నౌకారవాణా మంత్రిత్వ శాఖ

దిబ్రూగఢ్‌లో స‌రుకు ర‌వాణా టెర్మినల్, ప‌ర్య‌ట‌కుల జెట్టీ, నదీతీర అభివృద్ధి స్థ‌లాన్ని ప‌రిశీలించిన షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్


- భారతదేశంలోని ప్రధాన నదీ నౌకాశ్రయంగా దిబ్రూఘర్ కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువ‌స్తాంః మంత్రి

Posted On: 24 OCT 2021 4:56PM by PIB Hyderabad

దిబ్రూగఢ్‌లో స‌రుకు ర‌వాణా టెర్మినల్, ప‌ర్య‌ట‌కుల  జెట్టీ,  నదీ తీర ప్రాంత‌ అభివృద్ధికి గాను ప్ర‌తిపాదిత  స్థ‌లాన్ని కేంద్ర ఓడ రేవులు, షిప్పింగ్, జల మార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ సందర్శించారు, దిబ్రూగఢ్‌లోని బోగిబీల్ వంతెన సమీపంలో గ‌ల టెబ్రినల్, టూరిస్ట్ జెట్టి, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్  
ప్రాజెక్ట్‌లు పనులు జ‌రుగుతున్నాయి. ఈ ప‌నుల‌ను వేగంగా అమలు చేయడం ప్రారంభించడానికి ఈ సందర్భంగా మంత్రి భాగ‌స్వామ్య ప‌క్షాల వారితో సమావేశం నిర్వహించారు. దిబ్రూఘర్ న‌దీ నౌకాశ్ర‌మంగా
వలసరాజ్యాల కాలంలో ఒక ప్రధాన నదీ నౌకాశ్రయంగా వెలుగొందింది. భారతదేశ ఆర్థికవృద్ధికి ఇది త‌న‌ ముఖ్యమైన సహకారాన్ని అందించింది. దిబ్రూగఢ్‌ని దేశంలోని ఒక ప్రధాన నది పోర్టుగా మార్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. "ఎన్‌డ‌బ్ల్యు2  (బ్రహ్మపుత్ర) మరియు ఎన్‌డ‌బ్ల్యు 16 (బరాక్) లను అభివృద్ధి చేసేందుకు గాను ప్ర‌ధాన మంత్రి  శ్రీ నరేంద్ర మోదీ అందించిన అవకాశాలు బంగ్లాదేశ్‌తో మన అనుసంధాన‌త‌ను మెరుగుపరుస్తున్నాయి మరియు ప్రపంచ మార్కెట్లకు చేరుకోవడానికి మ‌నకు మార్గాన్ని చూపుతున్నాయి. అందుకే మేము ఎంఎంఎల్‌పీలను ఏర్పాటు చేస్తున్నాము.  అస్సాంలోని వివిధ ప్రాంతాల్లో నదీ నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నాము అని అన్నారు. దిబ్రూగఢ్‌లో, సరుకు మరియు ప్రయాణీకుల కోసం ఓడరేవు నిర్మించబడుతుందని మంత్రి చెప్పారు. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ, అస్సాం ప్రభుత్వ అంతర్గత జల రవాణా శాఖ మరియు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే కలిసి బోగీబీల్ వంతెన సమీపంలోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు.  "ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ ఈశాన్య ప్రాంతాలను కనెక్టివిటీ హబ్‌గా మార్చింది.  ప్రధాన మంత్రి గతిశక్తి - నేషనల్ మాస్టర్ ప్లాన్ నేతృత్వంలో, బ్రహ్మపుత్ర నదిపై సరుకుల ర‌వాణాను వేగవంతం చేయడానికి ఒక సమీకృత ప్రణాళిక రూపొందించబడింది. ఇది ఉపాధి మార్గాలను తెరుస్తుంది.  స్థానిక ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ ప్రాప్తిని అందిస్తుంది"  అని కేంద్ర మంత్రి చెప్పారు. మెరుగైన అనుసంధాన‌త  ప్రజల జీవితాల్లో సముద్ర మార్పును ఎలా తీసుకువస్తోందో, ఈ ప్రాంతంలోని యువత,  వ్యాపారాలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్‌లకు చేరుకోవడానికి, లోకల్ ఫర్ గ్లోబల్‌కు ఆదర్శంగా నిలుస్తున్నాయని కూడా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డ‌బ్ల్యుఏఐ సభ్యుడు (టెక్నికల్) శ్రీ అశుతోష్ గౌతమ్, అస్సాం ప్ర‌భుత్వ  ప్రిన్సిపల్ కమిషనర్ (రవాణా) శ్రీ కె.కె. ద్వివేది, ఎన్ఎఫ్ రైల్వే జీఎం శ్రీ అన్షుల్ గుప్తా, అధికారులు మరియు ఇత‌ర ప్రముఖులు పాల్గొన్నారు.        
                                                                             

****(Release ID: 1766235) Visitor Counter : 167