ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ20 శిఖరాగ్ర సదస్సు, సమావేశం 1 : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆరోగ్యం పై ప్రధాన మంత్రి ప్రసంగపాఠం

Posted On: 30 OCT 2021 11:55PM by PIB Hyderabad

 

 

శ్రేష్టులారా,

కరోనా ప్రపంచ మహమ్మారిపై పోరాడటానికి, మనం ప్రపంచానికి ఒకే భూమి - ఒక ఆరోగ్యం అనే దార్శనికత ను ప్రపంచం ముందుకు తెచ్చాము.

భవిష్యత్తులో అటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి, ఈ దార్శనికత ప్రపంచంలో గొప్ప శక్తిగా మారగలదు.

శ్రేష్టులారా,

ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ పాత్రను పోషిస్తూ, భారతదేశం 150 కంటే ఎక్కువ దేశాలకు మందులను పంపిణీ చేసింది.

దీనితో పాటు, వ్యాక్సిన్ పరిశోధన మరియు తయారీని పెంచడంలో కూడా మేము మా పూర్తి శక్తిని ఉంచాము.

తక్కువ వ్యవధిలో, మేము భారతదేశంలో ఒక బిలియన్ వ్యాక్సిన్ మోతాదులను అందించాము.

ప్రపంచ జనాభాలో ఆరవ వంతు మందిలో సంక్రమణను నియంత్రించడం ద్వారా, ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడంలో భారతదేశం కూడా దోహదపడింది . వైరస్ మరింత ఉత్పరివర్తనం చెందే అవకాశాన్ని కూడా తగ్గించింది.

శ్రేష్టులారా,

ఈ మహమ్మారి విశ్వసనీయమైన సరఫరా గొలుసు అవసరాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసింది.

ఈ పరిస్థితిలో భారతదేశం విశ్వసనీయమైన తయారీ కేంద్రంగా అవతరించింది.

ఇందుకోసం భారతదేశం సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలకు కొత్త ప్రేరణను ఇచ్చింది.

మేము వ్యాపారం చేయడానికి చాలా ఖర్చును తగ్గించాం, ప్రతి స్థాయిలో సృజనాత్మకతను పెంచాం.

భారత దేశాన్ని ఆర్థిక రికవరీ, సరఫరా గొలుసు వైవిధ్యతలో ఒక నమ్మకమైన భాగస్వామిగా మార్చవలసిందిగా నేను జీ 20 దేశాల ను ఆహ్వానిస్తున్నాను.

 

శ్రేష్టులారా,

కోవిడ్ కారణంగా జీవితంలో అంతరాయాలు రాని అంశం బహుశా ఏదీ లేదు.

అటువంటి తీవ్రమైన పరిస్థితిలో కూడా, భారతదేశ ఐటి-బిపిఒ రంగం రెండవ కోవిడ్ అంతరాయాన్ని అనుమతించలేదు, మొత్తం ప్రపంచానికి మద్దతు ఇవ్వడానికి 24 గంటలూ పనిచేసింది.

మీలాంటి నాయకులు, సమావేశాల సమయంలో, భారతదేశం విశ్వసనీయ భాగస్వామి పాత్రను ఎలా పోషించిందని ప్రశంసించినందుకు నేను సంతోషిస్తున్నాను.

ఇది మన యువ తరంలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

మరియు ఇది జరిగింది ఎందుకంటే, సమయాన్ని వృథా చేయకుండా, భారతదేశం ఎక్కడి నుండైనా పనికి సంబంధించి అపూర్వమైన సంస్కరణలు చేసింది.

శ్రేష్టులారా,

15 శాతం, కనీస కార్పొరేట్ పన్ను రేటు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మరింత 'నిష్పాక్షికంగా' చేయడానికి ఒక ముఖ్యమైన అడుగు.

2014 జీ-20 సమావేశంలో నేనే దీనిని సూచించాను. ఈ దిశలో ఖచ్చితమైన పురోగతిని సాధించినందుకు నేను జీ-20 కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఆర్థిక సంస్కరణల కోసం అంతర్జాతీయ మార్పిడిని పెంచాల్సిన అవసరం ఉంది.

దీని కోసం వివిధ దేశాల వ్యాక్సిన్ సర్టిఫికేట్ ల పరస్పర గుర్తింపును నిర్ధారించుకోవాలి.

శ్రేష్టులారా,

భారతదేశం తన అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చడంలో ఎల్లప్పుడూ అంకితభావాన్ని చూపించింది.

ఈ రోజు, ఈ జీ-20 వేదిక పై, వచ్చే ఏడాది ప్రపంచానికి 5 బిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను ఉత్పత్తి చేయడానికి భారతదేశం సిద్ధమవుతోందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.

భారతదేశ నిబద్ధత ఖచ్చితంగా ప్రపంచంలో కరోనా సంక్రామ్యతలను నిరోధించడంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి.

 

అందువల్ల, సాధ్యమైనంత త్వరగా 'డబ్ల్యూ హెచ్ వో' ద్వారా భారతీయ వ్యాక్సిన్ లను గుర్తించాల్సిన అవసరం ఉంది.

 

ధన్యవాదాలు.

 

******


(Release ID: 1768279) Visitor Counter : 207