ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

प्रविष्टि तिथि: 22 NOV 2021 9:11AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 116.87 కోట్ల డోసులను అందించారు.

రికవరీ రేటు 98.31% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 12,510 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,39,34,547 కు పెరిగింది.

గత 24 గంటల్లో 8,488 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,18,443. ఇది 534 రోజుల కనిష్ట స్థాయి.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.34% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.08%) గత 49 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (0.93%) గత 59 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 63.25 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

****


(रिलीज़ आईडी: 1773941) आगंतुक पटल : 176
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam