ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జి20 నేతల శిఖర సమ్మేళనం నేపథ్యం లో ప్రధాన మంత్రి మరియు ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఆఫ్ జ‌ర్మ‌నీ చాన్స్ ల‌ర్ డాక్టర్ ఎంజలా మర్కెల్ కు మధ్య జరిగిన సమావేశం

Posted On: 31 OCT 2021 10:30PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబరు 31న ఇటలీ లోని రోమ్ లో జి20 శిఖర సమ్మేళనం జరిగిన నేపథ్యం లో ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఆఫ్ జ‌ర్మ‌నీ చాన్స్ ల‌ర్ డాక్టర్ ఎంజలా మర్కెల్ తో భేటీ అయ్యారు.

ఉభయుల మధ్య దీర్ఘకాలం గా ఉన్న మైత్రి మరియు సహకారాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ, చాన్స్ లర్ మర్కెల్ గారు ఒక్క జర్మనీ లోనే కాకుండా యూరోప్ లో, ఇంకా ప్రపంచ స్థాయి లో అందిస్తున్నటువంటి నాయకత్వాని కి గాను ఆమె కు అభినందన లు తెలియజేశారు. డాక్టర్ మర్కెల్ యొక్క ఉత్తరాధికారి తో సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించే విషయం లో వచనబద్ధత ను ఆయన వ్యక్తం చేశారు.

 

భారతదేశాని కి మరియు జర్మనీ కి మధ్య గల సన్నిహిత ద్వైపాక్షిక సహకారం పట్ల నేతలు ఇరువురు సంతృప్తి ని వ్యక్తం చేయడం తో పాటు రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాల ను, పెట్టుబడి సంబంధాల ను గాఢతరం చేసుకోవాలని కూడా ప్రతిన బూనారు. గ్రీన్ హైడ్రోజన్ సహా, కొత్త కొత్త రంగాల కు భారతదేశం-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యం పరిధి ని విస్తరింప చేయడం కోసం వారు అంగీకారాన్ని వ్యక్తం చేశారు.

భవిష్యత్తు కాలానికి గాను డాక్టర్ మర్కెల్ కు ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు; భారతదేశాన్ని సందర్శించడానికి రావలసిందంటూ ఆమె కు ఆహ్వానం పలికారు.


 

***




(Release ID: 1768530) Visitor Counter : 84