జౌళి మంత్రిత్వ శాఖ

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జియో-సింథటిక్స్ వినియోగంపై సిబ్బందికి నైపుణ్యత / సాంకేతిక సిబ్బంది నియామకానికి ఆమోదం


ఎన్‌టిటిఎమ్ కింద ఐఐఎస్‌సి బెంగళూరు, ఐఐటి మద్రాస్ మరియు ఐఐటి రూర్కీసహకారంతో టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగంలో నైపుణ్యత/ శిక్షణ

Posted On: 25 OCT 2021 1:07PM by PIB Hyderabad

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో (రోడ్డు. జాతీయ రహదారులు రైల్వేలునీటి వనరులు) జియో-టెక్స్‌టైల్‌ల అప్లికేషన్‌తో సంబంధం ఉన్న  డిజైన్/ కమిషన్ టెక్నికల్ సిబ్బంది నైపుణ్య అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలను అందించడానికి రూపొందిన  పైలట్ ప్రాజెక్టును కేంద్ర జౌళి శాఖ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని (i) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్బెంగళూరు, (ii) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీమద్రాస్ (iii) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీరూర్కే   లు అమలు చేస్తాయి. సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలను సమన్వయం చేస్తూ ఆయా సంస్థలు కార్యక్రమ అమలును పర్యవేక్షిస్తాయి.  ఈ కోర్సులను నిర్వహించడానికి బెంగుళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి ప్రొఫెసర్ జి.ఐ. శివకుమార్ బాబు, ఐఐటీ మద్రాసు నుంచి ప్రొఫెసర్ రాజగోపాల్ కర్పూరపు, ఐఐటీ రూర్కే నుంచి ప్రొఫెసర్ సత్యేన్ద్ర మిట్టల్ తమ తమ సంస్థల నుంచి పర్యవేక్షిస్తారు. 

ఒక బృందంలో 75 నుంచి 100 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. పైలట్ ప్రాజెక్టు దశలో మూడు సంస్థల్లో రెండు బృందాలు శిక్షణ పొందేలా ప్రణాళిక రూపొందింది. జౌళి మంత్రిత్వ శాఖ లేదా మిషన్ డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్ (ఎన్‌టిటిఎమ్) నిర్వహించే సమీక్ష అనంతరం శిక్షణాభివృద్ది  కార్యక్రమ కొనసాగింపు ఆధారపడి ఉంటుంది.

లాభాపేక్ష లేకుండా ఈ సంస్థలు కోర్సులను నిర్వహించడానికి అంగీకరించాయి. కోర్సుల వివరాలు, అర్హత ( నిర్ధేశించిన విద్యార్హతలు కలిగి సంబంధిత ఇంజినీరింగ్ రంగంలో అనుభవం కలిగి ఉన్న భారత పౌరులు) ఇతర  వివరాలతో ఈ సంస్థలు ప్రకటన జారీ చేసి ధరఖాస్తులు ఆహ్వానిస్తాయి. ఒక అభ్యర్థి నుంచి నామమాత్ర రుసుముగా 1000 రూపాయలను వసూలు చేయడం జరుగుతుంది. కనీసం 75 మంది అభ్యర్థులను కలిగి ఉన్న బ్యాచ్(లు)ఎంపిక అయిన తరువాత జౌళి మంత్రిత్వ శాఖ  పూర్తి మొత్తాన్ని లేదా ఎంపిక అయిన ప్రతి బృందానికి అడ్వాన్స్‌గా  4.50 లక్షల రూపాయలను ఆయా సంస్థలకు అందిస్తుంది. బ్యాచ్/కోర్సు పూర్తయిన తర్వాత ప్రతి సంస్థ ఖర్చుల వివరాలను మంత్రిత్వ శాఖకు సమర్పించి ఖర్చు కాకుండా మిగిలిన నిధులను ప్రభుత్వానికి తిరిగి పంపుతుంది. 

సంబంధిత కేంద్ర ప్రభుత్వ/ రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారంతో జౌళి మంత్రిత్వ శాఖ శిక్షణ ఇవ్వడానికి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. సరైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి తగిన చర్యలను ( సామాజిక మాధ్యమాలు, పూర్వ విద్యార్థుల సహకారంతో) తీసుకోవాలని శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేసిన సంస్థలను మంత్రిత్వ శాఖ కోరడం జరిగింది. 

***



(Release ID: 1766349) Visitor Counter : 162