష్యాల తో అనుసంధానం అవుతోంది. మన మధ్య గాఢమైన సంబంధం తో మనలో సానుకూల దృక్పథం నిరంతరం గా ప్రవహిస్తోంది.

 

ప్రియమైన నా దేశవాసులారా, అమృత మహోత్సవానికి సంబంధించిన చర్చ లు తనకు బాగా నచ్చాయని సీతాపుర్‌ నుంచి ఓజస్వీ గారు నాకు రాశారు. ఆయన తన స్నేహితులతో కలసి మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం వింటారు. స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి చాలా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. సహచరులారా, నేర్చుకోవడంతో పాటు, దేశం కోసం ఏదైనా చేయాలనే ప్రేరణ ను అమృత మహోత్సవం ప్రసాదిస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తం గా సామాన్య ప్రజలు అయినా, ప్రభుత్వాలు అయినా, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అమృత్ మహోత్సవ్ తాలూకు ప్రతిధ్వని వినవస్తున్నది. ఈ మహోత్సవం తో జతపడ్డ కార్యక్రమాల పరంపర కొనసాగుతున్నది. ఈ మధ్య దిల్లీ లో అటువంటి ఆసక్తికరమైన కార్యక్రమమే ఒకటి జరిగింది. ఆజాదీ కీ కహానీ, బచ్చోంకీ జుబానీ’ ( ఈ మాటల కు స్వాతంత్ర్యం యొక్క కథ లు- బాలల ప్రసంగాలుఅని భావం ) కార్యక్రమం లో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన కథల ను గురించి బాలలు ఉత్సాహం తో ప్రస్తావించారు. విశేషం ఏమిటి అంటే ఇందులో భారతదేశం తో పాటు నేపాల్, మౌరిశస్, తంజానియా, న్యూజీలాండ్, ఫిజీ ల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అమృత్ మహోత్సవ్ ను మన దేశాని కి చెందిన మహారత్న సంస్థ ఒఎన్ జిసి విభిన్నం గా జరుపుతున్నది. ఈ మహోత్సవం రోజుల లో విద్యార్థుల కోసం చమురు క్షేత్రాల లో అధ్యయన యాత్రల ను ఒఎన్ జిసి నిర్వహిస్తున్నది. ఈ అధ్యయనాల లో ఒఎన్ జిసి చమురు క్షేత్ర కార్యకలాపాల గురించి యువత కు తెలియజేయడం జరుగుతున్నది. మన వర్ధమాన ఇంజీనియర్ లు దేశ నిర్మాణ ప్రయత్నాల లో పూర్తి ఉత్సాహం తోను, అభిరుచి తోను చేతులు కలపాలన్నదే దీని ఉద్దేశ్యం గా ఉంది.

 

సహచరులారా, స్వాతంత్య్ర సాధన లో జనజాతీయ సముదాయం అందించిన తోడ్పాటు ను దృష్టి లో పెట్టుకొని దేశం కూడా జనజాతీయ గౌరవ సప్తాహాన్ని సైతం జరుపుకొంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలు దేశం లోని వివిధ ప్రాంతాల లో జరిగాయి. అండమాన్- నికోబార్ దీవులలో జారవా, ఇంకా ఓంగే ల వంటి జనజాతీయ సముదాయాల ప్రజలు వారి సంస్కృతి ని హుషారైన విధం గా కళ్ల కు కట్టారు. హిమాచల్ ప్రదేశ్‌ లోని ఊనా కు చెందిన సూక్ష్మ లేఖకులు రామ్ కుమార్ జోశీ గారు అద్భుతమైన కార్యాన్ని చేశారు. ఆయన తపాలా బిళ్ల పైనేతాజీ సుభాష్ చంద్ర బోస్, ఇంకా పూర్వ ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి గారులకు చెందిన అరుదైన రూపచిత్రణల ను రూపొందించారు. ఆ తపాలా బిళ్ల ఎంత చిన్నది గా ఉందో.. ! ఆయన హిందీ లో రాసిన 'రామ్' అనే పదం పై రేఖాచిత్రాల ను రూపొందించారు. అందులో ఇద్దరు మహనీయుల జీవిత చరిత్ర ను కూడా క్లుప్తం గా రూపకల్పన చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని కట్ నీ కి చెందిన కొంతమంది సహచరులు కూడా ఒక చిరస్మరణీయమైన దాస్తాన్ గోయి కార్యక్రమం గురించి సమాచారాన్ని అందించారు. అందులో రాణి దుర్గావతి యొక్క అజేయ సాహసం, బలిదానం తాలూకు జ్ఞాపకాల ను గుర్తు కు తీసుకురావడం జరిగింది. అటువంటి ఒక కార్యక్రమం కాశీ లో జరిగింది. గోస్వామి తులసీదాస్, సంత్ కబీర్, సంత్ రైదాస్, భారతేందు హరిశ్చంద్ర, ముంశీ ప్రేమ్‌చంద్, ఇంకా జయశంకర్ ప్రసాద్ ల వంటి మహానుభావుల గౌరవార్థం మూడు రోజుల మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. వీరందరు, వేరు వేరు కాలఖండాల లో, దేశం లో జన జాగృతి లో చాలా పెద్ద పాత్ర ను పోషించారు. మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఇంతకు పూర్వపు భాగాల లో నేను మూడు పోటీల ను గురించి ప్రస్తావించిన విషయం మీకు గుర్తు ఉండే ఉంటుంది.. అవి ఏవేవంటే దేశభక్తి గీతాల ను రాయడం, దేశభక్తి కి సంబంధించిన సంఘటన ల, స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన సంఘటన ల తాలూకు రంగవల్లికల ను రూపుదిద్దడం, పిల్లల మనస్సుల లో భవ్య భారతదేశం స్వప్నాన్ని ఆవిష్కరించేందుకు గాను చిట్టిపాట లను రాయడం అనేవే. ఈ పోటీ ల కోసం మీరు తప్పక మీ మీ ఎంట్రీల ను పంపారనే నేను ఆశిస్తున్నాను. మీరు మీ సహచరుల తో కూడా ప్రణాళిక ను వేసుకొని, చర్చించి ఉండి ఉంటారు. మీరు నిశ్చితం గా ఈ కార్యక్రమాన్ని భారతదేశం లోని ప్రతి మూల కు ఎంతో ఉత్సాహం తో ముందుకు తీసుకుపోతారు అని నేను భావిస్తున్నాను.

 

ప్రియమైన నా దేశవాసులారా, ఈ చర్చ నుంచి నేను ఇప్పుడు మిమ్మల్ని నేరుగా వృందావనాని కి తీసుకుపోతాను. వృందావనాన్ని భగవంతుని ప్రేమ కు ప్రత్యక్ష స్వరూపం గా చెప్తారు. మన యోగులు కూడా ఇలా అన్నారు ..

