యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఫిఫా సీఈఓ యూరి డిజోర్కెఫ్ ను కలిసిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్
ఫుట్‌బాల్ ను క్షేత్ర స్థాయిలో ప్రోత్సహించడానికి టోర్నమెంట్లు, కార్యక్రమాల నిర్వహణపై చర్చించిన మంత్రి
Posted On:
25 OCT 2021 6:30PM by PIB Hyderabad
ఫిఫా సీఈఓ యూరి డిజోర్కెఫ్ ను కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఈ రోజు ఢిల్లీలో కలసి దేశంలో ఫుట్‌బాల్ క్రీడకు ప్రాచుర్యం కల్పించే అంశంపై చర్చలు జరిపారు. మరింత ఎక్కువ సంఖ్యలో టోర్నమెంట్లను నిర్వహించడం, కార్యక్రమాలను చేపట్టడం లాంటి అంశాల ద్వారా ఫుట్‌బాల్ కు కింది స్థాయిలో గుర్తింపు, ప్రాచుర్యం కల్పించడానికి గల అవకాశాలను యూరి డిజోర్కెఫ్ తో శ్రీ అనురాగ్ సింగ్ చర్చించారు. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన విజయాలతో దేశంలో క్రీడల పట్ల ఆసక్తి పెరిగిందని మంత్రి అన్నారు. దేశంలో క్రీడా సంస్కృతికి రూపకల్పన చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయ సాధన దిశగా ఇటీవల వేగంగా అడుగులు పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

ఫుట్‌బాల్ క్రీడలో తాను సాధించిన కొన్ని మెళుకువలను ఫిఫా సీఈఓ ప్రదర్శించారు. ఫుట్‌బాల్ పట్ల ఆసక్తి కలిగి ఉన్న శ్రీ అనురాగ్ సింగ్ ఫుట్‌బాల్ తో ఆడి ఫిఫా సీఈఓని ఆకట్టుకున్నారు.

***
(Release ID: 1766419)