మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2021 నవంబర్ 12 న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (ఎన్ ఎ ఎస్ )
Posted On:
10 NOV 2021 12:48PM by PIB Hyderabad
దేశంలో మూడు, ఐదు, ఎనిమిది, పది తరగతుల విద్యార్ధుల అభ్యసన , అంతరాలను నిర్ధారించడానికి మూడు సంవత్సరాల కాలానికి భారత ప్రభుత్వం నేషనల్ అచీవ్ మెంట్ సర్వే (ఎన్ ఎ ఎస్)ను అమలు చేస్తున్నది. గతంలో చివరి సారిగా నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేను ప్రభుత్వం 2017 నవంబర్ 13న మూడు , ఐదు, ఎనిమిదో తరగతులకు నిర్వహించింది.
తదుపరి విడత ఎన్ ఎ ఎస్ ను 2021 నవంబర్ 12న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.కోవిడ్ మహమ్మారి సమయంలో విద్యార్ధుల అభ్యసన సామర్ధ్యాలు, నూతన అభ్యసన పోకడలు వంటి వాటిని అంచనా వేయడానికి , తద్వారా అవసరమైన దిద్దుబాటు చర్యలకు ఇది ఉపకరిస్తుంది. పాఠశాలల శాంప్లింగ్, టెస్ట్ ఐటమ్‌ల ఖరారు, ఉపకరణాల అభివృద్ధి, పరీక్ష వంటి వాటిని ఎన్.సి.ఇ.ఆర్.టి రూపొందిస్తుంది. అయతే ఎంపిక చేసిన పాఠశాలల్లో పరీక్ష నిర్వహణను సిబిఎస్‌సి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో చేపడుతుంది. ఎన్ ఎ ఎస్ 2021 కింద మొత్తం పాఠశాలలు అంటే ప్రభుత్వ పాఠశాలలు ( కేంద్ర, రాష్ట్రప్రభుత్వ పాఠశాలల), ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుంది.
ఎన్.ఎ.ఎస్ 2021 కింద దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 733 జిల్లాలకు చెందిన 1.23 లక్షల పాఠశాలలలో ఈ సర్వే నిర్వహిస్తారు. ఎన్ ఎ ఎస్‌ను భాష, గణిత శాస్త్రం,ఇవిఎస్ లను మూడు , ఐదు తరగతుల వారికి, భాష, గణితం, సైన్సు , సోషల్ లలో 8 వతరగతి వారికి , భాష, గణితం, సైన్సు , సోషల్, ఇంగ్లీషు లలో పదవతరగతి వారిక అభ్యసన సామర్ధ్యాలపై పరీక్ష నిర్వహిస్తారు. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీషు, గుజరాతి, హింది, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠి, మిజో, ఒడియా, పంజాబి, తమిళ్ తెలుగు, ఉర్దూ, బోడో, గరో, ఖాసి, కొంకణి, నేపాలి, భుతియా, లెప్చా భాషలలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
సర్వేని నిష్పాక్షికంగా, సజావుగా నిర్వహించడానిఇక 1,82,488 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు, 1,23,,729 మంది పరిశీలకులను, 733 మంది జిల్లా స్థాయి కో ఆర్డినేటర్లను, జిల్లా నోడల్ అధికారులను వేరుగా నియమించారు. అలాగే 36 మంది రాష్ట్ర నోడల్ అధికారులను ఒక్కో రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి నియమించారు.సర్వే సజావుగా జరిగేలా చూడడానిఇక 1500 మంది బోర్డు ప్రతినిధులను నియమించారు. వీరందరికీ వారు నిర్వహించాల్సిన పాత్ర, విధులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
సిబిఎస్ ఇ ఛైర్మన్ అధ్యక్షతన ఎన్ ఎ ఎస్ నిర్వహణకు నేషనల్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్ ఎ ఎస్ 2021ను సజావుగా నిర్వహించేందుకు (https://nas.education.gov.in) పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. ఎన్ ఎ ఎస్ 2021 కు సంబంధించి జిల్లా , రాష్ట్ర స్థాయి రిపోర్ట్ కార్డులను ఎలిమెంటరీ, సెకండరీ స్థాయిలో విడుదల చేసి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.
***
(Release ID: 1770849)
Visitor Counter : 233