యహ్ ఆసా ధరి చిత్త్ మే, యహ్ ఆసా ధరి చిత్త్ మే

కహత్ జథా మతి మోర

వృందావన్ సుఖ్ రంగ్ కౌ, వృందావన్ సుఖ్ రంగ్ కౌ

కాహు న పాయౌ ఔర్’ ..

అంటే ఏమిటి అంటే, వృందావనం మహిమ ను గురించి మనం అందరం మన శక్తి కి తగ్గట్టుగా తప్పక చెబుతాం. కానీ వృందావనం తాలూకు ఆనందం ఏదైతే ఉందో, ఆ ప్రదేశం అందించేటటువంటి అనుభూతి ఏదైతే ఉందో, దాని తుది ని ఎవరూ కనుగొనజాలరు. అది అపరిమితం గా ఉంటుంది. అందుకే కదా వృందావనం ప్రపంచం నలుమూలల ప్రజల ను దాని వైపునకు ఆకర్షిస్తూ ఉంది. దాని ముద్ర మీకు ప్రపంచం లోని ప్రతి మూల లోనూ కనుపిస్తుంది.

 

పశ్చిమ ఆస్ట్రేలియా లోని ఒక నగరం పేరు పర్థ్. క్రికెట్ ప్రేమికుల కు ఈ ప్రపంచాన్ని గురించిన పరిచయం బాగానే ఉంటుంది. ఎందుకంటే పర్థ్ లో క్రికెట్ మ్యాచ్‌ లు తరచు గా జరుగుతాయి. పర్థ్ లో సేక్రిడ్ ఇండియా గైలరి' పేరు తో కళా ప్రదర్శన శాల కూడా ఉంది. ఈ గైలరి ని స్వాన్ వేలీ లోని ఒక అందమైన ప్రాంతం లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆస్ట్రేలియా నివాసి జగత్ తారిణి దాసి గారి ప్రయాస ల ఫలితం గా ఇది ఏర్పాటైంది. జగత్ తారిణి గారు ఆస్ట్రేలియా కు చెందిన వారు. ఆమె అక్కడే పుట్టారు. అక్కడే పెరిగారు. అయితే ఆమె వృందావనాని కి వచ్చిన తరువాత 13 సంవత్సరాలకు పైగా కాలాన్ని ఇక్కడే గడిపారు. తాను ఆస్ట్రేలియా కు తిరిగి వెళ్ళినా, తిరిగి తన దేశాని కి వెళ్ళినా వృందావనాన్ని మరచిపోలేనని చెప్పారు. అందువల్ల బృందావనం తో, దాని ఆధ్యాత్మిక స్ఫూర్తి తో అనుసంధానం అయ్యేందుకు ఆమె ఆస్ట్రేలియా లోనే బృందావనాన్ని ఏర్పాటు చేశారు. తన కళ ను మాధ్యమం గా చేసుకొని అద్భుతమైన వృందావనాన్ని దిద్దితీర్చారు. అక్కడకు విచ్చేసే వారికి అనేక రకాల కళాకృతుల ను చూసే అవకాశం లభిస్తుంది. వారు భారతదేశం లోని అత్యంత ప్రసిద్ధ తీర్థయాత్ర కేంద్రాలు- వృందావనం, నవద్వీప్, జగన్నాథ పురీ ల సంప్రదాయం, సంస్కృతి ల సంగ్రహావలోకనం పొందవచ్చును. శ్రీ కృష్ణుని జీవితాని కి సంబంధించిన అనేక కళాఖండాల ను కూడా అక్కడ ప్రదర్శిస్తారు. భగవాన్ కృష్ణుడు గోవర్ధన గిరి ని తన చిటికెన వేలి తో ఎత్తిన ఒక కళాఖండం కూడా ఉంది. బృందావన ప్రజలు గోవర్ధన గిరి కింద ఆశ్రయాన్ని పొందారు. జగత్ తారిణి గారి ఈ అద్భుతమైన ప్రయత్నం కృష్ణ భక్తి లోని శక్తి ని దర్శింపచేస్తుంది. ఈ ప్రయత్నాని కి గాను వారందరికీ చాలా చాలా శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.

 

ప్రియమైన నా దేశవాసులారా, నేను ఆస్ట్రేలియా లోని పర్థ్ లో గల వృందావనాన్ని గురించి మాట్లాడుతున్నాను. మన బుందేల్‌ ఖండ్‌ కు చెందిన ఝాంసీ కి కూడా ఆస్ట్రేలియా తో సంబంధం ఉందనేది ఆసక్తికరమైన చరిత్ర. నిజానికి ఝాంసీ కి చెందిన రాణి లక్ష్మీబాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి వ్యతిరేకం గా చట్టం మాధ్యమం ద్వారా పోరాటాన్ని చేస్తూ ఉన్న కాలం లో ఆమె వకీలు గా జాన్ లాంగ్ వ్యవహరించారు. జాన్ లైంగ్ మూలత: ఆస్ట్రేలియా వాసి. భారతదేశం లో ఉండి ఆయన రాణి లక్ష్మీబాయి విషయం లో పోరాడారు. మన స్వాతంత్ర్య పోరాటం లో ఝాంసీ, బుందేల్‌ ఖండ్‌ ల తోడ్పాటు ను గురించి మనకు అందరికీ తెలుసును. రాణి లక్ష్మీబాయి, ఝల్ కారీ బాయి ల వంటి వీర నారీమణులు అక్కడి వారే. మేజర్ ధ్యాన్ చంద్ వంటి ఖేల్ రత్న ను కూడా దేశాని కి అందించింది ఈ ప్రాంతమే.

