ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 02 NOV 2021 9:28AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 106.85 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 10,423 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది 259 రోజుల కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.21% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 15,021 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,36,83,581 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.45% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,53,776. ఇది 250 రోజుల కనిష్ట స్థాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.03%) గత 29 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (1.16%) గత 39 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 61.02 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****


(Release ID: 1768858) Visitor Counter : 210