సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వర్చువల్ మోడ్‌లో 52వ ఐఎఫ్‌ఎఫ్‌ఐకి హాజరు కావడానికి మీడియా కోసం నమోదు ప్రారంభించబడింది

Posted On: 06 NOV 2021 12:22PM by PIB Hyderabad

గోవాలో జరుగుతున్న 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్‌ఐ) కార్యక్రమాలకు హాజరు కావాలనుకునే మీడియా వ్యక్తులు ఆన్‌లైన్ విధానంలో ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు. 2021 నవంబర్ 20 నుండి 28వ తేదీ వరకు డిజిటల్ మాధ్యమం ద్వారా వర్చువల్‌గా ఈ ఉత్సవంలో పాల్గొనాలనుకునే వారి కోసం  ఈ ప్రక్రియ నిర్వహించబడుతోంది. కింద ఇచ్చిన లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
https://virtual.iffigoa.org

ప్రస్తుతం కొనసాగుతున్న కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఆసియాలోని పురాతన మరియు భారతదేశపు అతిపెద్ద చలనచిత్రోత్సవం యొక్క 52వ ఎడిషన్  హైబ్రిడ్‌గా నిర్వహించబడుతుంది. మరియు ఉత్సవ సంబంధిత కార్యకలాపాలకు వర్చువల్‌ విధానంలో హాజరయ్యే అవకాశాలు ఉంటాయి. ఆన్‌లైన్‌లో పెద్ద సంఖ్యలో సినిమా ప్రదర్శన  ఉంటుంది. అదే కాకుండా అన్ని మీడియా సమావేశాలు పిఐబి ఇండియా యూట్యూబ్ ఛానెల్ youtube.com/pibindiaలో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జర్నలిస్టులు ఆన్‌లైన్‌లో ప్రశ్నలు అడగడానికి సదుపాయం ఉంటుంది.

1 జనవరి 2021 నాటికి 21 ఏళ్లు పైబడిన మీడియా వ్యక్తులు ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు గుర్తింపు పొందవచ్చు. మీడియా కోసం రిజిస్ట్రేషన్ ఉచితం. వర్చువల్‌గా కార్యక్రమానికి హాజరు కావడానికి లాగిన్ ఆధారాలతో పాటుగా గుర్తింపు పొందిన మీడియా వ్యక్తులు ఇమెయిల్/ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేయబడతారు. మీడియా ప్రతినిధులకు అందించబడిన వర్చువల్ రిజిస్ట్రేషన్ బదిలీ చేయబడదని దయచేసి గమనించండి. ఇంకా ఈ ఈవెంట్ 52వ ఐఎఫ్‌ఎఫ్‌ఐ వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌కు మాత్రమే పరిమితం చేయబడింది. వేడుక జరిగే వేదిక వద్ద భౌతిక ఉనికి కోసం ఇది ఉపయోగించబడదు.

ఐఎఫ్‌ఎఫ్‌ఐ  52వ ఎడిషన్‌కు వ్యక్తిగతంగా హాజరు కావాలనుకునే మీడియా ప్రతినిధులు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు: https://my.iffigoa.org/extranet/media/

ఐఎఫ్‌ఎఫ్‌ఐ గురించి:

1952లో స్థాపించబడిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ), ఆసియాలో అత్యంత ముఖ్యమైన చలనచిత్రోత్సవాలలో ఒకటి. ప్రస్తుతం గోవా రాష్ట్రంలో ఏటా నిర్వహించబడుతున్న ఈ ఉత్సవం..చలనచిత్ర కళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ప్రపంచంలోని సినిమాలకు ఒక ఉమ్మడి వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది; ఈ కార్యక్రమం  సామాజిక మరియు సాంస్కృతిక నైతికత నేపథ్యంలో వివిధ దేశాల చలనచిత్ర సంస్కృతుల అవగాహన మరియు ప్రశంసలకు దోహదం చేయడం; మరియు ప్రపంచ ప్రజల మధ్య స్నేహం మరియు సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఉత్సవాన్ని డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కింద) మరియు గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తాయి.

52వ ఐఎఫ్‌ఎఫ్‌ఐకు సంబంధించిన  తాజా సమాచారాన్ని  ఉత్సవంకు సంబంధించినవెబ్‌సైట్ www.iffigoa.orgలో మరియు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో ఐఎఫ్‌ఎఫ్‌ఐ  యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మరియు పిఐబి గోవా మరియు పిఐబి ముంబై సోషల్ మీడియా హ్యాండిల్‌లో కూడా యాక్సెస్ చేయవచ్చు. కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.

***



(Release ID: 1769857) Visitor Counter : 124