నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌లో 'రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సిస్టమ్' ప్రారంభం


- భారత దేశంలోని ప్ర‌ధాన‌ పోర్ట్‌లలో రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సిస్టమ్ ఏర్పాటు మొద‌టిసారి

प्रविष्टि तिथि: 26 OCT 2021 12:47PM by PIB Hyderabad

సమర్థవంతమైన దీర్ఘ శ్రేణి మెరైన్ కమ్యూనికేషన్‌ను అందించడానికి  అవసరమైన సొల్యూష‌న్స్‌ దృష్ట్యా కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ  పోర్ట్‌ (ఎస్ఎంపీ, కోల్‌కతా) వద్ద రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఆర్ఓఐపీ) సిస్టమ్‌ను సోమ‌వారం సాయంత్రం ప్రారంభించారు. ఆర్ఓఐపీ వ్యవస్థ మెరైన్ కమ్యూనికేషన్ మోడ్‌గా పరిచయం చేయబడుతోంది, భారత దేశంలోని ప్ర‌ధాన‌ పోర్ట్‌లలో రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సిస్టమ్ ఏర్పాటు చేయ‌డం ఇది మొద‌టిసారి. ఇది కోల్‌కతాలోని హుగ్లీ నది ఈస్ట్యూరీని నుంచి సాండ్‌హెడ్స్ వరకు గ‌త ప్రాంతాన్ని క‌వ‌ర్ చేస్తుంది.  మొత్తం నాలుగు స్థానాల్లో ఇది బేస్ స్టేషన్ల‌ను క‌లిగి  ఉంటుంది. ఈ సదుపాయంతో  తుఫానులు, ఇత‌ర ప్రతికూల వాతావరణాల‌ సమయంలో సాండ్ హెడ్స్ వద్ద ఉన్న నౌకలను నేరుగా కోల్‌కతా నుండి రేడియో ద్వారా స‌మాచారాన్ని తెలియజేసేందుకు వీలు ప‌డుతుంది. ఆర్ఓఐపీ వ్య‌వ‌స్థ ఏర్పాటును కోల్‌కతాలోని ఎస్ఎంపీ చైర్మన్ శ్రీ వినిత్ కుమార్అ భినందించారు. దేశంలోని ఏకైక నదీతీర నౌకాశ్రయం అయినప్పటికీ,ఎస్ఎంపీ కోల్‌కతా గత 152 సంవత్సరాలుగా భారత ప్ర‌ధాన నౌకాశ్ర‌యాల‌లో తన కీలక స్థానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 1766744) आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil