సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

బెర్ట్రాండ్ టావెర్నియర్, క్రిస్టోఫర్ ప్లమ్మర్, జీన్-క్లాడ్ క్యారియర్ మరియు జీన్-పాల్ బెల్మోండోలకు నివాళులు అర్పించనున్న 52వ ఐఎఫ్ఎఫ్ఐ

Posted On: 17 NOV 2021 1:30PM by PIB Hyderabad

ప్రతి అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో (ఐఎఫ్ఎఫ్ఐ) చలన చిత్ర రంగం కోల్పోయిన దిగ్గజాలకు నివాళులు అర్పించడం ఆనవాయికిగా వస్తోంది.   52వ ఐఎఫ్ఎఫ్ఐ కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇటీవల కాలంలో మరణించిన దిగ్గజాలకు నివాళులు అర్పించనున్నది. ఈ ఉత్సవాల్లో  బెర్ట్రాండ్ టావెర్నియర్క్రిస్టోఫర్ ప్లమ్మర్జీన్-క్లాడ్ క్యారియర్ మరియు జీన్-పాల్ బెల్మోండో చిత్రాలను ప్రదర్శిస్తారు. 

52వ ఐఎఫ్ఎఫ్ఐ హోమేజ్ విభాగంలో ఈ కింది చిత్రాలను ప్రదర్శించడం జరుగుతుంది. 

1.    బెర్ట్రాండ్ టావెర్నియర్

ఏ సండే ఇన్ ది కంట్రీ --    బెర్ట్రాండ్ టావెర్నియర్

ఫ్రాన్స్ 1984 ఫ్రెంచ్ 90 నిమిషాలు రంగుల చిత్రం 

సంగ్రహ కథ : లాడ్మిరల్ అనే ఒక చిత్రకారుడు   పారిస్ వెలుపల ఒక శిధిలావస్థలో ఉన్న ఒక భవనంలో భార్య లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు.  ఒకసారి అతని కొడుకు  గొంజాగ్‌ తన తండ్రిని చూడడానికి వస్తాడు.  గొంజాగ్ జీవితంలో చాలా సంతృప్తి ఉన్నాడని అయితే  తన  కుమార్తె  అయిన  ఐరీన్ జీవిస్తున్న విధంగా తన కుమారుడు కూడా స్వేచ్ఛగా జీవించాలన్న అభిప్రాయాన్ని లాడ్మిరల్ వ్యక్తం చేస్తాడు. తాను కూడా మరింత స్వేచ్ఛగా  ఉండాలని  లాడ్మిరల్ కోరుకుంటాడు. ఐరీన్ వారితో చేరినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఏర్పడి ముదురుతాయి. 

  1. క్రిస్టోఫర్ ప్లమ్మర్

 ఆల్ ద మనీ ఇన్ ది వరల్డ్--రిడ్లీ స్కాట్ 

యునైటెడ్ స్టేట్స్యునైటెడ్ కింగ్‌డమ్ 2017 ఇంగ్లీష్ 135 నిమిషాలు రంగుల చిత్రం 

తారాగణం: క్రిస్టోఫర్ ప్లమ్మర్ , మిచెల్ విలియమ్స్మార్క్ వాల్బర్గ్రొమైన్ డ్యూరిస్చార్లీ ప్లమ్మర్

సంగ్రహ కథ:  కిడ్నాప్ అయిన 16 ఏళ్ల జాన్ పాల్ గెట్టి III , అతనిని విడిపించడానికి కిడ్నాపర్లు అడిగిన మొత్తాన్ని చెల్లించేలా  బిలియనీర్ అయిన అతని తాత (క్రిస్టోఫర్ ప్లమ్మర్)ని ఒప్పించేందుకు  అతనిని అమితంగా ప్రేమించే తల్లి గెయిల్ చేసిన ప్రయత్నాల చుట్టూ సినిమా కథ  తిరుగుతుంది. డబ్బులు చెల్లించడానికి  జెట్టి సీనియర్ నిరాకరిస్తాడు. తన కుమారుని జీవితం ప్రమాదంలో ఉండటంతో గెయిల్, గెట్టి సలహాదారు అయిన  మార్క్ వాల్‌బర్గ్ తో కలిసి కాలంతో పోటీ పడుతూ పనిచేస్తారు.  చివరికి డబ్బు కంటే ప్రేమ విలువ గొప్పదని ఇది శాశ్వతంగా నిలుస్తుందని రుజువు చేస్తారు. 

3.    జీన్-క్లాడె  క్యారియరె 

ఎట్ ఎటర్నిటీ గేట్ -- జూలియన్ ష్నాబెల్ 

స్క్రీన్ ప్లే : జీన్-క్లాడ్ క్యారియర్ , లూయిస్ కుగెల్‌బర్గ్జూలియన్ ష్నాబెల్

అమెరికా ఫ్రాన్స్ 2018 ఇంగ్లీష్ఫ్రెంచ్ 110 నిమిషాలు రంగుల చిత్రం 

సంగ్రహ కథ:విన్సెంట్ వాన్ గోహ్ పెయింటింగ్స్, అతని జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. కళా సృష్టి ఎలా జీవించాలి, జీవితానికి అర్ధం ఏమిటి అన్న అవకాశాలను కల్పిస్తుంది. వాన్ గోహ్ హింస మరియు విషాదాలతో కూడిన జీవితాన్ని గడిపినప్పటికీ అతను ప్రకృతితో మమేకమై అబ్దుతమైన కళాఖండాలకు జీవం పోస్తాడు. గోహ్  పని అంతిమంగా ఆశావాదంగా ఉంటుంది. అతని దృక్పథం, విశ్వాసం మరియు దృష్టి దృశ్యమానంగా,  భౌతికంగా వ్యక్తీకరించలేనివిగా ఉంటాయి. 

  1. జీన్-పాల్ బెల్మోండోబీజీన్-లూక్ గొడార్డ్

దేశం సంవత్సరం భాష వ్యవధి: 

ఫ్రాన్స్ 1960 ఫ్రెంచ్ 90 నిమిషాలు రంగుల చిత్రం 

తారాగణం: జీన్-పాల్ బెల్మోండో , జీన్ సెబెర్గ్డేనియల్ బౌలాంగర్

సంగ్రహ కథ: మిచెల్ అనే  ఒక చిన్న దొంగ ఒక కారును దొంగిలించి అనుకోకుండా ఒక పోలీసును హత్య చేస్తాడు. ఇటలీ నుంచి పారిపోయి  దాక్కోవడానికి అతడు ఒక పథకాన్ని రూపొందిస్తాడు. తనతో పాటు వచ్చేలా తన ప్రేయసి ప్యాట్రిసియాను అతను ఒప్పిస్తాడు. 

 

 

 

***



(Release ID: 1772679) Visitor Counter : 101