 

సహచరులారా, శౌర్యాన్ని యుద్ధరంగం లో మాత్రమే ప్రదర్శించవలసిన అవసరం లేదు. శౌర్యం వ్రతం గా మారినప్పుడు అది విస్తరిస్తుంది. అప్పుడు ప్రతి రంగం లో అనేక కార్యాల సాధన కు ప్రారంభం పలుకుతుంది. అటువంటి పరాక్రమాన్ని గురించి శ్రీమతి జ్యోత్స్న గారు నాకు లేఖ రాశారు. జాలౌన్‌ లో ఒక నది ఉండేది - దాని పేరు నూన్ నది. అక్కడి రైతుల కు అది ప్రధాన నీటి వనరు గా ఉండేది. కానీ క్రమం గా నూన్ నది అంతరించిపోయే దశ కు చేరుకొంది. ఆ నది కి మిగిలి ఉన్న కొద్దిపాటి అస్తిత్వం గా అది కాలువ గా మారిపోయింది. దీని కారణం గా రైతుల కు సాగునీటి కి కూడా ఇక్కట్లు ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఈ స్థితి ని మార్చేందుకు జాలౌన్ ప్రజలు చొరవ తీసుకొన్నారు. వారు ఈ ఏడాది మార్చి నెల లో కమిటీ ని ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమం లో వేల కొద్దీ గ్రామీణులు, స్థానికులు స్వచ్ఛందం గా పాల్గొన్నారు. అక్కడి పంచాయతీ లు గ్రామస్తుల సహకారం తో పనులను మొదలుపెట్టాయి. ఇవాళ అతి తక్కువ కాలం లో, అతి తక్కువ ఖర్చు తో నది కి జీవం పోయడం జరిగింది. దీని వల్ల ఎంతో మంది రైతుల కు లబ్ది కలుగుతున్నది. యుద్ధభూమి లో కాకుండా ఇతర క్షేత్రాల లో ధైర్య సాహసాల కు ఇది ఒక ఉదాహరణ గా నిలచింది. ఇది మన దేశవాసుల సంకల్ప శక్తి ని చాటుతున్నది. మనం దృఢ చిత్తులం అయ్యామా అంటే గనక ఏదీ అసాధ్యం కాదు. మరి అందుకే నేనంటాను సబ్ కా ప్రయాస్ (అందరి ప్రయత్నం) అని.

 

ప్రియమైన నా దేశ వాసులారా, మనం ప్రకృతి ని సంరక్షించినప్పుడు, ప్రకృతి కూడా మనకు రక్షణ ను, భద్రత ను ఇస్తుంది. మనం వ్యక్తిగత జీవితం లో కూడా దీనిని గురించి తెలుసుకోవచ్చును. అటువంటి ఒక ఉదాహరణ ను తమిళ నాడు ప్రజలు అందించారు. ఈ ఉదాహరణ తమిళ నాడు లోని తూత్తుక్కుడి జిల్లా కు సంబంధించింది. తీర ప్రాంతాల లో కొన్ని సర్లు భూమి మునిగిపోయే ప్రమాదం ఉందని మనకు తెలుసు. తూత్తుక్కుడి లో చిన్న చిన్న ద్వీపాలు చాలానే ఉన్నాయి. అవి సముద్రం లో మునిగిపోయే ప్రమాదం పెరుగుతోంది. అక్కడి ప్రజలు, నిపుణులు ప్రకృతి ద్వారానే ఈ ప్రకృతి వైపరీత్యాన్ని రక్షించగలిగారు. ఈ ప్రజలు ఇప్పుడు ఆ దీవుల లో తాటి చెట్లను నాటుతున్నారు. ఈ చెట్లు తుఫానుల లో సైతం భూమి కి రక్షణ ను ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఒక కొత్త భరోసా మేలుకొన్నది.

 

సహచరులారా, మనం ప్రకృతి సమతుల్యత ను భంగపరిచినప్పుడు గాని, లేదా దాని స్వచ్ఛత ను నాశనం చేసినప్పుడు గాని మాత్రమే ప్రకృతి మనలకు ముప్పు ను కలిగిస్తుంది. ప్రకృతి కూడా మనలను తల్లి లా ఆదరిస్తుంది. మన ప్రపంచాన్ని కొత్త రంగుల తో నింపుతుంది.

 

ప్రస్తుతం నేను సోశల్ మీడియా లో చూస్తున్నాను- మేఘాలయ లో ఎగురుతున్న పడవ ఫోటో చాలా వైరల్ అవుతోంది. ఈ చిత్రం తొలిచూపు లోనే మనను ఆకర్షిస్తుంది. మీలో చాలా మంది దీనిని ఆన్‌ లైన్‌ లో చూసి ఉంటారు. గాలి లో తేలుతున్న ఈ పడవ ను నిశితం గా పరిశీలిస్తే అది నది నీటి లో కదులుతున్నట్లు తెలుస్తుంది. నది నీరు ఎంత శుభ్రం గా ఉంది అంటే నది కింది ప్రాంతం పారదర్శకం గా కనిపిస్తుంది. పడవ గాలి లో తేలుతున్నట్టు గోచరిస్తుంది. మన దేశం లో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ప్రజలు వారి సహజ వారసత్వాన్ని సంరక్షించిన అనేక ప్రాంతాలు ఉన్నాయి. ప్రకృతి తో మమేకం అయ్యి కాలం గడిపే జీవన శైలి ని ఈ ప్రజలు నేటికీ సజీవం గా ఉంచారు. ఇది మనందరికీ కూడా స్ఫూర్తి గా నిలుస్తుంది. మన చుట్టూ ఉన్న సహజ వనరుల ను కాపాడి, వాటి అసలు రూపాని కి తీసుకురావాలి. ఇందులోనే మనందరి క్షేమం ఉంది. ప్రజా ప్రయోజనం ఉంది.

 

ప్రియమైన నా దేశవాసులారా, ప్రభుత్వం ప్రణాళికల ను రూపొందించినప్పుడు, బడ్జెటు ను ఖర్చు చేసినప్పుడు, ప్రాజెక్టుల ను సకాలం లో పూర్తి చేసినప్పుడు అది పని చేస్తున్నట్లు ప్రజలు భావిస్తారు. కానీ ప్రభుత్వం రూపొందించే అనేక అభివృద్ధి పథకాలలో మానవీయ సంవేదనలతో ముడిపడ్డ విషయాలు ఎల్లప్పుడూ భిన్నమైన ఆనందాన్ని ఇస్తాయి. ప్రభుత్వం కృషి తో, ప్రభుత్వ పథకాల తో ఏ జీవితం ఎలా మారిపోయిందో, ఆ మారిన జీవితాల అనుభవాలు ఏమేమిటో అనేది విన్నప్పుడు మనలో కూడా సంవేదన లు నిండిపోతాయి. మనసు కు సంతృప్తి ని ఇవ్వడంతో పాటు ఆ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు ప్రేరణ ను కూడా ఇస్తాయి. ఒక రకం గా చెప్పాలి అంటే ఇది కేవలం స్వీయ ఆనందం మాత్రమే. అందుకే ఈ రోజు న మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో తమ మానసిక శక్తి తో కొత్త జీవితాన్ని గెలిచిన అలాంటి ఇద్దరు మిత్రులు మనతో కలుస్తున్నారు. వారు ఆయుష్మాన్ భారత్ పథకం సహాయం తో వారి చికిత్స ను పూర్తి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. వారిలో మన ఒకటో సహచరుడు రాజేశ్ కుమార్ ప్రజాపతి. ఆయన కు గుండె కు సంబంధించిన సమస్య ఉండింది.

