గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

పి.ఎం.ఎ.వై.-జి. పథకానికి ఐదేళ్లు!


ఇప్పటికే ముగిసిన 1.63కోట్ల ఇళ్ల నిర్మాణం..

రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు
ఇప్పటివరకూ రూ. 1,47,218.31కోట్లు విడుదల..

-ఆవాస్ దివస్-ను పురస్కరించుకుని
పలు కార్యక్రమాల నిర్వహణ..

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు, కేంద్రపాలిత
ప్రాంతాల ఉమ్మడి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు...

Posted On: 20 NOV 2021 12:56PM by PIB Hyderabad

  ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పి.ఎం.ఎ.వై.-జి.) పథకం అమలు ప్రారంభమై ఐదేళ్లు పూర్తయిన సందర్భంతోపాటుగా, ఆవాస్ దివస్ వేడుకలను పురస్కరించుకుని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2021 నవంబరు 20న,  అనేక కార్యక్రమాలు, కార్యకలాపాలు నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంకోసం భూమి పూజలు, పూర్తయిన ఇళ్ల గృహప్రవేశాలు, లబ్ధిదారుల ఇళ్ల సందర్శన, పి.ఎం.ఎ.వై.-జి. పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలను ఈ సందర్భంగా చేపట్టారు. -అందరికీ ఇళ్లు- అన్న బృహత్తర లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపట్టింది. అందరికీ ఇళ్లు అనే లక్ష్యాన్ని నిర్దేశించిన గడవులోగా పూర్తి చేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహించింది. 

https://ci6.googleusercontent.com/proxy/fvzBecHlb9rQMWW4Ja_E_ckidtDP7rCm6KE5QYAAxuDn7Tq3WKCJH1NVtCNxBHJqTDSY-apwpqfuI_wZd5FM0bMio7GAFCOv3vd41AEiLuhMLcp154Mei7_25Q=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001O51T.png

అస్సాం

 

“అందరికీ ఇళ్లు”   అన్న లక్ష్యాన్ని 2022వ సంవత్సరానికల్లా పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. పునవ్యస్థీకరించిన గ్రామీణ గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టింది. ఇందుకోసం పి.ఎం.ఎ.వై.-జి అనే పథకానికి 2016 నవంబరు 20వ తేదీన శ్రీకారం చుట్టారు. 2016 ఏప్రిల్ 1వ తేదీన పనులు ప్రారంభమయ్యాయి. ఈ పథకం కింద అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన 2.95కోట్ల ఇళ్లను 2022లోగా నిర్మించేందుకు కార్యక్రమ ప్రణాళికను రూపొందించారు.

 

https://ci5.googleusercontent.com/proxy/Y1sdyJXa6qYTf7oJVdqS0JK_pRbw5OPOyO96YlgA-RL9ef1ajAvCy_nBVyl8TnolCvqs70cpMXPCFcwCjUC_3k8529-pd0QbXxCIfXq4APSI7bQNf0UGFH4zww=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002RA5N.jpg

ఒడిశా

 

క్షేత్ర స్థాయి వివరాలు:

పి.ఎం.ఎ.వై.-జి పథకం ప్రారంభమైన నాటినుంచి సంచిత లక్ష్యంకోసం ఈ కింది కార్యక్రమాలు జరిగాయి.:

పి.ఎం.ఎ.వై.-జి పథకం కింద 2016-17నుంచి 2020-21 వరకు నిర్దేశించుకున్న ఇళ్ల నిర్మాణ సంచిత లక్ష్యం

2.62 కోట్లు

రిజిస్ట్రేషన్లు

2.20 కోట్లు

జియోట్యాగ్.తో అనుసంధానమైన ఇళ్లు

2.16 కోట్లు

మంజూరైన ఇళ్ల సంఖ్య

2.09 కోట్లు

చెల్లింపులు జరిగిన మొదటి వాయిదాల సంఖ్య

1.98 కోట్లు

చెల్లింపులు జరిగిన 2వ వాయిదాల సంఖ్య

1.80 Crore

చెల్లింపులు జరిగిన 3వ వాయిదాల సంఖ్య

1.63 Crore

నిర్మాణం పూర్తయిన ఇళ్లు

1.63 Crore

  నవంబరు 15నాటి సమాచారం,...  ఆవాస్ సాఫ్ట్ నిర్వహణా సమాచార వ్యవస్థలో పేర్కొన్న ప్రకారం.

 

తాజా ఆర్థిక పరిస్థితి:

పి.ఎం.ఎ.వై.-జి పథకం కింద రాష్ట్రాలకు/కేంద్ర పాలిత ప్రాంతాలకు 2021-22వ సంవత్సరంలో విడుదలైన మొత్తం రూ. 7775.63 కోట్లు. ఇక ఈ పథకం మొదలైన నాటినుంచి  రాష్ట్రాలకు/కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదలైన మొత్తాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

(2021, నవంబరు 15వ నాటికి అందిన సమాచారం)

ఆర్థిక సంవత్సరం

రాష్ట్రాలకు/కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదలైన మొత్తం నిధులు

(మొత్తం రూ. కోట్లలో)

2016-17

16,058

2017-18

29,889.86

2018-19

29,331.05

2019-20

27,305.84

2020-21

36,857.93

2021-22

7,775.63

మొత్తం

1,47,218.31

 

    అర్హులైన లబ్ధిదారులందరికీ గృహ వసతిని కల్పించడంతో పాటుగా, మౌలిక సదుపాయాలను, ఇతర అవసరాలను కూడా పి.ఎం.ఎ.వై.-జి పథకం ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వ పరిధిలోని ఇతర పథకాలను సమ్మిళితం చేస్తూ, సద్వినియోగం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.జి.ఎస్.) ద్వారా 90 లేదా 95శాతం పని దినాలను నైపుణ్యం అవసరంలేని ఉపాధి కల్పన పేరిట అర్హులకు కల్పిస్తారు. మరుగుదొడ్ల నిర్మాణానికి, గ్రామీణ ప్రాంతాలకు నిర్దేశించిన స్వచ్ఛ భారత్ పథకం ద్వారా వెసులుబాటు కల్పిస్తారు. ప్రభుత్వం అమలుచేసే వివిధ రకాల పథకాల ద్వారా తాగునీటి కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, వంట గ్యాస్ (ఎల్.పి.జి.) కనెక్షన్ తదితర సదుపాయాలను కల్పించేందుకు వీలు కల్పించారు.

 

https://ci3.googleusercontent.com/proxy/Z0wGP4pJu2pM5_gTPkOOISog_HjnYoCxBa2ul3P5HSJekvxNg0IDl_ZWnXgPR07pXig652iQ8WuA1atmSt3SqsCz8d4TiZIBdj_7cpOGWgtEuBso5Tw69iOSdw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003L5ZC.jpg

మధ్యప్రదేశ్

ఇక పి.ఎం.ఎ.వై.-జి పథకం కింద సహాయం పొందవలసిన లబ్ధిదారులను గుర్తించేందుకు 2021వ సంవత్సరపు సామాజిక ఆర్థిక కులప్రాతిపదిక జనాభా లెక్కింపును ప్రమాణంగా తీసుకుంటారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాల సహకారంతో అర్హుల జాబితాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించింది. “ఆవాస్ ప్లస్ (Awaas+)” అనే మొబైల్ యాప్  వినియోగం ద్వారా ఈ చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన సర్వేని 2018 జనవరి నెలలో ప్రారంభించి,..2019వ సంవత్సరం మార్చి నెల 7వ తేదీకి పూర్తి చేశారు. మొత్తం 3.57కోట్ల మందిని Awaas+ సర్వే ద్వారా గుర్తించారు. వారిలో 2.76కోట్ల మందిని అర్హులుగా నిర్ధారించారు. ఇప్పటివరకూ వీటిలో 51.07లక్షల ఇళ్లను రాష్ట్రాలకు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించారు.

 

https://ci4.googleusercontent.com/proxy/PqEu7aA09HekDcl1PBqxRMDIcIb0hssMeMylTD5ygDaZ-EuJjGtFP_IH_A44FJkcykq9dsp7WX1pYjYttFyfYkp7bDc1MGnRjiQ8u-1bbbgGNaLf10-Gs2s2-g=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004RRTB.jpg

మహారాష్ట్ర

 

   ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణ ప్రక్రియను, పర్యవేక్షణను ఇ-గవర్నెన్స్ పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆవాస్ సాఫ్ట్, ఆవాస్.యాప్ వంటి  మెబైల్ అప్లికేషన్లను (యాప్.లను) వినియోగిస్తున్నారు. పథకం అమలుకు సంబంధించిన సమాచార నమోదుతో పాటుగా, ఇతర గణాంకాలను పర్యవేక్షించేందుకు తగిన వెసులుబాటును ఈ ఆవాస్.సాఫ్ట్ కల్పిస్తుంది. ఆవాస్.సాఫ్ట్ పర్యవేక్షించే గణాంకాల్లో పథకం క్షేత్రస్థాయి ప్రగతికి సంబంధించిన వివరాలు ఉంటాయి.  అంటే,.. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్లు, మంజూరు, ఇళ్లనిర్మాణం పూర్తి, వాయిదాల విడుదల వంటి వివరాలు ఉంటాయి. అలాగే, ఆర్థికపరమైన ప్రగతి, వివిధ పథకాల సమ్మిళితం వంటి వివరాలను కూడా ఇది పర్యవేక్షిస్తుంది. 2016లో ఈ పథకం ప్రారంభమైన నాటినుంచి సాఫ్ట్ వేర్.ను మరింత వినియోగ యోగ్యంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పథకం అమలు సమాచారం మరింత అందుబాటుయోగ్యంగా, పారదర్శకంగా ఉండేలా చూసేందుకు ఈ సాఫ్ట్.వేర్.కు కొత్తతరహా మాడ్యూల్స్.ను. కూడా జోడించారు. ఇటీవల జోడించిన మాడ్యూల్స్ వివరాలు ఈ దిగువన చూడవచ్చు:

 

  • ల్యాండ్.లెస్ మాడ్యూల్ – భూమిలేని వారికి సంబధించి శాశ్వత నిరీక్షణ జాబితా (పి.డబ్ల్యు.ఎల్.)లో స్థానం కల్పించేందుకు కూడా పి.ఎం.ఎ.వై.-జి. పథకం కింద చర్యలు తీసుకున్నారు. ఈ ఏర్పాటు ప్రకారం భూమిలేని వారికి ప్రాధాన్యతా ప్రాతిపదికన భూమి కేటాయింపు జరిగేలా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. దీనికి తోడు,.. పి.ఎం.ఎ.వై.-జి పథకంలోని శాశ్వత నిరీక్షణ జాబితాకు చెందిన లబ్ధిదారుల వివరాలను క్రోడీకరించేందుకు, లబ్ధిదారులకోసం అందుబాటులో ఉన్న భూమి పరిస్థితి, కావలసిన ఆర్థిక సహాయం.. వంటి అంశాలను నమోదు చేసేందుకు భూమిలేని పేదలకోసం ప్రత్యేకంగా ఒక మాడ్యూల్.ను రూపొందించారు.  భూమిలేని పేదలకు కేటాయించే భూమికి సంబంధించిన అన్ని రకాల వివరాలను నమోదు చేసేందుకు ఈ మాడ్యూల్ ఉపయోగపడుతుంది.

 

  • ఇ-ట్రాకింగ్ వ్యవస్థ – పి.ఎం.ఎ.వై.-జి పథకం అమలుకు సంబంధించి తలెత్తే సాంకేతిక పరమైన సమస్యలను, ఇతర అంశాలను ఎప్పటి కప్పుడు గుర్తించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు ఈ మాడ్యూల్.ను ప్రవేశపెట్టారు. సంబధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేసే సిఫార్సులకు అనుగుణంగా ఈ విషయంలో చర్యలు తీసుకుంటారు.

 

  • ఆధార్ ప్రాతిపదికన చెల్లింపు వ్యవస్థ (ఎ.బి.ఎస్.) –  పి.ఎం.ఎ.వై-జి. లబ్ధిదారులకు వారివారి బ్యాంకు ఖాతాలకు నగదు ప్రయోజనాన్ని నేరుగా బదిలీ చేసేందుకు ఎ.బి.ఎస్. దోహదపడుతుంది. ఆధార్ సంఖ్యతో అనుసంధానించిన లబ్ధిదారు బ్యాంకు ఖాతాకు సురక్షితంగా సొమ్మును బదిలీ చేసేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది.

 

  • ఈ వ్యవస్థలన్నింటికీ తోడుగా, పి.ఎం.ఎ.వై.-జి పథకం స్వరూప స్వభావాలను ప్రణాళిక స్థాయినుంచి అమలు స్థాయి వరకూ అర్థం చేసుకునేందుకు విడిగా మరో మాడ్యూల్ కూడా అందుబాటులో ఉంది. పి.ఎం.ఎ.వై.-జి పథకానికి సంబంధించిన భాగస్వామ్య వర్గాల సామర్థ్యాల నిర్మాణంకోసం ఏర్పాటు చేసిన iGOT అనే ప్లాట్.ఫాం.పై ఈ మాడ్యూల్.ను అందుబాటులో ఉంచారు.

 

*****



(Release ID: 1773579) Visitor Counter : 256