రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'ఫార్మస్యూటికల్స్, వైద్య పరికరాల రంగంలో అవకాశాలు, భాగస్వామ్యాలు' పై 2021 అక్టోబర్ 27వ తేదీన ఇన్వెస్టర్ సమ్మిట్ లో ప్రసంగించనున్న డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


ఫార్మస్యూటికల్స్ విభాగం ఇన్వెస్ట్ ఇండియాతో కలిసి ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహణ

వైద్య పరికరాల రంగం ప్రస్తుతం ఉన్న 11 బిలియన్ల యుఎస్ డాలర్ల నుండి వచ్చే కొన్ని సంవత్సరాలలో 50 బిలియన్ల యుఎస్ డాలర్లకు వృద్ధి చెందుతుంది

వైద్య పరికరాలకు సంబంధించి పిఎల్ఐ పథకం కింద ఇప్పటికే 13 కంపెనీల ఎంపిక

Posted On: 25 OCT 2021 1:11PM by PIB Hyderabad

ఫార్మస్యూటికల్స్, వైద్య పరికరాల రంగంలో ప్రపంచంలోనే భారత దేశం మరింత పటిష్టమైన స్థానానికి చేరుకోడానికి ఒక దార్శనికతతో ముందుకు  అడుగులు వేస్తోంది. ఈ దిశగా పార్మాసిటీకాల్స్ డిపార్ట్మెంట్- ఇన్వెస్ట్ ఇండియా సంస్థ భాగస్వామ్యంతో ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగున్నర వరకు ఇన్వెస్టర్ సమ్మిట్ ను నిర్వహించనున్నది. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతుంది. 

ఫార్మస్యూటికల్స్, వైద్య పరికరాల రంగంలో అవకాశాలు, భాగస్వామ్యాలు అనే ఇతివృత్తంతో నిర్వహించే ఈ సదస్సు, వివిధ సాంకేతిక పరమైన అంశలు, భవిష్యత్ ప్రణాళికలపై సవివరంగా సమాలోచనలు జరిపే వేదిక కానున్నది.

ముఖ్యంగా ఈ సదస్సులో బయోఫార్మా అవకాశాలకు మరింత మార్గాన్ని సుగమం చేయడం, ప్రపంచంలోనే బయోఫార్మా హబ్ గా భారత్ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసేలా వివిధ సెషన్లు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు, భారత వైద్య పరికరాల ఉత్పత్తికి జరిగిన పరిశోధన అభివృద్ధిలో విజయగాథలు, వాక్సిన్ తయారీ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడంలో అనుసరించిన వ్యూహాలు, ఫార్మా, వైద్య పరికరాల ఉత్పత్తి రంగాల్లో అంకురా సంస్థల స్థాపన, ఆర్థిక సహాయం, పెట్టుబడులకు ఆస్కారం .... వంటి అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పిఎల్ఐ)  పథకం కింద మందుల తయారీ, వైద్యపరికరాల ఉత్పత్తి పెట్టుబడిదారులకు నియంత్రణ ప్రక్రియ మరింత వెసులుబాటులో ఉండే అంశాలు కూడా ఈ సదస్సులో చర్చకు రానున్నాయి. 

బయో-ఫార్మస్యూటికల్స్, బయోలాజిక్స్, బయో-సిమిలర్స్, కణ-జన్యు చికిత్స ప్రక్రియ, వాక్సిన్ తయారీ సామర్థ్యాలని మరింత విస్తరించడం లో అవసరమైన ఉత్పత్తుల తయారీ లో వినూత్న ఆలోచనలపై కూడా సమాలోచనలు జరుగుతాయి. ఫార్మస్యూటికల్స్ కోసం రూ.15,000 కోట్ల వ్యయ అంచనాతో ప్రారంభించిన పిఎల్ఐ ఆకర్షణగా నిలిచింది. సుమారు 278 కంపెనీలు ఈ పథకం కింద తమ ప్రతిపాదనలు దాఖలు చేసాయి.    

వైద్య పరికరాల రంగానికి సంబంధించి, ఈ సెషన్‌లలో భారతదేశం వైద్య పరికరాలకు అవకాశాలకు ఆలంబనగా ఎలా అభివృద్ధి చెందుతుందనే దానిపై చర్చలు జరుగుతాయి. వైద్య పరికరాల రంగం ఒక కొత్త అవకాశంగా ముందుకొచ్చింది. దాని ఆసరాగా పరిశ్రమలు వృద్ధి సాధించే అవకాశం ఉంది. ప్రస్తుత స్థాయి 11 బిలియన్ల అమెరికన్ డాలర్ల నుండి తదుపరి కొన్ని సంవత్సరాలలో 50 బిలియన్ల డాలర్ల పరిమాణం పెరుగుతుందని అంచనా. ఈ ఏడాది ప్రారంభంలో వైద్య పరికరాల కోసం పిఎల్ఐ పథకం కింద 13 కంపెనీలను ఎంపిక చేయడం జరిగింది, ఇది లక్ష్య పరికరాల దేశీయ తయారీని మెరుగుపరచడంలో వారి పెట్టుబడికి మద్దతునిస్తుంది.

ఈ సదస్సులో సెషన్‌లు అభివృద్ధి చెందుతున్న స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ ఫైనాన్సింగ్‌ను కూడా చర్చిస్తాయి. పిఎల్ఐ పథకం కింద ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు పెట్టుబడులను సజావుగా గ్రౌండింగ్ చేయడం గురించి సమగ్రమైన సౌకర్యాన్ని అందించడంపై చర్చ ఉంటుంది. 

 

****


(Release ID: 1766603) Visitor Counter : 180