 

సరే రండి, రాజేశ్ గారితో మాట్లాడుదాం -

ప్రధాన మంత్రి: రాజేశ్ గారూ.. నమస్తే.

రాజేశ్ ప్రజాపతి: నమస్తే సర్.. నమస్తే.

ప్రధాన మంత్రి: రాజేశ్ గారూ.. మీకు వచ్చిన వ్యాధి ఏమిటి? మరి ఎవరైనా డాక్టర్ దగ్గరకు వెళ్లి ఉంటారు. కాస్త నాకు చెప్పండి. స్థానిక వైద్యుడు తప్పనిసరిగా చెప్పిన తర్వాత మీరు వేరే వైద్యుడి వద్ద కు వెళ్లి ఉండాలి. అప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నారో, లేదో ? ఏమేం జరిగిందంటారు?

రాజేశ్ ప్రజాపతి: నా గుండె లో ఒక సమస్య వచ్చింది సర్. నా ఛాతీ లో మంట గా అనిపించింది సర్. అప్పుడు డాక్టరు కు చూపించాను. ఆసిడిటీ ఉండవచ్చని డాక్టర్ అన్నారు సర్. అందుకే చాలా రోజులు ఆసిడిటీ కి మందులు వాడాను. లాభం లేకపోవడంతో అప్పుడు నేను డాక్టర్‌ కపూర్ గారికి చూపించాను. నీకు ఉన్న లక్షణాలు ఏంజియోగ్రఫి ద్వారా తెలుస్తాయిఅని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు ఆయన నన్ను శ్రీరామ్ మూర్తి గారి కి రిఫర్ చేశారు. అప్పుడు మేం అమరేశ్ అగ్రవాల్ గారి ని కలిశాం. ఆయన నా ఏంజియోగ్రఫి చేశారు. అప్పుడు ఆయన చెప్పారు. ఇది మీ సిర బ్లాక్ కావడం వల్ల జరిగిందిఅని. ఎంత ఖర్చవుతుంది అని మేం అడిగాం. దాంతో ఆయుష్మాన్ కార్డు ఉంటుందని, దానిని ప్రధాన మంత్రి గారు తయారు చేసి ఇచ్చారని ఆయన తెలిపారు. ఆ కార్డు మా దగ్గర ఉందని మేం అన్నాం. దాంతో ఆయన నా కార్డు ను తీసుకొన్నారు. నాకు చికిత్స మొత్తం ఆ కార్డు తోనే జరిగింది సర్. మీరు ఆ కార్డు ను చాలా మంచి పద్ధతి లో తయారు చేశారు. అది పేద ప్రజల కు చాలా సౌకర్యం గా ఉంది. మీకు నేను ఏ విధం గా కృతజ్ఞతలను చెప్పగలను!

ప్రధాన మంత్రి గారు: రాజేశ్ గారూ.. మీరేం చేస్తారు?

రాజేశ్ ప్రజాపతి: సర్.. ఇప్పుడు నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను సర్.

 

ప్రధాన మంత్రి గారు: మీ వయసెంత ?

 

రాజేశ్ ప్రజాపతి: నా వయసు నలభై తొమ్మిదేళ్లు సర్.

 

ప్రధాన మంత్రి గారు: ఇంత చిన్న వయసులోనే మీకు గుండె జబ్బు వచ్చింది.

 

రాజేశ్ ప్రజాపతి - అవును సర్..

 

ప్రధాన మంత్రి గారు : ఇంతకు ముందు మీ కుటుంబంలో మీ అమ్మకు గానీ నాన్న కు గాని, మరి ఇంకా ఎవరికైనా గాని ఇలా ఉందా? లేక మీకే వచ్చిందా?

 

రాజేశ్ ప్రజాపతి: లేదు సర్, ఎవరూ లేరు సర్. ఇది నాకే వచ్చింది.

 

ప్రధాన మంత్రి గారు : ఈ ఆయుష్మాన్ కార్డు ను భారత ప్రభుత్వం ఇస్తుంది. ఈ కార్డు పేదల కోసం ఒక పెద్ద పథకం. దీని గురించి మీకు ఎలాగ తెలిసింది?

 

రాజేశ్ ప్రజాపతి: సర్. ఇది ఎంత పెద్ద పథకం అంటే పేద వ్యక్తి కి దీని ద్వారా ప్రయోజనం దొరుకుతున్నది. ఇంకా ఎంత సంతోషం గా ఉందంటే సర్. మేమయితే ఆసుపత్రి లో గమనించాం కదా ఈ కార్డు ద్వారా ఎంత మంది కి ప్రయోజనం కలుగుతోందో. ఎప్పుడయితే డాక్టరు తో కార్డు నా దగ్గర ఉంది అని అంటామో అప్పుడు డాక్టర్ చెబుతారు మంచిది, ఆ కార్డు ను తీసుకు రండి.. నేను అదే కార్డు తో మీకు చికిత్స ను అందిస్తాను’’ అని.

 

ప్రధాన మంత్రి గారు: బాగుంది, కార్డు గనక లేకపోతే మీకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పారా డాక్టర్ గారు

 

రాజేశ్ ప్రజాపతి: కార్డు లేకపోతే చాలా ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పారు సర్. సర్ నా దగ్గర కార్డ్ ఉందిఅని చెప్పాను. ఆ కార్డు వెంటనే చూపించమన్నారు డాక్టర్. ఆ కార్డు చూపిస్తే అదే కార్డ్ తో మొత్తం చికిత్స అంతా జరిగింది. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు, మందులు కూడా ఆ కార్డు ద్వారానే వచ్చాయి.

 

ప్రధాన మంత్రి గారు: మరి రాజేశ్ గారూ.. మీకు ఇప్పుడు సంతోషం గా ఉంది. ఆరోగ్యం బాగుంది కదూ.

 

రాజేశ్ ప్రజాపతి: అవునండి సర్! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ వయస్సు కూడా ఎంత దీర్ఘంగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ అధికారం లోనే మీరు ఉండాలి. ఇంకా మా కుటుంబంలోని సభ్యులు కూడాను మీ వల్ల ఇంత సంతోషం గా ఉన్నారు అంటే మీతో ఏమని చెప్పను నేను.

 

ప్రధాన మంత్రి గారు: రాజేశ్ గారూ.. మీరు నాకు అధికారం లో ఉండాలనే శుభకామనల ను ఇవ్వకండి. నేను ఈ రోజు కు కూడాను అధికారం లో లేను. మరి భవిష్యత్తు లోనూ అధికారం లోకి వెళ్లాలి అని కోరుకోవడం లేదు. నేను కేవలం సేవ లో ఉండాలని కోరుకొంటున్నాను. నాకు ఈ పదవి- ఈ ప్రధాన మంత్రి తాలూకు ఇవన్నీ అధికారం కోసం కానే కాదు సోదరా, సేవ కోసమే.

 

రాజేశ్ ప్రజాపతి: మాకు కావలసింది కూడా సేవే మరి ఇంకేం కావాలి!

 

ప్రధాన మంత్రి గారు: చూడండి పేదల కోసమే ఉన్నది ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అనేది.

 

రాజేశ్ ప్రజాపతి: మరేనండి సర్.. చాలా గొప్పదైనటువంటి విషయం గా ఉంది ఇది.

 

ప్రధాన మంత్రి గారు: అయితే చూడండి రాజేశ్ గారూ.. మీరు మా కోసం ఒక పని చేసిపెట్టండి, చేస్తారా?

 

రాజేశ్ ప్రజాపతి: అవునండి.. తప్పక చేస్తాను సర్.

 

ప్రధాన మంత్రి గారు: చూడండి జరిగేది ఏమిటి అంటే ప్రజల కు దీని ని గురించి తెలియడం లేదు. మీరు ఒక బాధ్యత ను నిర్వర్తించాలి. ఇటువంటి పేద పరివారాలు మీకు చుట్టుపక్కల ఉన్నాయో వారికి మీరు ఇది ఎలాగ మీకు ప్రయోజనాన్ని ఇచ్చిందో, ఎటువంటి సహాయం మీకు లభించిందో, ఆ విషయాల ను గురించి చెప్పండి.

 

రాజేశ్ ప్రజాపతి: తప్పకుండా చెప్తాను సర్

 

ప్రధాన మంత్రి గారు: ఎప్పుడు ఏ కష్టం వస్తుందో తెలియదని, అందుకే ఇలాంటి కార్డు ను వారు కూడా తయారు చేయించుకోవాలని వారికి సూచించండి. డబ్బు లేకపోవడం వల్ల వారు మందు తీసుకోరు. వ్యాధి కి మందు తీసుకోరు. అది కూడా చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ గుండె సమస్య ఉంటే పేదల కు ఏం జరుగుతుంది? అప్పుడు మీరు ఎన్ని నెల లు పని చేయకుండా ఉండిపోవలసి వస్తుంది?

 

రాజేశ్ ప్రజాపతి: నేను పది అడుగులు కూడా నడవలేక పోయే వాడిని. మెట్లు ఎక్కలేక పోయే వాడిని సర్

 

ప్రధాన మంత్రి గారు: రాజేశ్ గారూ.. మీరు నాకు మంచి మిత్రుని గా మారడం ద్వారా, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వీలైనంత మంది పేదల కు వివరించడం ద్వారా మీరు అనారోగ్యంతో ఉన్న వారికి సహాయం చేయవచ్చును. మీరు కూడా సంతోష పడుతారు. రాజేశ్ గారి ఆరోగ్యం బాగుపడడంతో పాటు రాజేశ్ గారు వందల మంది కి ఆరోగ్యం చేకూర్చారని నేను కూడా సంతోషిస్తాను. ఈ ఆయుష్మాన్ భారత్ యోజన పేదల కోసం. మధ్యతరగతి వారి కోసం. ఇది సాధారణ కుటుంబాల కోసం, కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఇంటి కి మీరు చేరవేయాలి.

 

రాజేశ్ ప్రజాపతి: తప్పక చేరవేస్తాను సర్. మూడు రోజులు ఆసుపత్రి లోనే ఉన్నాం సర్. ఆసుపత్రి కి వచ్చిన చాలా మంది పేదల కు కార్డు ఉంటే కలిగే ప్రయోజనాలు చెప్పాం సర్. కార్డు ఉంటే ఉచితం గా చేస్తారని చెప్పాం సర్.

 

ప్రధాన మంత్రి గారు: రాజేశ్ గారూ.. మిమ్మల్ని మీరు ఆరోగ్యం గా ఉంచుకోండి. మీ శరీరాన్ని కొంచెం జాగ్రత్త గా చూసుకోండి. పిల్లల ను జాగ్రత్తగా చూసుకోండి. చాలా అభివృద్ధి చెందండి. మీకు ఇవే చాలా చాలా శుభాకాంక్షలు.

 

 

సహచరులారా, మనం రాజేశ్ గారి మాటల ను విన్నాం. ఇప్పుడు సుఖ్ దేవి గారు మనతో చేరుతున్నారు. మోకాళ్ల సమస్య ఆమె ను చాలా ఇబ్బంది పెట్టింది. రండి, మనం సుఖ్‌దేవి గారి వద్ద నుంచి మొదట ఆవిడ దు:ఖం తాలూకు మాటల ను విందాం. మరి ఆ తరువాత సుఖం ఎలా వచ్చిందో ఆ సంగతినీ అర్థం చేసుకుందాం.

 

మోదీ గారు: సుఖదేవి గారూ.. నమస్తే. మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?

 

సుఖ దేవి గారు: దాన్ దపరా నుంచి.

 

మోదీ గారు: అది ఎక్కడ ఉంది?

 

సుఖ దేవి గారు: మధుర లో.

 

మోదీ గారు: మధుర లోనా! అయితే సుఖదేవి గారూ.. మీరు నమస్తే చెప్పడం తో పాటు రాధే-రాధే అని కూడా చెప్పాలి.

 

సుఖదేవి గారు: అవును. రాధే-రాధే.

 

మోదీ గారు: మీకు కష్టం వచ్చిందని మేం విన్నాం. మీకు ఏదైనా ఆపరేశన్ జరిగిందా? విషయమేమిటో చెప్పగలరా?

 

సుఖ దేవి గారు: అవును. నా మోకాలు దెబ్బతింది. కాబట్టి నాకు ఆపరేశన్ జరిగింది. ప్రయాగ్ హాస్పిటల్ లో.

 

మోదీ గారు: సుఖదేవి గారూ.. మీ వయస్సు ఎంత?

 

సుఖ దేవి గారు: నా కు 40 ఏళ్ల వయస్సు సర్ .

 

మోదీ గారు: సుఖదేవి అనే పేరు. 40 సంవత్సరాలు. సుఖదేవి అనారోగ్యం పాలయ్యారు.

 

సుఖ దేవి గారు: 15-16 సంవత్సరాల వయస్సు నుండే నేను అనారోగ్యం తో ఉన్నాను.

 

మోదీ గారు: అంత చిన్న వయస్సు లో మీ మోకాలు చెడిపోయిందా!

 

సుఖ దేవి గారు: కీళ్లనొప్పుల వల్ల మోకాలు చెడిపోయింది సర్.

 

మోదీ గారు: 16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు మీరు చికిత్స కూడా చేయించలేదా?

 

సుఖ దేవి గారు: లేదు. .. చేయించాను. నొప్పి కి మందు తీసుకొంటూనే దగ్గర లో ఉన్న చిన్న చితక డాక్టర్ ల దగ్గరకు వెళ్లి నా స్థితి ని వివరించాను. స్థానికం గా దొరికే మందుల ను వాడాను. దాంతో మోకాలు మరింత పాడైపోయింది.

 

మోదీ గారు: సుఖదేవి గారూ.. ఆపరేశన్ ఆలోచన ఎలా వచ్చింది? దాని కోసం డబ్బు ను ఎలాగ ఏర్పాటు చేసుకొన్నారు? ఇదంతా ఎలా జరిగింది?

 

సుఖ దేవి గారు: నేను ఆయుష్మాన్ కార్డు తో ఆ చికిత్స ను పూర్తి చేశాను.

 

మోదీ గారు: మీకు ఆయుష్మాన్ కార్డు వచ్చిందా?

 

సుఖ దేవి గారు: అవును.

 

మోదీ గారు: ఆయుష్మాన్ కార్డుతో పేదలకు ఉచిత చికిత్సజరుగుతుంది. ఇది మీకు తెలుసా?

 

సుఖ దేవి గారు: స్కూల్‌లో ఒక మీటింగ్ ద్వారా మా భర్తకు తెలిసింది. నా పేరు మీద కార్డు చేయించారు.

 

మోదీ గారు: అలాగా..

 

సుఖ దేవి గారు: అప్పుడు కార్డు ద్వారా ట్రీట్‌మెంట్ చేయించాను. నేను డబ్బు పెట్టుబడి పెట్టలేదు. కార్డు ద్వారానే నేను చికిత్స ను పొందాను. మంచి చికిత్స జరిగింది.

 

మోదీ గారు: కార్డు లేకపోతే ఎంత ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పే వారు?

 

సుఖ దేవి గారు: రెండున్నర లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలు అవుతుందనేవారు. ఆరేడేళ్ల నుంచి మంచం లో ఉన్నాను. దేవుడా! నన్ను తీసుకెళ్లు. నాకు బతకాలని లేదుఅని అనుకునే దానిని.

 

మోదీ గారు: 6-7 సంవత్సరాలు మంచం మీద ఉన్నారు. అమ్మో!

 

సుఖ దేవి గారు: అవును.

 

మోదీ గారు: ఓ!

 

సుఖ దేవి గారు: అస్సలు లేవడం, కూచోవడం ఉండేది కాదు.

 

మోదీ గారు: ఇప్పుడు మీ మోకాలు మునుపటి కంటే మెరుగ్గా ఉందా?

 

సుఖ దేవి గారు: నేను చాలా ప్రయాణం చేస్తాను. నేను తిరుగుతున్నాను, వంటగది లో పనిచేస్తాను. ఇంటి పనులను చేస్తాను. నేనే వండి, పిల్లల కు భోజనం పెడతాను.

 

మోదీ గారు: కాబట్టి ఆయుష్మాన్ భారత్ కార్డు నిజంగా మిమ్మల్ని ఆయుష్మంతులు గా మార్చిందన్న మాట.

 

సుఖ దేవి గారు: ఈ పథకాని కి చాలా ధన్యవాదాలు. కోలుకున్నాను. నా కాళ్ళ పైన నేను నిలబడగలుగుతున్నాను.

 

మోదీ గారు: కాబట్టి ఇప్పుడు పిల్లలు కూడా ఆనందిస్తున్నారు.

 

సుఖ దేవి గారు: అవును. పిల్లలు చాలా ఇబ్బందులు పడే వారు. తల్లి బాధపడితే, బిడ్డలు కూడా బాధపడే వారు.

 

మోదీ గారు: చూడండి.. మన ఆరోగ్యం మన జీవితం లో అతి పెద్దదైనటువంటి ఆనందం. ఇది ఆయుష్మాన్ భారత్ భావన. ప్రతి ఒక్కరు కూడా ఈ సంతోషకరమైన జీవితాన్ని పొందాలి. సుఖదేవి గారూ.. మీకు మరోసారి శుభాకాంక్షలు. రాధే-రాధే.

 

సుఖ దేవి గారు: రాధే-రాధే.. నమస్తే!

 

 

ప్రియమైన నా దేశవాసులారా, యువత తో సమృద్ధం గా ఉన్న ప్రతి దేశం లో మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు అవే కొన్నిసార్లు యువత నిజమైన గుర్తింపు గా మారుతాయి. మొదటి విషయం - ఆలోచన లు,ఆవిష్కరణ. రెండోది రిస్క్ తీసుకొనేందుకు సిద్ధం గా ఉండే మనస్తత్వం. మూడోది ఏదైనా చేయగలను అనేటటువంటి ఆత్మ విశ్వాసం- అంటే పరిస్థితులు ఎంత ప్రతికూలం గా ఉన్నప్పటికీ ఏ పనిని అయినా సరే సాధించాలి అనేటటువంటి సంకల్పం. ఈ మూడు అంశాలు కలిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజుల్లో మనం స్టార్ట్-అప్, స్టార్ట్-అప్, స్టార్ట్-అప్.. అని అన్ని వైపుల నుంచి వింటున్నాం. నిజమే.. ఇది స్టార్ట్-అప్ యుగం, అలాగే స్టార్ట్-అప్ ప్రపంచం లో ప్రస్తుతం భారతదేశం ప్రపంచానికే ఒక రకం గా మార్గదర్శి గా నేతృత్వం వహిస్తుందన్నది కూడా నిజం. స్టార్ట్-అప్ స్ ఏడాదికేడాది రికార్డు స్థాయి లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ రంగం చాలా వేగం గా అభివృద్ధి చెందుతోంది. దేశం లోని చిన్న పట్టణాల లో కూడా స్టార్ట్-అప్ స్ పరిధి పెరిగింది. ఈ రోజుల్లో 'యూనికార్న్' అనే పదం చాలా చర్చ లో ఉంది. మీరందరూ తప్పక విని ఉంటారు. 'యూనికార్న్' అటువంటి స్టార్ట్-అప్. దీని విలువ తక్కువ లో తక్కువ గా చూసినా ఒక బిలియన్ డాలర్ ఉంటుంది. అంటే సుమారు గా ఏడు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువన్న మాట.

