మంత్రిమండలి
కేంద్రప్రభుత్వ ఉద్యోగుల కు అధిక ధరల భత్యం మరియు పింఛను దారుల కు డియర్ నెస్ రిలీఫ్ తాలూకు ఒక అదనపు కిస్తీ ని 2021 జులైఒకటో తేదీ నుంచి అమలయ్యే విధం గా విడుదల చేయడానికి ఆమోదం తెలిపిన మంత్రి మండలి
మూల వేతనం/పింఛను లో 28 శాతం గా ఉన్న ప్రస్తుత రేటు కంటే 3 శాతం పెంపుదల
47.14 లక్షలమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కు, 68.62 లక్షల మంది పింఛన్ దారుల కు ఇదిప్రయోజనాన్ని అందించగలదు
అధిక ధరల భత్యం మరియు డియర్ నెస్ రిలీఫ్.. ఈ రెండిటి కారణం గా ఖజానా పై సంవత్సరానికి 9,488.70 కోట్ల రూపాయల మేరకు భారం పడుతుంది
Posted On:
21 OCT 2021 3:31PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కు అధిక ధర ల భత్యం (డిఎ) తో పాటు పింఛన్ దారుల కు డియర్ నెస్ రిలీఫ్ (డిఆర్) తాలూకు ఒక అదనపు కిస్తీ ని ఈ సంవత్సరం జులై ఒకటో తేదీ నుంచి అమలు లోకి వచ్చే విధం గా విడుదల చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. మూలవేతనం/పెన్శన్ లో 28 శాతం గా ప్రస్తుతం ఉన్న రేటు కంటే ఇది 3 శాతం వృద్ధి ని సూచిస్తుంది. ధరల లో పెరుగుదల కు పరిహారం గా దీని ని అమలు పరుస్తారు.
ఏడో కేంద్ర వేతన సంఘం సిఫారసుల పై ఆధారపడినటువంటి ఒక ఆమోదయోగ్యమైన సూత్రాని కి అనుగుణం గా ఈ వృద్ధి ఉంది. కరవు భత్యం మరియు డియర్ నెస్ రిలీఫ్.. ఈ రెండిటి సంయుక్త ప్రభావం ఖజానా పై ప్రతి సంవత్సరాని కి 9,488.70 కోట్ల రూపాయల మేరకు ఉంటుంది. ఇది దాదాపు గా 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కు, 68.62 లక్షల మంది పింఛను దారుల కు లబ్ధి ని చేకూర్చుతుంది.
***
(Release ID: 1765477)
Visitor Counter : 325
Read this release in:
Gujarati
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam