పార్లమెంటరీ వ్యవహారాలు
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం, పార్లమెంట్ హౌజ్‌లోని సెంట్రల్ హాల్‌లో వేడుకలు
రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మార్గదర్శనం చేయనున్న గౌరవ భారత రాష్ట్రపతి, రేపు ఉదయం 11 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం
కార్యక్రమానికి హాజరుకానున్న గౌరవ ఉపరాష్ట్రపతి, గౌరవనీయ ప్రధాన మంత్రి, గౌరవనీయ స్పీకర్, మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు
అన్ని కోవిడ్ ప్రోటోకాళ్ళను అనుసరిస్తూ, తమ తమ ప్రాంతాల నుంచి తనతో కలిసి 26.11.2021న రాజ్యాంగ పీఠికను చదువవలసిందిగా గౌరవనీయ రాష్ట్రపతి అభ్యర్ధన
ప్రజల భాగస్వామ్యం గరిష్టంగా ఉండేందుకు రెండు పోర్టళ్ళను అభివృద్ధి చేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఒక పోర్టల్ రాజ్యాంగ పీఠికను ఆన్‌లైన్‌లో 23 భాషలు (22 అధికారిక భాషలు + ఇంగ్లీష్)లో చదివేందుకు (mpa.gov.in/constitution-day)
రెండవ పోర్టల్ రాజ్యాంగ ప్రజాస్వామ్యంపై ఆన్‌లైన్ క్విజ్ కోసం ( mpa.gov.in/constitution-day)
ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఇందులో పాలు పంచుకొని, సర్టిఫికెట్లను పొందవచ్చు
Posted On:
25 NOV 2021 4:24PM by PIB Hyderabad
,75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశం, దేశ పౌరుల, సంస్కృతి, విజయాల ఘన చరిత్రను స్తుతించి, స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం చేపట్టిన చొరవ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఈ మహోత్సవ్‌లో భాగంగా పార్లమెంట్ హౌజ్‌లోని సెంట్రల్ హాల్ లో భారతదేశం 26 నవంబర్‌న అత్యంత శ్రద్ధ, ఉల్లాసాలతో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
గౌరవనీయ భారత రాష్ట్రపతి పార్లమెంట్ హౌజ్ లోని సెంట్రల్ హౌజ్ నుంచి నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమానికి గౌరవనీయ ఉపరాష్ట్రపతి, గౌరవనీయ స్పీకర్, గౌరవనీయ స్పీకర్, మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని సన్సద్ టివి/ డిడి, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ప్రసంగానంతరం తనతో కలిసి లైవ్‌లో రాజ్యాంగం పీఠికను చదివేందుకు యావత్ దేశాన్నీ ఆహ్వానిస్తున్నారు. అనంతరం ఆయన రాజ్యాంగ ప్రజాస్వామ్యంపై ఆన్‌లైన్ క్విజ్ (mpa.gov.in/constitution-day )ను ప్రారంభించనున్నారు. రాజ్యాంగ పీఠికను చదివేందుకు 23 భాషలలో (22 అధికారిక భాషలు, ఇంగ్లీషు) ఉద్దేశించిన పోర్టల్ లో ప్రత్యక్ష ప్రసారం నేటి అర్థరాత్రి నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్లను mpa.gov.in/constitution-day అన్న లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
***
(Release ID: 1775139)
Visitor Counter : 168