 

 

సహచరులారా, 2015 సంవత్సరం వరకు బహుకష్టం గా దేశం లో దాదాపు తొమ్మిది లేదా పది యూనికార్ న్ లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు భారతదేశం యునికార్ న్ ల జగతి లో కూడా వేగం గా పురోగమిస్తుందని తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఒక నివేదిక ప్రకారం ఈ సంవత్సరం పెద్ద మార్పు వచ్చింది. కేవలం 10 నెలల్లో ప్రతి 10 రోజుల కు ఒక యూనికార్ న్ భారతదేశం లో తయారవుతోంది. కరోనా మహమ్మారి మధ్య మన యువత ఈ విజయాన్ని సాధించడం కూడా పెద్ద విషయం. ప్రస్తుతం భారతదేశం లో 70 కంటే ఎక్కువ యూనికార్ న్ లు ఉన్నాయి. అంటే ఒక బిలియన్ డాలర్ కంటే ఎక్కువ విలువ ను దాటిన 70 కంటే ఎక్కువ స్టార్ట్-అప్ స్ ఉన్నాయి. సహచరులారా, స్టార్ట్-అప్ విజయం కారణం గా ప్రతి ఒక్కరి దృష్టి దీని మీద పడింది. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి పెట్టుబడిదారుల సహకారం లభిస్తున్న విధానాన్ని అందరూ గమనిస్తున్నారు. బహుశా కొన్ని సంవత్సరాల కిందట ఇది ఎవరూ ఊహించలేదు.

 

 

సహచరులారా, భారతీయ యువత స్టార్ట్- అప్‌ స్ ద్వారా ప్రపంచ సమస్య ల పరిష్కారం లో కూడా సహకరిస్తోంది. ఈ రోజు మనం ఒక యువకుడు మయూర్ పాటిల్‌ తో మాట్లాడుదాం. ఆయన తన స్నేహితులతో కలసి కాలుష్యం సమస్య కు పరిష్కారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు.

 

మోదీ గారు: మయూర్ గారూ.. నమస్తే.

 

మయూర్ పాటిల్: నమస్కారం సర్.

 

మోదీ గారు: మయూర్ గారూ.. మీరెలా ఉన్నారు?

 

మయూర్ పాటిల్: చాలా బాగున్నాను సర్. మీరు ఎలా ఉన్నారు ?

 

మోదీ గారు: నేను చాలా సంతోషం గా ఉన్నాను. సరే చెప్పండి. ప్రస్తుతం మీరేదో స్టార్ట్- అప్ ప్రపంచం లో ఉన్నారు.

 

మయూర్ పాటిల్ గారు: అవును సర్!

 

మోదీ గారు: వ్యర్థాలను ఉత్తమంగా పరివర్తన చేస్తున్నారు.

 

మయూర్ పాటిల్: అవును సర్!

 

మోదీ గారు: పర్యావరణ రంగం లో కూడా మీరు పని చేస్తున్నారు. మీ గురించి చెప్పండి. మీ పని ని గురించి చెప్పండి. ఈ పని కి సంబంధించిన ఆలోచన మీకు ఎలా వచ్చింది?

 

మయూర్ పాటిల్: సర్! నేను కాలేజీ లో ఉన్నప్పుడు నాకు మోటార్ సైకిల్ ఉండేది. దాని మైలేజ్ చాలా తక్కువ గా ఉండేది. ఉద్గారం చాలా ఎక్కువ గా ఉండేది. అది టూ స్ట్రోక్ మోటార్ సైకిల్. కాబట్టి ఉద్గారాల ను తగ్గించి, దాని మైలేజీ ని కొద్దిగా పెంచడానికి నేను ప్రయత్నించడం మొదలుపెట్టాను. ఎప్పుడో 2011-12లో నేను మైలేజీ ని లీటరు కు 62 కిలోమీటర్ల మేరకు పెంచాను. కాబట్టి అక్కడి నుంచి నేను ప్రజల కోసం పెద్ద ఎత్తున తయారు చేయాలనే ప్రేరణ ను పొందాను. అప్పుడు చాలా మంది దాని నుంచి ప్రయోజనం పొందుతారు కాబట్టి. 2017-18లో మేం దాని సాంకేతికత ను అభివృద్ధి చేశాం. ప్రాంతీయ రవాణా సంస్థ లో 10 బస్సుల లో ఉపయోగించాం. దాని ఫలితాన్ని తనిఖీ చేయడానికి దాదాపు మేం ఉద్గారాల ను నలభై శాతం తగ్గించాం- బస్సుల లో..

 

మోదీ గారు: ఓహ్! మీరు కనుగొన్న ఈ సాంకేతికత కు పేటెంట్ మొదలైనవి పొందారా?

 

మయూర్ పాటిల్: అవును సర్! పేటెంట్ అయిపోయింది. ఈ సంవత్సరం లో మాకు పేటెంట్ మంజూరై వచ్చేసింది.

 

మోదీ గారు: మరి దీనిని మరింత గా పెంచే ప్రణాళిక ఏమిటి? ఎలా చేస్తున్నారు? బస్సు ఫలితం వచ్చేసింది. ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే ఉంటాయి. కాబట్టి మీరు తరువాత ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు?

 

మయూర్ పాటిల్: సర్! స్టార్ట్-అప్ ఇండియాలో నీతి ఆయోగ్ నుంచి అటల్ న్యూ ఇండియా చైలింజ్ నుంచి మాకు గ్రాంటు లభించింది. ఆ గ్రాంటు ఆధారం గా మేం ఎయర్ ఫిల్టర్స్ ను తయారు చేసే ఫ్యాక్టరీ ని ప్రారంభించాం.

 

మోదీ గారు: భారత ప్రభుత్వం తరఫు న మీకు ఎంత గ్రాంటు అందింది?

 

మయూర్ పాటిల్ : 90 లక్షలు

 

మోదీ గారు: 90 లక్షలా!

 

మయూర్ పాటిల్: అవును సర్!

 

మోదీ గారు: మీ పని దానితో పూర్తయిందా !

 

మయూర్ పాటిల్: అవును.. ఇప్పుడు మొదలైపోయింది. ప్రాసెసె స్ లో ఉన్నాం.

 

మోదీ గారు: మీరు ఎంత మంది స్నేహితులు కలిసి చేస్తున్నారు ఇదంతా?

 

మయూర్ పాటిల్: మేం నలుగురం సర్.

 

మోదీ గారు: నలుగురూ ఇంతకుముందు కలిసి చదువుకునే వారు. దాని నుంచి మీకు ముందుకు వెళ్లాలనే ఆలోచన వచ్చింది.

 

మయూర్ పాటిల్: అవును సర్! అవును! మేము ఇంకా కాలేజీ లోనే ఉన్నాం అప్పుడు. కాలేజీ లో మేం ఇదంతా ఆలోచించాం. కనీసం నా మోటార్‌సైకిల్ కాలుష్యాన్ని తగ్గించి మైలేజీ ని పెంచాలి అనేది నా ఆలోచన.

 

మోదీ గారు: కాలుష్యాన్ని తగ్గించారు.. మైలేజీ ని పెంచారు.. అప్పుడు సగటు ఖర్చు ఎంత ఆదా అవుతుంది?

 

మయూర్ పాటిల్: సర్! మోటార్ సైకిల్ మైలేజీ ని పరీక్షించాం. లీటరు కు 25 కిలోమీటర్లు ఇచ్చే దాన్ని లీటర్‌ కు 39 కిలోమీటర్ల కు పెంచాం. అప్పుడు దాదాపు 14 కిలోమీటర్ల ప్రయోజనం. అందులో 40 శాతం కర్బన ఉద్గారాలు తగ్గాయి. ప్రాంతీయ రవాణా సంస్థ బస్సుల ను ప్రారంభించినప్పుడు ఇంధన సామర్థ్యం 10 శాతం పెరిగింది. దానిలో ఉద్గారాలు 35-40 శాతం తగ్గిపోయాయి.

 

మోదీ గారు: మయూర్.. మీతో మాట్లాడటం నాకు చాలా ఆనందం గా ఉంది. మీ సహచరుల ను కూడా అభినందిస్తున్నాను. కళాశాల జీవితం లో మీరు ఎదుర్కొన్న సమస్య కు మీరు ఒక పరిష్కారాన్ని కనుగొనడంతో పాటు ఆ పరిష్కారాన్ని ఎంచుకొన్న మార్గం పర్యావరణ సమస్య ను పరిష్కరించింది. మీరు చొరవ తీసుకొన్నారు. మన దేశ యువతీయువకులు ఏదైనా పెద్ద సవాలు ను స్వీకరించి, మరి దాని పరిష్కార మార్గాల ను వెదకుతున్నారు. అదే మన యువత యొక్క సామర్థ్యం. నా వైపు నుంచి మీకు శుభాకాంక్షలు, చాలా చాలా ధన్యవాదాలూను.

 

మయూర్ పాటిల్: మీకు ధన్యవాదాలు సర్! మీకు ధన్యవాదాలు!

 

 

సహచరులారా, కొన్నేళ్ల ముందు ఎవరైనా వ్యాపారం చేయాలి అని అనుకొంటున్నాను అని అంటేనో లేదా ఒక కొత్త కంపెనీ ని మొదలు పెట్టాలి అని అనుకొంటున్నాను అని చెబితే, అప్పుడు కుటుంబం లోని పెద్ద వారు ఇచ్చే జవాబు ఎలా ఉండేదంటే అది నువ్వు ఉద్యోగం ఎందుకు చేయవద్దనుకొంటున్నావు ? ఉద్యోగం చేయవయ్యా బాబు. అరె నౌకరీ లో భద్రత ఉంటుంది; జీతం వస్తుంది. ఇబ్బంది కూడా తక్కువగానే ఉంటుంది.అనేదే. కానీ, ఈరోజు న ఎవరైనా తన స్వంత కంపెనీ ని ప్రారంభించాలి అని అనుకొంటూ ఉంటే అప్పుడు ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉన్న వారు అందరూ చాలా ఉత్సాహపడతారు. మరి ఆ వ్యక్తి కి పూర్తి మద్దతు ను సైతం ఇస్తారు. సహచరులారా, భారతదేశం వృద్ధి కథ లోనిదే ఈ మలుపు. దీనిలో ఇప్పుడు జనం ఉద్యోగాన్ని కోరుకొనే వారు గా కల కనడం కాకుండా ఉద్యోగాల ను సృష్టించే వారు గా కూడాను మారుతున్నారు. దీనితో ప్రపంచ వేదిక పై భారతదేశం యొక్క స్థితి మరింత బలోపేతమవుతుంది.

 

 

ప్రియమైన నా దేశవాసులారా, ఈ రోజు మనం మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో అమృత్ మహోత్సవ్ ను గురించి మాట్లాడుకొన్నాం. అమృత కాలం లో మన దేశవాసులు కొత్త కొత్త సంకల్పాల ను ఎలాగ నెరవేరుస్తున్నదీ చర్చించాం. దీనితో పాటు డిసెంబర్ లో సైన్యం ధైర్య సాహసాల కు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించుకొన్నాం. మనం ప్రేరణ ను పొందేటటువంటి మరొక పెద్ద రోజు డిసెంబరు నెల లోనే మన ముందుకు వస్తుంది. ఆ దినం, డిసెంబర్ 6వ తేదీ. ఆనాడు బాబా సాహబ్ ఆమ్బేడ్ కర్ వర్ధంతి. బాబా సాహబ్ ఆయన జీవన పర్యంతం దేశం కోసం, సమాజం కోసం ఆయన యొక్క కర్తవ్యాలను నిర్వర్తించడానికి సమర్పించారు. మన రాజ్యాంగం లోని మౌలిక భావన కూడాను, దేశవాసులు వారి వారి కర్తవ్యాల ను నిర్వహించాలి అని అపేక్షిస్తుందనే సంగతి ని దేశవాసులం అయిన మనం అందరం ఎప్పటికీ మరచిపోరాదు. కాబట్టి రండి, మనం కూడాను సంకల్పాన్ని తీసుకొందాం అది ఏమని అంటే అమృత మహోత్సవం లో మనం కర్తవ్యాలను పూర్తి నిష్ఠ తో నిర్వర్తించే ప్రయాస ను చేద్దాం అనేదే. ఇదే బాబా సాహబ్‌ కోసం మన నిజమైన శ్రద్ధాంజలి కాగలుగుతుంది.

 

 

సహచరులారా, ఇప్పుడు మనం డిసెంబర్ నెల లోకి ప్రవేశిస్తున్నాం. తరువాతి మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం 2021 తాలూకు ఇదే సంవత్సరం లోని చివరి మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కావడం సహజం. 2022 లో మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మరి అవును నేను మీ వద్ద నుంచి అనేక సూచనల ను ఆశిస్తూనే ఉంటాను. మీరు ఈ సంవత్సరాని కి ఎలాగ వీడ్కోలు పలుకుతున్నారు, కొత్త సంవత్సరం లో ఏమేమి చేయబోతున్నారు, అవి కూడా తప్పక తెలియజేయండి. మరి అవును కరోనా ఇంకా పోలేదు అనే విషయాన్ని ఎన్నటికీ మరచిపోవద్దు. జాగ్రత వహించడం అనేది మన అందరి బాధ్యత గా ఉంది.

 

 

చాలా చాలా ధన్యవాదాలు.

 

 

 

***



(Release ID: 1776029) Visitor Counter : 252