ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఇప్పటిదాకా జీఎస్టీ వసూళ్ళలో రెండో అతి పెద్ద వసూలు 2021 అక్టోబర్ నెలలోనే


అక్టోబర్ జీ ఎస్టీ వసూళ్ళు రూ.1,30,127 కోట్లు
నిరుడు ఇదే నెల జీ ఎస్టీ కంటే ఈ అక్టోబర్ వసూళ్ళు 24% అధికం; 2019-20 కంటే 36% అధికం

Posted On: 01 NOV 2021 1:04PM by PIB Hyderabad

2021 అక్టోబర్ లో వసూలైన  స్థూల జీ ఎస్టీ  ఆదాయం రూ. 1,30,127 కోట్లుగా నమోదైంది. ఇందులో కేంద్ర జీ ఎస్టీ  రూ. 23,861 కోట్లు కాగా రాష్ట్రాల జీ ఎస్టీ  రూ. 30,421 కోట్లు. ఐ జీ ఎస్టీ  రూ. 67,361 కోట్లు కాగా ఇందులో వస్తువుల దిగుమతులకు సంబంధించిన   రూ. 32,998 కోట్లు కలిసి ఉంది.  దిగుమతులకు సంబంధించిన రూ. 699 కోట్లతో సహాయ సెస్ మొత్తం రూ. 8,484 కోట్లు. ఐజీ ఎస్టీ నుంచి ప్రభుత్వం సీ జీఎస్టీకి రూ. 27,310 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీకి రూ. 22,394 కోట్లు సర్దుబాటు చేసింది. సర్దుబాటు అనంతరం ఆక్టోబర్ లో రూ. 51171 కోట్ల సీ జీ ఎస్టీ, రూ. 52,815 కోట్ల ఎస్ జీ ఎస్టీ ఉంది.

2021 అక్టోబర్ నెలకు వచ్చిన ఆదాయం నిరుడు ఇదే నెల  ఆదాయం కంటే 24% ఎక్కువ. అదే సమయంలో 2019-20 కంటే 36% ఎక్కువ. ఈ నెలలో స్వదేశీ  సరకుల ఎగుమతుల మీద ఆదాయం 39% అధికంగా నమోదైంది. నిరుడు ఆదాయంతో పోల్చుకుంటే 19% ఎక్కువ. అక్టోబర్ 2021 లో జీ ఎస్టీ ఆదాయం జీ ఎస్టీ మొదలుపెట్టినప్పటినుంచీ చూస్తే రెండో అతిపెద్ద వసూలు. ఈ ఏడాది ఏప్రిల్ లో వసూలైనదే అత్యధికం కాగా దానికి కారణం ఏడాది ముంగిపు కావటం మాత్రమే.

ఇది కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం. కరోనా  రెండో వేవ్  తరువాత ఇంతగా పెరుగుదల కావటాన్ని కొత్త  ఈ-వే బిల్స్  తయారుకావటంలోనే అర్థమవుతోంది. సెమీ కాండక్టర్ల దిగుమతిలో ఇబ్బందులు రావటం వల్ల కార్ల అమ్మకాలు పడిపోకపోతే ఈ ఆదాయం మరింత ఎక్కువగా ఉండేది. ఈ నెలలో పెరుగుదలను పట్టికలో చూస్తే ఆర్థిక వ్యవస్థ కోలుకోవటం స్పష్టంగా కనబడుతోంది.

కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల పన్ను అధికారుల కృషి ఫలితంగా గత నెలకంటే వసూళ్ళు పెరిగాయి.   పన్ను ఎగవేటాదారుల పట్ల కఠినంగా వ్యవహరించటంతోబాటు జీ ఎస్టీ కౌన్సిల్ అనుసరిస్తున్న బహుముఖ వ్యూహం ఫలితంగా జీ ఎస్టీ వసూళ్ళు పెరుగుతున్నాయి.  అందరూ పన్ను చెల్లింపు విధానాలు పాటించేలా ఎస్ ఎం ఎస్ ద్వారా రిటర్న్స్ ఫైల్ చేయటం, ప్రతి త్రైమాసికానికీ పన్ను చెల్లింపు విధానం అమలు చేయటం  కూడా సత్ఫలితాలనిచ్చాయి. మరోవైపు సకాలంలో రిటర్న్   లు సకాలంలో దాఖలు చేసేలా తీసుకుంటున్న కఠిన చర్యలు కూడా ఫలించాయి. రిటర్న్ లు దాఖలు చేయని వారి ఈ –వే బిల్లులు నిలిపివేయటం వలన కూడా వసూళ్ళు సక్రమంగా జరగటానికి దారితీశాయి.

దీనికి తోడు వివిధ సందర్భాలలో రిటర్న్ లు దాఖలు చేయటాన్ని ప్రోత్సహిస్తూ కౌన్సిల్ లేట్ ఫీజు రద్దు చేయటం వలన ఎప్పటికప్పుడు కట్టటానికి చాలామంది ముందుకొచ్చారు. ఆ విధంగా నెలనెలా పెరుగుతూ వచ్చింది. .2021 జులై లో 1.5 కోట్ల రిటర్న్స్ దాఖలయ్యాయి. సడలింపుల కారణంగా ఈ విధమైన పెరుగుదల సాధ్యమైంది.


మొత్తంగా చూస్తే, ఈ కృషి ఫలితంగా అధిక ఆదాయాలు వాస్తు ఉన్నాయి. క్రింది చార్ట్ చూస్తే రాష్ట్రాల వారీగా పన్ను వసూళ్ళు అక్టోబర్ లో ఈ విధంగా ఉన్నాయి.

రాష్ట్రా లవారీగా 2021 అక్టోబర్ లో జీ ఎస్టీ  ఆదాయం  

 

రాష్ట్రం

అక్టోబర్ -20

అక్టోబర్ 21

పెరుగుదల

జమ్ము కాశ్మీర్

377

648

72%

హిమాచల్ ప్రదేశ్

691

689

0%

పంజాబ్

1,376

1,595

16%

చండీగఢ్

152

158

4%

ఉత్తరాఖండ్

1,272

1,259

-1%

హర్యానా

5,433

5,606

3%

ఢిల్లీ

3,211

4,045

26%

రాజస్థాన్

2,966

3,423

15%

ఉత్తరప్రదేశ్

5,471

6,775

24%

బీహార్

1,010

1,351

34%

సిక్కిం

177

257

45%

అరుణాచల్ ప్రదేశ్

98

47

-52%

నాగాలాండ్

30

38

30%

మణిపూర్

43

64

49%

మిజోరం

32

32

1%

త్రిపుర

57

67

17%

మేఘాలయ

117

140

19%

అస్సాం

1,017

1,425

40%

పశ్చిమా బెంగాల్

3,738

4,259

14%

జార్ఖండ్

1,771

2,370

34%

ఒడిశా

2,419

3,593

49%

ఛత్తీస్ గఢ్

1,974

2,392

21%

మధ్య ప్రదేశ్

2,403

2,666

11%

గుజరాత్

6,787

8,497

25%

డామన్ అండ్ నాగర్ హవేలి

7

0

-99%

దాద్రా, నాగర్ హవేలి

283

269

-5%

మహారాష్ట్ర

15,799

19,355

23%

కర్ణాటక

6,998

8,259

18%

గోవా

310

317

3%

లక్షదీవులు

1

2

86%

కేరళ

1,665

1,932

16%

తమిళనాడు

6,901

7,642

11%

పుదుచ్చేరి

161

152

-6%

అండమాన్, నికోబార్ దీవులు

19

26

40%

తెలంగాణ

3,383

3,854

14%

ఆంధ్రప్రదేశ్

2,480

2,879

16%

లద్దాఖ్

15

19

32%

ఇతర ప్రాంతాలు

91

137

51%

కేంద్ర పరిధి

114

189

66%

Grand Total

80,848

96,430

19%

 

***

 



(Release ID: 1768582) Visitor Counter : 253