పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఖుషీనగర్ విమానాశ్రయం నుండి దేశీయ విమాన కార్యకలాపాలు ప్రారంభం
- ఉడాన్ పథకం కింద ఢిల్లీ - ఖుషీనగర్ మధ్య తొలి విమాన సేవలు మొదలు
Posted On:
27 NOV 2021 3:28PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని కొత్తగా ప్రారంభించబడిన ఖుషీనగర్ విమానాశ్రయం నుంచి దేశీయ విమాన కార్యకలాపాలు 26.11.2021న మొదలయ్యాయి. ఆర్‌సీఎస్-ఉడాన్ (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ - ఉడే దేశ్ కా ఆమ్ నాగ్‌రిక్) కింద ఢిల్లీ మరియు ఖుషీనగర్ మధ్య మొదటి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఉడాన్ పథకం కింద దేశానికి మెరుగైన విమాన కనెక్టివిటీని అందించడానికి పౌరవిమానయాన శాఖ మరియు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబద్ధత మరియు పట్టుదలతో ఈ మార్గంలో విమాన కార్యకలాపాలను ప్రారంభంచింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ 2021 అక్టోబరు 20వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఖుషీనగర్ అంతర్జాతీయ బౌద్ధ యాత్రా కేంద్రం. ఇక్కడ గౌతమ బుద్ధుడు మహా పరినిర్వాణం పొందారు. ఈ ప్రాంతం బౌద్ధ సర్క్యూట్‌కు కేంద్ర బిందువుగా ఉంది. ఇందులో లుంబినీ, సారనాథండ్ గయా పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఖుషీనగర్ విమానాశ్రయ కార్యాచరణ ఈ ప్రాంతాన్ని జాతీయ, ప్రపంచ సందర్శకులు మరియు యాత్రికులతో నేరుగా అనుసంధానిస్తుంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ).. ఖుషీనగర్ ఎయిర్‌పోర్ట్‌ను 3600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనంతో కలుపుకొని ప్రభుత్వం తొడ్పాటుతో రూ. 260 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసింది. ఉత్తర ప్రదేశ్. కొత్త టెర్మినల్ రద్దీ వేళల్లో 300 మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసేలా అమర్చబడింది. స్పైస్‌జెట్‌కు ఆర్‌సీఎస్-ఉడాన్ 4.0 కింద ఖుషీనగర్ - ఢిల్లీ మార్గాన్ని అందించారు. ఈ మార్గంలో విమాన కార్యకలాపాలు ఆతిథ్యం, పర్యాటకం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థపై గుణకార ప్రభావంగా పనిచేస్తాయి. ఇప్పటి వరకు, ఉడాన్ పథకం కింద 6 హెలిపోర్ట్‌లు మరియు 2 వాటర్ ఏరోడ్రోమ్‌లతో సహా 395 మార్గాలు మరియు 63 విమానాశ్రయాలలో కార్యకలాపాలు అమలు చేయబడ్డాయి.
ఇక్కడి ఉడాన్ విమాన షెడ్యూల్ క్రింద ఉంది:
ఫ్లైట్ నంబర్
|
ప్రారంభం
|
గమ్యం
|
విమానయాన సంస్థ
|
నిష్క్రమణ
|
రాక
|
పౌనఃపుణ్యం
|
ఎస్‌జీ2987
|
ఢిల్లీ
|
ఖుషీనగర్
|
స్పైస్‌జెట్
|
12:00
|
13:35
|
1,3,5,7
|
ఎస్‌జీ 2988
|
ఖుషీనగర్
|
ఢిల్లీ
|
స్పైస్‌జెట్
|
13:55
|
15:50
|
1,3,5,7
|
***
(Release ID: 1775831)
Visitor Counter : 174