ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

106.14 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 68 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

98.20 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 12,830 కొత్త కేసులు నమోదు

క్రియాశీల కేసుల సంఖ్య 1,59,272. ఇది 247 రోజుల కనిష్ట స్థాయి

వారపు పాజిటివిటీ రేటు (1.18 శాతం) గత 37 రోజులుగా 2 శాతం కంటే తక్కువ

Posted On: 31 OCT 2021 9:33AM by PIB Hyderabad

భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 106.14 కోట్ల డోసులను దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన  68,04,806 డోసులతో కలిపి, 106.14 కోట్ల డోసులను (1,06,14,40,335) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,06,01,975 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,79,018

రెండో డోసు

92,21,867

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,71,653

రెండో డోసు

1,59,27,866

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

41,83,92,813

రెండో డోసు

14,17,87,899

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

17,47,82,442

రెండో డోసు

9,62,71,341

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

10,96,95,172

రెండో డోసు

6,66,10,264

మొత్తం

1,06,14,40,335

 

గత 24 గంటల్లో 14,667 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,36,55,842 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.20 శాతానికి చేరింది.

 

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 126వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 12,830 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

క్రియాశీల కేసులు 2 లక్షల కంటే తక్కువగా, 1,59,272 వద్ద ఉన్నాయి. ఇది 247 రోజుల కనిష్ట స్థాయి. పాజిటివ్ కేసుల శాతం కూడా (0.46) 2020 మార్చి నుంచి కనిష్ట స్థాయి.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,35,142 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 60.83 కోట్లకు పైగా (60,83,19,915) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.18 శాతంగా ఉంది. గత 37 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.13 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 27 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా, 62 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

****



(Release ID: 1768189) Visitor Counter : 141